15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

భారత రోడ్లపై సురక్షితమైన వాహనాలు మాత్రమే నడిచేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే, వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి జాతీయ వాహన స్క్రాపేజ్ విధానాన్ని ( National Automobile Scrappage Policy) దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోంది.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

ఏప్రిల్ 2022 నుండి ఈ పాలసీని అమలు చేయడానికి ముందే, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. జాతీయ వాహన స్క్రాపేజ్ విధానం యొక్క ప్రయోజనాలు మరియు ప్రోత్సాహకాలను ఈ నోటిఫికేషన్ స్పష్టంగా వివరిస్తుంది.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

అంతేకాకుండా, ఈ కొత్త పాలసీ కింద పాత వాహనాలపై విధించే జరిమానాలు లేదా రెట్టింపు రోడ్ టాక్స్ వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. దేశంలో పాత మరియు ఎక్కువ కాలుష్యాన్ని కలిగించే ప్రమాదకర వాహనాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వం ప్రతిపాధించిన ఈ కొత్త విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

ఈ కొత్త వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద, కేంద్ర ప్రభుత్వం పాత వాహనాల (15 ఏళ్లకు పైబడినవి) యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ మరియు ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులను భారీగా పెంచబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 1, 2022 వ తేదీ నుండి, 15 సంవత్సరాల కంటే పాతబడిన బైక్, కారు లేదా బస్సు/వాణిజ్య వాహనాల రీ-రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన ఫీజు ప్రస్తుత ఫీజు కన్నా సుమారు 8 రెట్లు ఎక్కువగా ఉండనుంది.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

ఈ నిర్ణయం వలన, ఇప్పటికీ మంచి రన్నింగ్ కండిషన్‌ లో ఉండి, తమ పాత వాహనాన్ని స్క్రాప్ చేయడానికి ఇష్టపడని వాహన యజమానులు మరియు ఇటీవలి కాలంలో పాత (సెకండ్ హ్యాండ్) వాహనాలను కొనుగోలు చేసిన వ్యక్తులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇలా తమకు నచ్చిన పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి ఇష్టపడని వారు, వాటిని తమతోనే ఉంచుకునేందుకు భారీ మొత్తాలలో రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

నిజానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం మంచిదనే చెప్పాలి. దాదాపు 15 ఏళ్ల క్రితం తయారైన కార్లలో కనీస ప్రాథమిక సేఫ్టీ ఫీచర్లయిన ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటివి కూడా లేవు. కాబట్టి, ప్రస్తుత రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి వాహనాలను ఎక్కువ కాలం నడపటం అంత సురక్షితం కాదు. మరోవైపు ఇలాంటి వాహనాలన్నీ కూడా బిఎస్6 కంటే తక్కువ కాలుష్య ప్రణామాలకు లోబడి ఉంటాయి. కాబట్టి, ఇవి పర్యావరణాన్ని ఎక్కువ హానిని కలిగిస్తాయి.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

ఈ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, దేశంలో పాత వాహనాల వినియోగాన్ని నివారించేందుకు కఠిన నియమాలను అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా, కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది, ఇందులో అన్ని పాత ప్రైవేట్ మరియు వాణిజ్య వాహనాలపై విధించే ఛార్జీల గురించి సమాచారాన్ని అందించింది.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

అయితే, ఈ విధానం దేశ రాజధాని ఢిల్లీలో భిన్నంగా ఉంటుంది. ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలో 10 సంవత్సరాల కంటే పాతబడిన డీజిల్ వాహనాలు మరియు 15 సంవత్సరాల కంటే పైబడిన పెట్రోల్ వాహనాలను నడపడంపై ఇప్పటికే నిషేధం అమలులో ఉంది.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

ఈ వాహనాలపై పెరిగిన సుంకం

వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి, కొత్త ఫీజు రేట్లు అమలు కానున్నాయి. ఇకపై 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం రూ. 300 కి బదులుగా, రూ. 1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒకవేళ మీరు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కారును నడుపుతుంటే, రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం రూ. 5,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

అదేవిధంగా, బస్సులు లేదా ట్రక్కుల వంటి 15 సంవత్సరాలకు పైబడిన ప్రభుత్వ మరియు వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ల రెన్యువల్ కూడా ప్రస్తుత ధర కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ రుసుము సుమారు రూ. 10,000 నుండి రూ. 12,500 వరకూ ఉంటుంది. దిగుమతి చేసుకున్న బైకులు మరియు కార్ల కోసం రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఇప్పటికే చాలా ఖరీదైనది. అలాంటి ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు రూ. 10,000 వరకూ మరియు నాలుగు చక్రాల వాహనాలకు రూ. 40,000 వరకూ ఖర్చు అవుతుంది.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

వాహన యజమాని తమ పాత వాహనాలను సకాలంలో నమోదు చేయకపోయినా లేదా రిజిస్ట్రేషన్ రెన్యువల్ విషయంలో జాప్యం చేసినా, ప్రతిరోజు రూ. 50 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల పునరుద్ధరణకు దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయితే, ప్రతి నెలా ఆలస్యం అయినందుకు ప్రైవేట్ వాహన యజమాని నుండి రూ. 300 మరియు వాణిజ్య వాహన యజమాని నుండి రూ. 500 వసూలు చేయడం జరుగుతుంది. వాహనం యజమాని స్మార్ట్ కార్డ్ హోల్డర్ అయితే అదనంగా రూ. 200 ఫీజు కూడా వసూలు చేయబడుతుంది.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది ఆగస్టులోనే గుజరాత్ లో ప్రారంభించారు. ఈ విధానం ప్రకారం, వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి భారీ వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయబడింది మరియు జూన్ 1, 2024 నుండి ఇతర కేటగిరీలకు చెందిన వాహనాలకు దశలవారీగా అమలు చేయడం జరుగుతుంది.

15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు 8 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ రెన్యువల్ చార్జీలు

వెహికల్ స్క్రాపింగ్ విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరి 1 న తన బడ్జెట్ సమర్పణలో ప్రవేశపెట్టారు. స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానంలో భాగంగా పాత మరియు సర్వీసులో లేని వాహనాలను దశలవారీగా తొలగించడమే ఈ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో, ప్రైవేట్ వాహనాల కోసం 20 ఏళ్ల తర్వాత మరియు వాణిజ్య వాహనాల కోసం 15 ఏళ్ల తర్వాత ఆటోమేటెడ్ సెంటర్లలో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి చేయబడింది.

Most Read Articles

English summary
Registration renewal to cost 8 times more for 15 year old vehicles
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X