R3 రేపు బెంగళూరులో రెడ్ రాబిట్ రేసర్స్ టాలెంట్ హంట్.. యువ రేసర్లకు గోల్డెన్ ఛాన్స్.!!

కొంతమందికి రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఇష్టం అని చెప్పడం కంటే ప్యాషన్ అంటే సరిగ్గా సరిపోతుందేమో.. అందులోనూ మోటార్ రేసింగ్. ముఖ్యంగా యువ రైడర్లు.. ప్రపంచం దృష్టి మొత్తం తమ వైపు ఉండేలా రేసింగ్ ట్రాక్‌లపై రయ్ మంటూ దూసుకుపోతుంటే అందులో వారికొచ్చే కిక్కే వేరు.

మోటార్ రేసింగ్‌పై ఎంత అభిరుచి ఉన్నా కొంతమంది కొన్ని కారణాల దృష్ట్యా వాటికి దూరంగా ఉండాల్సి వస్తోంది. అలాంటి యువ ఔత్సాహికుల కోసం ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. మోటార్ రేసింగ్‌లో తమ ప్రతిభను నిరూపించడానికి రెడ్ ర్యాబిట్ రేసర్స్ మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ వివరాలేంటో ఈ కథనంలో చదవండి.

Red-Rabbit-Racers

మీరు మోటార్ రేసింగ్‌పై ఉత్సాహంగా ఉన్నట్లయితే ఇంకా అంతర్జాతీయ రేసింగ్ సర్క్యూట్‌లో భారత జాతీయ గీతాన్ని వినాలని మీరు కలలు కన్నట్లయితే, రెడ్ రాబిట్ రేసర్స్ (Red Rabbit Racers R3) టాలెంట్ స్కౌట్ ప్రోగ్రామ్‌ మీకో అవకాశం కల్పిస్తుంది. దాని ద్వారా ప్రపంచానికి మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ టాలెంట్ స్కౌట్‌ను భారతదేశం అంతటా నిర్వహిస్తున్నారు. రెడ్ రాబిట్ రేసర్స్ ద్వారా తదుపరి టాలెంట్ స్కౌటింగ్ కార్యక్రమం ఆగస్టు 26న బెంగళూరులోని అరువని గ్రిడ్‌లో జరగనుంది. దీని ద్వారా అర్హులైన అభ్యర్థులు శిక్షణ స్కాలర్‌షిప్‌లు మరియు స్పాన్సర్‌షిప్‌లను పొందే ఛాన్స్ కొట్టేయొచ్చు.

అంతే కాకుండా రెడ్ ర్యాబిట్ రేసర్స్.. ప్రతిభావంతులైన రేసర్లకు సింగపూర్ F1 గ్రాండ్ ప్రిక్స్‌ని చూడటానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఇంకా ఈ టాలెంట్ స్కౌట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికేట్లు కూడా అందిస్తారు. సింగపూర్ లాంటి అందమైన దేశంలో ఇలాంటి కార్యక్రమం చూడటం అంటే సాధారణ విషయం కాదనే చెప్పవచ్చు.

రెడ్ రాబిట్ రేసర్స్ గురించి చెప్పాలంటే.. ఈ టీమ్ భారతదేశం నుండి చాలా మంది యువ రేసర్లను వివిధ అంతర్జాతీయ ఆటోస్పోర్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో పాల్గొనడానికి ప్రోత్సహించింది. అంతేకాకుండా, రెడ్ రాబిట్ రేసర్స్ ప్రతి ప్రొఫెషనల్ రేసింగ్‌లో వివిధ నేపథ్యం కలిగిన సభ్యులతో విస్తృతమైన శిక్షణను అందిస్తున్నారు.

రెడ్ రాబిట్ రేసర్స్ 2020లో దుబాయ్ కార్ట్‌డ్రోమ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో ఓవరాల్ నేషన్ కప్‌లో ఛాంపియన్ ట్రోఫీని మరియు ఓవరాల్ కార్పొరేట్ కప్‌లో మూడవ స్థానాన్ని కూడా గెలుచుకున్నారు. రేసింగ్ టీమ్ కాకుండా, రెడ్ రాబిట్ రేసర్లు కార్ట్ ఫిట్టింగ్, కార్ట్ సెటప్, కార్ట్ డైనమిక్స్, బ్రేకింగ్, మెకానికల్ ప్రాసెస్ మరియు డేటా అనాలిసిస్ వంటి వివిధ రకాల కార్ట్ సేవలను కూడా అందిస్తారు.

ఈ స్కౌట్ ప్రోగ్రాంకి మీరు దరఖాస్తు చేసుకోవడానికి Instagramలో @redrabbitracersని సంప్రదించవచ్చు లేదా +91 94336 74185కు కాల్ చేయవచ్చు. లేదంటే శనివారం(ఆగస్టు 26) ఉదయం 9 గంటలలోపు సర్జాపూర్‌లోని అరువని గ్రిడ్‌లో అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం యువ ఔత్సాహిక రేసర్లు ఇప్పుడే పై నంబర్ ను సంప్రదించి దరఖాస్తు చేసుకోండి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 25, 2023, 20:56 [IST]
English summary
Red rabbit racers conducts racing talent scout in bangalore full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+