రెడ్‌బుల్ ఫ్లూగ్‌టాగ్ ఇండియాకి వస్తుందోచ్..
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్ నుంచి వివిధ రకాల మోటార్‌స్పోర్ట్‌ల వరకు అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. రెడ్ బుల్ ఇలాంటి కార్యక్రమాలన్నీ సరదా కోసం, ప్రేక్షకులను అలరించడం కోసం చేస్తుంటుంది.
అలాంటి ఓ సరదా కార్యక్రమమే ఈ 'రెడ్ బుల్ ఫ్లూగ్‌టాగ్' (Red BullFlugtag). ఫ్లూగ్‌టాగ్ అంటే జర్మన్ భాషలో ఎగిరే రోజు (ఫ్లయింగ్ డే) అని అర్థం. ఈ కార్యక్రమం కాన్సెప్ట్ కూడా అదే. ఈ కార్యక్రమంలో తొలుతగా 1992లో వియన్నాలో ప్రారంభమైంది.
ప్రస్తుతం రెడ్ బుల్ ఫ్లూగ్‌టాగ్ ఈవెంట్ అనేక ప్రపంచ దేశాల్లో జరుగుతుంది. తాజాగా ఈ ఈవెంట్ మనదేశంలో కూడా ప్రారంభం కానుంది. రెడ్ బుల్ ఫ్లూగ్‌టాగ్ ఈవెంట్ నీటిపై జరుగుతుంది. ఇందులో పాల్గొనేవారు చిత్రవిచిత్రమైన రూపాల్లో ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా విమానాల ఆకారంలో ఉండే వాటిని తయారు చేసి, ఎగిరించే ప్రయత్నం చేస్తారు.
ఈ ప్రయత్నంలో అనేకమంది విఫలం అవుతూ ఉంటారు, ఎవరో కొద్దిమంది మాత్రమే సక్సెస్ సాధిస్తుంటారు. అయితే, ఇదంతా చూడటానికి మాత్రం చాలా సరదాగా అనిపిస్తుంది. చూస్తున్నవారందరికీ మంచి వినోదం లభిస్తుంది. రెడ్ బుల్ ఫ్లూగ్‌టాగ్ కార్యక్రమం సెప్టెంబర్ 28, 2014వ తేదీన బెంగుళూరులోని శాంకీ ట్యాంక్ వద్ద జరగనుంది. ఇందులో 40 జట్లు పాల్గొనబోతున్నాయి.
మీరు బెంగుళూరులో ఉన్నట్లయితే ఈ ఈవెంట్ మిస్ కాకండి. రెడ్ బుల్ ఫ్లూగ్‌టాగ్ కార్యక్రమం గురించి క్లియర్ పిక్చర్ కావాలంటే ఈ వీడియోని చూడండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/8kmEUuai-tE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








