మీకు తెలుసా.. ట్రాక్టర్ టైర్లు నీటితో నింపుతారు.. ఎందుకంటే?

'రైతులే దేశానికీ వెన్నెముక' అనేది మనం ఈ రోజు వింటున్న మాట కాదు, ఇది ఒకప్పటి నుంచి మనం వింటూనే వున్నాం. రైతులు దేశానికే అన్నం పెడుతున్నారు. దీని కోసం వారు పడే శ్రమ మాటల్లో చెప్పలేము. ఇంత శ్రమిస్తున్న రైతులకు వ్యవసాయంలో తోడుండే వాహనం ఏది అంటే వెంటనే ట్రాక్టర్ గుర్తొస్తుంది. కానీ ఒకప్పుడు ట్రాక్టర్లు లేని రోజుల్లో ఎద్దులు రైతుకి ఆసరాగా ఉండేవి.

మీకు తెలుసా.. ట్రాక్టర్ టైర్లు నీటితో నింపుతారు.. ఎందుకంటే?

నేడు ట్రాక్టర్ లేకుండా వ్యవసాయం చేయడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ట్రాక్టర్ల గురించి దాదాపు అందరికి తెలుసు. అవి ఎలా పనిచేస్తాయి, వాటికి చిన్న చిన్న సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలి అనేవి చాలా మందికి తెలుసు. కానీ ట్రాక్టర్ల టైర్లలో నీరు ఎందుకు పోస్తారు అనేది చాలా మందికి తెలియదు. అసలు ట్రాక్టర్ టైర్లలో నీరు పోస్తారా.. లేదా? అనే విషయం కూడా చాలామందికి తెలియదు.

మీకు తెలుసా.. ట్రాక్టర్ టైర్లు నీటితో నింపుతారు.. ఎందుకంటే?

ట్రాక్టర్ టైర్ల లోపల నీరు ఎందుకు పోయాలి, ఎంత మోతాదులో నింపాలి, అసలు దీని వల్ల ప్రయోజం ఏమిటి అనే విషయాలను గురించి మరింత సమాచారం ఇక్కడ పరిశీలిద్దాం.

మీకు తెలుసా.. ట్రాక్టర్ టైర్లు నీటితో నింపుతారు.. ఎందుకంటే?

సాధారణంగా టైర్ల బరువును పెంచడానికి నీటిని ఉపయోగిస్తారు. ఇది టైర్లు జారిపోకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. అంతే కాదండోయ్ ట్రాక్టర్ టైర్లలో నీటిని నిమ్పదం వల్ల అవి ఎక్కువ రోజులు మనగలిగేలా ఉంటాయి, కూడా. ట్రాక్టర్లు ఎలాంటి రోడ్డులో అయినా సజావుగా ప్రయాణిస్తాయి.

మీకు తెలుసా.. ట్రాక్టర్ టైర్లు నీటితో నింపుతారు.. ఎందుకంటే?

కానీ కఠినమైన రోడ్డులో వెళ్ళినప్పుడు టైర్లు చాలా తొందరగా దెబ్బతింటాయి. ట్రాక్టర్ టైర్లు చాలా దృడంగా ఉంటాయి. కానీ వీటిలో నీటిని నింపడం వల్ల మరింత ఎక్కువ రోజులు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ట్రాక్టర్ టైర్లలో నీటిని నింపేటప్పుడు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ట్యూబ్‌లోని 75% స్థలం తప్పనిసరిగా నీటితో నింపాలి. మిగిలిన స్థలాన్ని గాలితో నింపాలి.

మీకు తెలుసా.. ట్రాక్టర్ టైర్లు నీటితో నింపుతారు.. ఎందుకంటే?

టైర్లను నీటితో నింపడం వల్ల ట్రాక్టర్ స్థిరత్వాన్ని ఇస్తుంది. ట్రాక్టర్‌కు స్థిరత్వాన్ని అందించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. టైర్లను నీటితో నింపడం సరళమైన పద్ధతి మరియు ఖర్చు తక్కువగా కూడా ఉంటుంది. టైర్లను నీటితో నింపడం వల్ల ట్రాక్టర్ బరువు పెరుగుతుంది, దీని ద్వారా మంచి పట్టు అందిస్తుంది.

మీకు తెలుసా.. ట్రాక్టర్ టైర్లు నీటితో నింపుతారు.. ఎందుకంటే?

కొన్ని దేశాలలో అయితే ట్రాక్టర్ టైర్లలో నీటికి బదులుగా కాల్షియం క్లోరైడ్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. చల్లటి దేశాలలో, టైర్లను నీటితో సులభంగా నింపలేరు. కావున ఇలాంటి పద్ధతి ఎన్నుకుంటారు. ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో టైర్ల లోపల నీరు గడ్డకట్టే అవకాశమా ఉంటుంది. కావున ఈ విధమైన పద్ధతి ఉపయోగిస్తారు.

మీకు తెలుసా.. ట్రాక్టర్ టైర్లు నీటితో నింపుతారు.. ఎందుకంటే?

నీటికి బదులుగా కాల్షియం క్లోరైడ్ ద్రావణాన్ని ఉపయోగించడానికి కూడా తగిన కారణాలు లేకుండా పోలేదు. తక్కువ ఉష్ణోగ్రతలో కూడా ఇది కడ్డకట్టదు. అంతే కాకుండా కాల్షియం క్లోరైడ్ ద్రావణం నీటి కంటే 30% ఎక్కువ బరువు ఉంటుంది. మరొక కారణం ఏమిటంటే ఇది టైర్ లేదా ట్యూబ్‌ను పాడు చేయకుండా ఉంటుంది.

ఏది ఏమైనా ట్రాక్టర్ టైర్లలో నీరు నింపడం గురించి తెలుసుకున్నారు కదా, మీ అనుభవంలో ఇలాంటి సంఘటనలు చూసి ఉంటె మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడాని మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Reasons For Filling Water And Calcium Chloride In Tractor Tyres. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X