మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

ఇటీవల కాలంలో విమాన ప్రయాణం చాలా సర్వసాధారణంగా మారిపోయింది. విమానాలలో ప్రయాణించిన అందరికి విమానాలు ఎలా ఉంటాయి, లోపల సీట్లు మొదలైన వాటి గురించి తెలిసి ఉంటుంది. కానీ చాలా మందికి విమానంలోని కాక్‌పిట్‌ను చూసి ఉండరు. దాని గురించి దాదాపుగా తెలియదు కూడా..

మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

ఒక వేళా విమానం కాక్‌పిట్‌ను చూసిన కొంతమంది అక్కడ ఫైలెట్లు కూర్చునే సీట్లు గమనించి ఉంటారు. ఇవి సాధారణ సీట్లకంటే కొంత భిన్నంగా ఉంటాయి. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

చాలా వరకు విమానాలలో, పైలట్ల సీటు గొర్రె చర్మంతో కప్పబడి ఉంటాయి. ఆ సీట్లు బూడిద రంగు లేదా తెలుపు రంగు స్పాంజ్ లాగా కనిపిస్తాయి. విమానం యొక్క కాక్‌పిట్‌లోకి రాని వారు సినిమాలు లేదా ఫోటోలలో పైలట్ల సీట్లను చూడవచ్చు. పైలట్ల సీట్లలో గొర్రెల చర్మం ఎందుకు ఉపయోగిస్తారు అని కొంత ఆశ్చర్యం కలగవచ్చు.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు, పూర్తి వివరాలు

మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

కానీ పైలట్ల సీట్లలో గొర్రెల చర్మాన్ని ఉపయోగించడం వెనుక వివిధ కారణాలు ఉన్నాయి. కాక్‌పిట్ యొక్క ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా, పైలట్లు సీట్లలో గొర్రెల చర్మాన్ని ఉపయోగించటానికి ప్రధాన కారణం వేసవిలో సీట్లు చల్లగా మరియు శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి.

మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

సాధారణంగా గొర్రె చర్మం హైపోఆలెర్జెనిక్, కావున ఫైలెట్లు చాలాసేపు కూర్చున్నప్పటికీ వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతే కాకుండా ఇది ఎటువంటి అలెర్జీలకు కారణం కాదు. పైలట్ల సీట్లలో గొర్రెల చర్మాన్ని ఉపయోగించటానికి మరొక కారణం ఏమిటంటే అవి తేలికగా కాలిపోకుండా ఉంటాయి.

MOST READ:కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

విమానాలలో ఇటువంటివి చాలా అవసరం, సహజంగా అధిక స్థాయిలో నైట్రోజన్ మరియు నీరు ఉండటం వల్ల గొర్రెల చర్మం తేలికగా కాలిపోదు. గొర్రెల చర్మం యొక్క ఈ అంశం కారణంగా, వాటిని పైలట్ల సీట్లలో ఉపయోగిస్తారు. గొర్రెల చర్మం చాలా మన్నికైనది కాబట్టి, వాటిని పైలట్ల సీట్లలో ఉపయోగిస్తారు.

మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

గొర్రె చర్మం విమానంలోని పైలట్ల సీట్లలో మాత్రమే ఉపయోగించబడదు. కొందరు కార్లు మరియు ద్విచక్ర వాహన సీట్లలో కూడా గొర్రెల చర్మాన్ని ఉపయోగిస్తారు. ఈ సీట్లపై కూర్చున్నప్పుడు వాహనదారులకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది. ఇవి ఎండాకాలం మరియు శీతాకాలం వంటి సమయంలో పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది.

MOST READ:ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?

Most Read Articles

English summary
Reasons For Pilot Seats Having Sheep Skin Cover. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X