నేటి వీడియో: ప్రమాదం అంచున పరాచకం!
రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ ఇప్పుడిప్పుడే మన ఇండియాలో పాపులర్ అవుతోంది. స్పోర్ట్స్ ప్రియులు ఇన్‌స్టాంట్ ఎనర్జీ కోసం ఈ డ్రింక్‌ను ఉపయోగిస్తుంటారు. రెడ్ బుల్ తమ బ్రాండ్ ప్రచారం కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంటుంది. రెడ్ బుల్‌కు ఓ రేసింగ్ టీమ్ కూడా ఉంది. రెడ్ బుల్ కంపెనీ మోటార్‌స్పోర్ట్స్‌కు ఉన్న సంబంధం ఈనాటిది కాదు. ఎనర్జీ డ్రింక్ పరంగా కన్నా కూడా మోటార్‌స్పోర్ట్స్ పరంగానే రెడ్ బుల్ బ్రాండ్ మరింత పాపులర్ అయిందని చెప్పవచ్చు.
సరే, ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే, రెడ్ బుల్ తాజాగా చైనాలో ఓ కార్ డ్రిఫ్ట్ కాంపిటీషన్‌ను నిర్వహించింది. చైనాలోని అత్యంత ప్రమాదకరమైన మలుపులతో కూడిన టియాన్‌మెన్షాన్ పర్వతాలపై ఉండే రోడ్డుపై ఇద్దరు డ్రిఫ్టర్ల మధ్య ఈ పోటీని నిర్వహించారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన రెడ్ బుల్ డ్రిఫ్టర్ డేమ్స్ టాంగ్, ఇటలీకి చెందిన టీమ్ ఆరెంజ్ జపాన్ డ్రైవర్ ఫెడెరికో స్కెరిఫోల మధ్య ఈ డ్రిఫ్టింగ్ పోటీ నిర్వహించారు.
టియాన్‌మెన్షాన్ పర్వతాలపై 99 మలుపులతో కూడిన రోడ్డుపై ప్రమాదం అంచున వీరు చేసిన విన్యాసాలు అందరి ఆశ్చర్యపరచాయి. ఈ మొత్తం కార్యక్రమాన్ని రెడ్ బుల్ తమ కెమరాల్లో బంధించింది. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ఎవ్వరైనా సరే కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే. అంత అద్భుతంగా, ఆశ్చర్యకంగా ఉంటుంది ఈ వీడియో. మరి ఆలస్యమెందుకు.. ఈ పోటీలో ఎవరు గెలిచారో మీరే ఈ వీడియోలో వీక్షించడం మరి..!
<center><center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/MqxxeI6lQPs?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>


Click it and Unblock the Notifications








