కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

సాధారణంగా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల నుంచి పొగ వెలువడుతుంది. ఈ పొగ ఎందుకు విడుదలవుతుంది అనే విషయం అందరికి తెలుసు. వాహనంలోని ఇంధన వినియోగం వల్ల పొగ అనేది విడుదలవుతుంది. అయితే కేవలం ఎలక్ట్రిక్ వాహనంలో మాత్రమే పొగ వెలువడదు. కానీ ఇంధనం ఉపయోగించే వాహనాల్లో వెలువడే పొగను బట్టి ఆ వాహనం యొక్క స్థితిని కూడా మనం చెప్పవచ్చు.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

వాహనంలో ఎక్కువ పొగ వెలువడినప్పుడు లేదా సాధారణ రంగులో కాకుండా వేరే రంగులో పొగ వెలువడినప్పుడు ఆ వాహనం సమస్యకు గురైనట్లు నిర్దారించవచ్చు. అయితే వాహనం యొక్క ఎగ్జాస్ట్ పైప్ నుంచి పొగ నలుపు రంగులో, తెలుపు రంగులో మరియు నీలం రంగులో విడుదలవుతుంది.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

కారు నుంచి వెలువడే పొగనుబట్టి కారులో ఏర్పడిన సమస్యను సులభంగా తెలుసుకోవచ్చు. అయితే వీటిని ఎలా గుర్తించాలి.. ఏ రంగులో పోయే వస్తే ఎలాంటి సమస్య ఉంటుంది అనే మరిన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

డీజిల్ ఇంజిన్ కారు యొక్క ఎగ్సాస్ట్ పైప్ నుండి నల్లని పొగ వెలువడితే?

డీజిల్ ఇంజిన్ కలిగిన కారు యొక్క ఎగ్సాస్ట్ పైప్ నుండి నల్ల పొగ వస్తే సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమస్య ఏమైనప్పటికీ, దాన్ని సులభంగా పరిష్కరించవచ్చు. డీజిల్ ఇంజన్లు ఉన్న కార్లు నల్ల పొగను ఉత్పత్తి చేయడం సర్వసాధారణం. గత కొన్ని సంవత్సరాలుగా, డీజిల్ కార్ల ఎగ్జాస్ట్ సిస్టమ్ నుండి నల్ల పొగ వెలువడుతోంది.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

కానీ ఇటీవల విడుదల చేసిన డీజిల్ కార్లలో, డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (DPF) ప్రామాణికంగా అందించబడింది. ఈ డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ కారు నుండి వెలువడే పొగ కణాలను సంగ్రహిస్తుంది. దీని ఫలితంగా ఎగ్సాస్ట్ పైప్ ద్వారా స్వచ్ఛమైన పొగ వస్తుంది. కాబట్టి డీజిల్ ఇంజిన్లతో ఉన్న కార్ల నుండి సాధారణ పొగ వచ్చినట్లయితే, కారు యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

అయితే డీజిల్ ఇంజిన్ కారు నుండి నిరంతరం నల్లటి పొగను విడుదలవుతుంటే మాత్రం, వాహనంలో సమస్యలు ఉండే అవకాశం ఉంది. కారులోని ఫ్యూయెల్ ఇంజెక్టర్ దెబ్బతిన్నట్లయితే ఈ రకమైన పొగ వెలువడుతుంది. వాహనం యొక్క మితిమీరిన వినియోగం కారణంగా, ఫ్యూయల్ ఇంజెక్టర్ చెడిపోతుంది, అంతే కాకుండా డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ లతో సమస్యలు ఉంటే ఈ రకమైన పొగ వెలువడుతుంది.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

డీజిల్ ఇంజిన్ అమర్చిన కార్ల నుండి నిరంతరం నల్ల పొగ వెలువడుతుంటే, కారును తప్పకుండా సర్వీస్ సెంటర్ కి తీసుకెల్లాల్సి ఉంటుంది. అయితే వాహన వినియోగదారులు ఈ సమస్యను గుర్తించకుండా అలాగే వాహనాన్ని వినియోగిస్తుంటే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కావున వాహన వినియోగాదారులు ఎప్పటికప్పుడు దీనిని గమనిస్తూ ఉండాలి.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

పెట్రోల్ ఇంజిన్ కారు యొక్క ఎగ్సాస్ట్ పైప్ నుండి నల్ల పొగ వచ్చినట్లయితే?

డీజిల్ ఇంజిన్ కలిగిన కార్ల మాదిరిగానే, పెట్రోల్ ఇంజిన్ కలిగిన కార్లలో కూడా కొన్ని సందర్భాల్లో నల్లని పొగను ఆశించవచ్చు. అందులోనూ ముఖ్యంగా టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన కారును నడిపేటప్పుడు, నల్ల పొగ ఎక్కువగా వెలువడుతుంది. అయితే నిరంతరం నల్ల పొగ వెలువడుతున్న సమయంలో మాత్రమే టర్బోచార్జర్‌లో ఏదో సమస్య ఉందని భావించాలి. అలాంటప్పుడు తప్పకుండా సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాలి.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

ఎగ్సాస్ట్ పైప్ నుండి బ్లూ కలర్ పొగ వెలువడితే?

డీజిల్ మరియు పెట్రోల్ కార్లు రెండూ కూడా నీలిరంగు పొగను విడుదల చేసే అవకాశం ఉంది. కారు ఎగ్సాస్ట్ పైప్ నుండి నీలిరంగు పొగ వెలువడుతుంటే లేదా ఆయిల్ కాలిపోతున్నట్లు అనిపిస్తే, వెంటనే కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. కారు ఇంజిన్ ఆయిల్ సిస్టమ్‌లో సమస్యలు ఉంటే, పొగలు నీలం రంగులోకి వస్తాయి.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

కొన్నిసార్లు ఇది ఆకస్మిక క్షీణత కారణంగా ఉంటుంది. దీనివల్ల కారు ఎక్కడికి వెళ్లినా ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది. సమస్య వెంటనే సరిదిద్దబడకపోతే, సమస్య మరింత ఎక్కువవుతుంది. దీనిని వాహన వినియోగదారులు గుర్తించాలి. అప్పుడే సమస్య పరిష్కరించబడుతుంది. లేకంటే కారు పనికిరాకుండా పోతుంది.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

ఎగ్సాస్ట్ పైప్ నుండి తెల్లని పొగ వెలువడితే?

కారు ఎగ్జాస్ట్ పైప్ నుండి వచ్చే దట్టమైన తెల్లని పొగ కొంత ప్రమాదకరం, కావున దీనిపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద మొత్తంలో తెల్లని పొగ నిరంతరం వెలువడుతుంటే, సమస్య ఉందని నిర్దారించాలి. తెల్లని పొగ బయటకు వస్తే, అది ఇంజిన్ ఆయిల్ సమస్య కావచ్చు. కొన్నిసార్లు తెల్లని పొగకు కొద్దిగా నీలం రంగు కూడా ఉండే అవకాశం ఉంటుంది.

కారు నుంచి వచ్చే పొగ రంగును బట్టి సమస్య ఏంటో చెప్పేయొచ్చు.. మీకు తెలుసా..!!

కారు ఎగ్సాస్ట్ పైప్ నుండి దట్టమైన తెల్లని పొగ రావడం గమనించిన వెంటనే సమస్యను పరిష్కరించండి. లేదంటే సమస్యలు తీవ్రమవుతాయి. అటువంటి సమస్యలను నివారించడానికి, క్రమం తప్పకుండా కార్లకు సర్వీసింగ్ చేయడం వంటివి చేయాలి. ఇంజిన్ ఆయిల్ మరియు ఇతర పరికరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. అప్పుడే సమస్యలను తొందరగా పరిష్కరించబడుతుంది.

Most Read Articles

English summary
Reasons for different color smokes coming from exhaust pipe details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X