ప్రతీ రౌండ్ ఫైనల్‌ను తలపించేలా.. ఉత్కంఠగా సాగిన రెడ్ ర్యాబిట్ రేసర్స్ టాలెంట్ స్కౌట్ ఈవెంట్
బెంగుళూరులో అరువని గ్రిడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రెడ్ ర్యాబిట్ రేసర్స్(Red Rabbit Racers) టాలెంట్ స్కౌటింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా 75 మంది ఔత్సాహిక రేసర్లను ఒకచోట చేర్చింది. మా డ్రైవ్‌స్పార్క్ టీమ్ ఈ ఈవెంట్‌లో పాల్గొనడమే కాకుండా అధికారిక మీడియా పార్ట్‌నర్‌గా కూడా పనిచేసింది.
బెంగళూరులో జరిగిన ఈ టాలెంట్ స్కౌటింగ్ ఈవెంట్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ పోటీలో మొత్తం నాలుగు రౌండ్లు ఉన్నాయి. ప్రాక్టీస్ మరియు క్వాలిఫైయింగ్, నాకౌట్ రౌండ్లు, సెమీ-ఫైనల్స్ మరియు ఫైనల్స్ ఆధారంగా జరిగింది. మరి ఈ రౌండ్లన్నీ ఎలా జరిగాయో ఈ కథనం ద్వారా పూర్తిగా తెలుసుకోండి.

ప్రాక్టీస్ మరియు క్వాలిఫైయింగ్: రెడ్ ర్యాబిట్ రేసర్స్ టాలెంట్ స్కౌటింగ్‌లో రౌండ్ 1 ఐస్ బ్రేకర్ రౌండ్. మొదటి రౌండ్ నిజానికి ప్రేక్షకుల కళ్లు చెదిరేలా ఉంది. క్రీడాకారులు దాదాపు పది శిక్షణ రౌండ్లలో పాల్గొన్నారు. ఇది ట్రాక్ మరియు కార్ట్‌లపై అవగాహన పెంచుకోవడంలో వారికి సహాయపడింది.
ఇందులో పోటీదారులు తదుపరి రౌండ్‌కి క్వాలిఫైయింగ్ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇది కేవలం వినోదం కోసమే కాదు. ఈ రౌండ్లు వారి అర్హతలను సూచించడంలో కూడా చాలా దోహదపడ్డాయి. సకాలంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి పార్టిసిపెంట్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ రౌండ్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లానే ఉత్కంఠగా సాగింది.

నాకౌట్ రౌండ్లు: ఈ రౌండ్ మునుపటి రౌండ్ కంటే చాలా ఆసక్తికరంగా కొనసాగింది. పోటీదారులు అందరికంటే చివర్లో ఉండటానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. రేస్‌లో వేగంగా ముందుకు సాగడానికి ప్రయత్నించారు. ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో ముగ్గురు మాత్రమే తదుపరి రౌండ్‌కు ఎంపికయ్యారు. మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకునేందుకు పోటీదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

సెమీ-ఫైనల్స్: రౌండ్ 3లో, పది మందితో కూడిన ప్రతి గ్రూప్‌లో ఇద్దరు మాత్రమే ఫైనల్‌కు చేరుకోవడంతో పోటీ మరింత పెరిగింది. టాలెట్ స్కౌటింగ్ ఈవెంట్‌లో విజయం కోసం ప్రతి ఒక్కరూ పోటీ పడుతుండగా, ఈ రౌండ్ నిజానికి మునుపటి రౌండ్ల కంటే కఠినమైన పోటీని చూసింది. కానీ టీమ్ R3, వారిలో ఉత్సాహాన్ని నింపడానికి, ఫైనల్ రౌండ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు అర్హులైన వారికి వైల్డ్ కార్డ్ రౌండ్ నిర్వహించింది.

ఫైనల్స్: వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఎనిమిది మంది పోటీదారుల మధ్య ఫైనల్ రౌండ్ జరిగింది. ఈ రౌండ్‌లో పోటీదారులకే కాకుండా మాలో కూడా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. ఇందులో ఎవరు గెలుస్తారో అన్న టెన్షన్ నెలకొంది. ఇందులో P1, P2, P3, P4 మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కానీ P1 ప్రారంభం నుంచి చివరి వరకు ఆధిక్యాన్ని కొనసాగించింది.

రెడ్ ర్యాబిట్ రేసర్స్, అరువాణి గ్రిడ్ సభ్యులు ఎటువంటి అవాంతరాలు లేకుండా రేసును విజయవంతంగా నిర్వహించారు. R3 జట్టు అద్భుతమైన మద్దతుతో పోటీలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచింది. బహుమతి పంపిణీ కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగింది. పోటీలో గెలుపొందిన వారికే కాకుండా పాల్గొన్న వారిని కూడా కార్యక్రమ నిర్వాహకులు సత్కరించారు.
థ్రిల్స్‌తో నిండిన మరపురాని రోజు: పోటీలో పాల్గొనేవారికి తమ వ్యక్తిగత ప్రతిభను కనబరచేందుకు ఈ పోటీ ఎంతగానో ఉపయోగపడింది. అలాగే, ఈ ఈవెంట్‌లో పాల్గొనేవారు మరియు సందర్శకుల నుంచి మంచి ఆదరణ పొందడం మేము చూశాం. ఇలాంటి ఆసక్తికరమైన పోటీలు, ఈవెంట్‌లు భారతదేశంలో మరిన్ని జరగాలని ఆశిస్తున్నాం.



Click it and Unblock the Notifications








