ఎమర్జెన్సీ వాహనాల్లో రెడ్ అండ్ బ్లూ కలర్ లైట్స్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?
సాధారణంగా వాహనాలను రెండు రకాలుగా అనుకుంటే ఇందులో అత్యవసర వాహనాలు చాలా ప్రధానమైనవి. ఇందులో అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు మరియు పోలీస్ వాహనాల వంటివి ఉంటాయి. ఈ అత్యవసర వాహనాలపైన ఎమర్జెన్సీ లైట్స్ అమర్చబడి ఉంటాయి.

ఎమర్జెన్సీ వెహికల్స్ లో ఎమర్జెన్సీ లైట్స్ యొక్క కలర్ దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంతే కాకుండా ఈ లైట్స్ ఒక్కోసారి నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎక్కువ భాగం ఎమర్జెన్సీ వాహనాలకు రెడ్ మరియు బ్లూ లైట్లను ఉపయోగిస్తారు. ఎక్కువ ఇలాంటి లైట్స్ నే మనం కూడా నిత్యజీవితంలో ఎక్కువగా చూసి ఉంటాము.
ఈ ఎమర్జెన్సీ వాహనాల్లో ఈ రకమైన రెడ్ అండ్ బ్లూ లైట్స్ వాడకం వెనుక ఉన్న కారణాలు చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం..

సాధారణంగా రెడ్ అనేది హెచ్చరికకు సూచికం, కావున వాహనాల్లో ఈ రకమైన రెడ్ కలర్ లైట్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా అధికంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఇతర కలర్స్ కంటే కూడా రెడ్ కలర్ ఎక్కువగా వెంటనే ఆకర్శించే విధంగా ఉంటుంది.

అయితే చాలా వాహనాల్లో రెడ్ కలర్ లైట్స్ ఉండటం వల్ల ఒక వేళా వెంటనే గుర్తించడానికి వీలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కావున వాటి పక్కన బ్లూ కలర్ లైట్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ రెండు కూడా పక్క పక్కనే ఉండటం వల్ల అవి రోడ్డుపై ఇతర వాహనదారులను ఎక్కువగా ఆకర్షించడానికి సహాయపడతాయి. ఎమర్జెన్సీ లైట్లలో రెడ్ అండ్ బ్లూ లైట్స్ కలయికను ఉపయోగించటానికి ఇది ఒక ప్రధాన కారణం.

అయితే ఇది మాత్రమే కాకుండా ఈ విధమైన లైట్స్ ఉపయోగించడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. దీని ప్రకారం పగటిపూట కూడా రెడ్ కలర్ వెంటనే కనిపించే విధంగా ఉంటాయి. దీనితోపాటు ఉన్న బ్లూ కలర్ రాత్రి సమయంలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కారణంగా రెడ్ అండ్ బ్లూ కలర్ కలయిక ఉపయోగించబడుతుంది. ఇది పగటిపూట లేదా రాత్రి సమయంలో ఇతర వాహనదారులను సులభంగా అప్రమత్తం చేస్తుంది.

రెడ్ అండ్ బ్లూ కలర్ కలయిక రంగు అంధత్వం ఉన్న డ్రైవర్ల సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. రంగు అంధత్వం ఉన్నవారు రంగుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేరు. కొంతమందికి ఎరుపును గ్రహించడంలో ఇబ్బంది ఉండవచ్చు, కావున అలంటి వ్యక్తులు బ్లూ కలర్ గుర్తించగలరు.

మరికొందరు ఎరుపును సులభంగా గ్రహిస్తారు. కానీ వారు నీలం గ్రహించలేకపోతున్నారు. కావున ఎరుపు మరియు నీలం ఎమర్జెన్సీ లైట్స్‌లో కలుపుతారు. ఈ రంగుల కలయిక రంగు అంధత్వంతో బాధపడుతున్న వారితో సహా ఇతర డ్రైవర్లను అప్రమత్తం చేయగలదు. అందువల్ల అత్యవసర వాహనాల్లో అత్యవసర లైట్ల ఎరుపు మరియు నీలం కలయికలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.


Click it and Unblock the Notifications








