నేటి వీడియో: వీడియో గేమ్‌లు నిజమైతే..!?
మీరు చిన్నప్పుడు ఎన్ఈఎస్ వీడియో గేమ్‌లు ఆడి ఉండుంటే, మీకు ఖచ్ఛితంగా ఎగ్జైట్‌బైక్ గేమ్ గురించి తెలిసే ఉండుంటుంది. ఈ గేమ్‌లో బైక్‌తో రోడ్డుపై ఏటవాలుగా ఉండే దిమ్మెల్లాంటి అవాంతరాలను దాటుకుంటూ పోయి, అందరికన్నా ముందుగా గమ్యం చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం కల్పితానికి మాత్రమే పరిమితమైన ఈ గేమ్‌ను రియల్ లైఫ్‌లోను ఆడేలా చేసింది రెడ్ బుల్.
రియల్ లైఫ్‌లో సూపర్‌క్రాస్‌ల వంటి మోటార్‌స్పోర్ట్స్ జరుగుతున్నప్పటికీ, ఈ రేస్ ట్రాక్‌లు మలుపులుతో విభిన్నంగా ఉంటాయి. కానీ ప్రత్యేకించి ఈ ఎగ్జైట్‌బైక్ వీడియో గేమ్ నుంచి స్ఫూర్తి పొంది రెడ్ బుల్ ఓ రేస్ ట్రాక్‌ను తయారు చేసింది. ఈ రేస్ ట్రాక్ అచ్చం ఎగ్జైట్‌బైక్ వీడియో గేమ్‌లోని ట్రాక్‌ను తలపిస్తుంది. ఇందులో చిన్న చిన్న ఎత్తు పళ్లాల నుంచి పెద్ద పెద్ద ఎత్తు పళ్లాల వరకు ఉంటాయి.

ఈ ట్రాక్‌పై బైక్ నడిపే వారిని చూస్తుంటే మనకు ఈ వీడియో గేమ్ గుర్తుకు వస్తుంది. రెడ్ బుల్ ఈ గేమ్‌ను 'రెడ్ బుల్ స్ట్రైట్ రిథమ్' అని పిలుస్తోంది. దాదాపు అరమైలు పొడవుండే ఈ ట్రాక్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో రైడర్లు దాదాపుగా గాల్లోనే బైక్‌ను నడుపుతున్నట్లు అనిపిస్తుంది. మరి ఆ స్టన్నింగ్ వీడియోని మనం కూడా చూసేద్దామా..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/NTqFmdJxWmI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








