నేటి వీడియో: రెడ్ బుల్ రేసింగ్ ఫ్యాక్టరీలో డౌగీ ఫీట్లు
ట్రైల్ బైక్ (ఆఫ్ రోడింగ్ అడ్వెంచరస్ మోటార్‌స్పోర్ట్స్ కోసం ఉపయోగించే ఓ రకసమైన సన్నటి డర్ట్ బైక్)లతో నిపుణులు చేసే విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఈ బైక్‌లతో ఎలాంటి రోడ్లపైనైనా రైడ్ చేయటం, అసాధ్యమైన ఫీట్లను కూడా సులువుగా చేసేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి ఓ ఛాంపియన్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మొత్తం 12 సార్లు 'వరల్డ్ ట్రైల్స్ ఛాంపియన్'గా నిలిచిన యూకె రెడ్ బుల్ అథ్లెట్ డౌగీ లాంప్కిన్ ఇటీవల ఓ వినూత్నమైన స్టంట్ చేశాడు. తన బైక్‌తో రెడ్ బుల్ రేసింగ్ ఫ్యాక్టరీలో ఆడుకునేందుకు డౌగీ వచ్చాడు. అంతేకాదండోయ్, డౌగీ తన బైక్‌పై అఫీసుల చుట్టూ నడుపుకుంటూ, అడ్డుగా వచ్చిన మెట్లను సైతం తన బైక్‌తోనే దిగుతూ/ఎక్కుతూ అందరినీ ఆశ్చర్యపరచారు.

ట్రైల్ బైక్‌లను ప్రత్యేకించి బైక్ ఫీట్లు/స్టంట్‌ల కోసం తయారు చేయబడ్డాయి. ఇవి చాలా తేలికగా ఉండి, మంచి పికప్‌ను కలిగి ఉంటాయి. ఈ బైక్‌లను నడిపే రైడర్లు వీటిని సైకిళ్ల మాదిరిగా సులువుగా పైకి లేపటం, బ్యాలెన్స్ చేయటం చేస్తుంటారు. డౌగీ తన ఫీట్‌లో భాగంగా ట్రాన్స్‌పోర్టర్లపై కూడా బైక్‌ను రైడ్ చేయటమే కాకుండా, తన రెండు చక్రాలపై ఓ ఫార్ములా వన్ కారు పైనుంచి కూడా జంప్ చేశాడు. డౌగీ లాంప్కిన్ బైక్ విన్యాసాలను మనం కూడా క్రింది వీడియోలో వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/cHtVg8PiTTQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








