Just In
- 34 min ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 2 hrs ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 3 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
- Finance
Petrol, Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?
సాధారణంగా కొన్ని సార్లు చిన్న చిన్న విషయాల వల్ల కూడా ఎక్కువ నష్టాలు కలుగుతాయి. దీనికి ఉదాహరణలు కోకొల్లలు.. ఒక విమానం ఎగురుతున్నపుడు చిన్న పక్షులు అడ్డుపడితే విమానానికి చాలా ప్రమాదం సంభవిస్తుంది. ఇలాంటి సంఘటనలు మీరు ఇది వరకే విని ఉంటారు.

ఇంతకీ పక్షులకు మరియు విమానాలకు గల సంఘర్షణ ఏమిటి, పైలెట్లు పక్షులను ఢీ కొట్టకుండా ఎలా తప్పించుకుంటారు అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

పక్షుల ఆకస్మిక దాడుల వల్ల కలిగే ప్రమాదాలు:
పక్షి జాతులు తాము నివసిస్తున్న భూభాగాన్ని ఇతర జాతి పక్షులతో పంచుకోవు. ఒక వేళా వాటి భూభాగంలోకి చొరబడితే వాటిని తప్పకుండా తరిమికొడతాయి. దీనికి సంబంధించి మనం నిత్యా జీవితంలో చాలా చూసాం. ఉదాహరణకు ఒక కాకుల గుంపు తన పరిసరాల్లోకి ఇతర పక్షులు చొరబడితే వాటిని తరిమేదాకా ఊరుకోవు.
MOST READ:కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు పక్షులు గుంపులు గుంపులుగా దాడి చేస్తాయి. ఈ క్రమంలో విమానాలను డీ కొట్టే ప్రమాదం ఉంది. విమానం మరియు పక్షుల మధ్య అనుకోకుండా జరిగే ఘర్షణ వల్ల విపరీతమైన నష్టాన్ని చూడవలసి వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నివేదిక ఒకటి రెండు దేశాలు ఇచ్చినది కాదు, ఏకంగా 91 దేశాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ సమాచారాన్ని విడుదల చేసింది. విమానం మరియు పక్షుల మధ్య ఘర్షణ ఒక్కసారి మాత్రమే జరుగుతుందని కొందరు నమ్ముతారు. కానీ ప్రపంచవ్యాప్తంగా రోజుకు కనీసం 34 ప్రమాదాలు పక్షుల- విమానాలు గుద్దుకోవడం వల్ల జరుగుతాయని ICAO నివేదించింది.
MOST READ:భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

అయితే పక్షుల వల్ల జరిగే అన్ని ప్రమాదాలు భారీ విపత్తును కలిగించవని ICAO తెలిపింది. దాదాపు 92% పక్షులు-విమానాలు గుద్దుకోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగదు. అయితే మిగిలిన 8% మాత్రమే విపత్తు జరిగే అవకాసమ్ ఉంది.

పక్షుల సంఘర్షణను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు:
పక్షులు విమానం యొక్క ఇంజిన్ని ఢీ కొట్టకుండా ఉండటానికి విమానయాన సంస్థలు కొన్ని ప్రత్యేకమైన వ్యూహాలను రూపొందించాయి. ఇంజిన్ ప్రాంతంలో పక్షులు చొరబడకుండా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇంజిన్ వద్ద వింత శబ్దాలు కూడా రావడం వల్ల పక్షులను అక్కడకు రాకుండా నివారించవచ్చు.
MOST READ:మహీంద్రా నుంచి రానున్న కొత్త ఎస్యూవీ XUV700; వివరాలు

అయితే ఇంజిన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక ఉచ్చును పెద్ద పక్షి గాని ఢీ కొంటే తప్పకుండా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా విమానాల రంగులు కూడా పక్షులు ఎక్కువగా ఆకర్షించే రంగులు కాకుండా ఆకాశంలో కలిసిపోయే రంగులను ఉపయోగిస్తారు.

ఈ విధమైన కలర్స్ ఉపయోగించడం వల్ల ఎగురుతున్నప్పుడు పక్షి కంటి నుండి తప్పించుకోవడానికి వీలు కల్పిస్తుంది. అదనంగా, ఎగిరే పక్షులను తిప్పికొట్టడానికి కృత్రిమ పక్షులను ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని అనేక విమానయాన సంస్థలు అనుసరిస్తున్నాయి. ఈ విధానంలో కొన్ని కంపెనీలు విజయవంతమయ్యాయి.