ముంబై పోలీసులకు 10 ఏటివి లను బహుమతిగా ఇచ్చిన రిలయన్స్ సంస్థ

ముంబై నగరంలోని తీరప్రాంతాల్లో పెట్రోలింగ్ కోసం 10 అత్యాధునిక ఆల్ టెర్రైన్ వాహనాలను (ఏటివి) బే పోలీస్ ఫోర్స్‌కు విరాళంగా ఇచ్చినట్లు రిలయన్స్ ఫౌండేషన్ పేర్కొంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, ముంబైలో అన్‌లాక్ 1.0ని ప్రకటించారు.

ముంబై పోలీసులకు 10 ఏటివి లను బహుమతిగా ఇచ్చిన రిలయన్స్ సంస్థ

ఈ కరోనా అన్‌లాక్ మొదటి రోజున నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం 10 పొలారిస్ ఏటివిల బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

ముంబై పోలీసులకు 10 ఏటివి లను బహుమతిగా ఇచ్చిన రిలయన్స్ సంస్థ

ఈ వాహనాలను రిలయన్స్ ఫౌండేషన్ ముంబై పోలీసులకు విరాళంగా ఇచ్చింది, ముంబై బీచ్‌లలో వీటిని పెట్రోలింగ్ కోసం ఉపయోగించనున్నారు. ఆల్-టెర్రైన్ వాహనాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోలారిస్ బ్రాండ్ వీటిని తయారు చేసింది.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

ముంబై పోలీసులకు 10 ఏటివి లను బహుమతిగా ఇచ్చిన రిలయన్స్ సంస్థ

ఈ ఆల్-టెర్రైన్ వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడానికి ఉపయోగపడతాయి. పొలారిస్ అందిస్తున్న ఈ ఏటివిలు బురద, ఇసుక మరియు కొండ ప్రాంతాలు వంటి అన్ని రకాల భూఉపరితలాలపై నడుస్తాయి.

ముంబై పోలీసులకు 10 ఏటివి లను బహుమతిగా ఇచ్చిన రిలయన్స్ సంస్థ

ఈ ఏటివిలను తయారు పొలారిస్ మోటార్ కంపెనీ ఒక అమెరికన్ ఆటోమొబైల్ సంస్థ, ఇది ప్రధానంగా అన్ని భూభాగ వాహనాలు (ఆల్ టెర్రైన్ వెహికల్స్) మరియు స్నోమొబైల్ (పొడి మంచుపై ప్రయాణించే వాహనా)లను తయారు చేస్తుంది.

MOST READ:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

ముంబై పోలీసులకు 10 ఏటివి లను బహుమతిగా ఇచ్చిన రిలయన్స్ సంస్థ

రిలయన్స్ ఫౌండేషన్ ముంబై పోలీసులకు విరాళంగా ఇచ్చిన పోలారిస్ మోడల్ 570 ఇఎఫ్‌ఐ రేంజర్ ఏటివి. ఈ ఆల్-టెర్రైన్ వాహనం 570సిసి 4-స్ట్రోక్, డిఓహెచ్‌సి సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 44 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు.

ముంబై పోలీసులకు 10 ఏటివి లను బహుమతిగా ఇచ్చిన రిలయన్స్ సంస్థ

ఈ వాహనం సుమారు 10 అంగుళాల గ్రౌండ్ క్లియరెన్స్‌ను మరియు 2,667 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ పోలారిస్ ఏటివిలో నలుగురు ప్రయాణీకులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన సీటింగ్ ఉంటుంది.

MOST READ:సూపర్ కారుతో కబాబ్ తయారు చేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే?

ముంబై పోలీసులకు 10 ఏటివి లను బహుమతిగా ఇచ్చిన రిలయన్స్ సంస్థ

ఈ వాహనంలో సులువుగా ప్రయాణించేందుకు మరియు నిష్క్రమించేందుకు దీనికి ఇరువైపులా డోర్లు ఉండవు. ప్యాసింజర్ల సేఫ్టీ కోసం సీట్ బెల్టులు మరియు డోర్ ప్రాంతంలో బెల్టులతో కూడిన మెష్ ఉంటుంది. అంతేకాదు, ఈ వాహనాలకు పైకప్పు (రూఫ్) కూడా ఉండదు. ఇవి పూర్తిగా ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం ఉద్దేశించి తయారు చేయబడినవి.

ముంబై పోలీసులకు 10 ఏటివి లను బహుమతిగా ఇచ్చిన రిలయన్స్ సంస్థ

డ్రైవర్ అసిస్టెన్ కోసం ఈ ఆల్-టెర్రైన్ వాహనంలో 2 ఇంచ్ ఎల్‌సిడి రైడర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, స్పీడోమీటర్, టాకోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్, గేర్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్, సీట్‌బెల్ట్ రిమైండర్ లైట్ మరియు ఒక అనలాగ్ డయల్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

MOST READ:ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

ముంబై పోలీసులకు 10 ఏటివి లను బహుమతిగా ఇచ్చిన రిలయన్స్ సంస్థ

ఇసుకతో నిండిన తీరప్రాంతాల వెంబడి ప్రయాణిస్తూ, గస్తీ కాసేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇదే తరహాలో తీర ప్రాంతాలను పర్యవేక్షించడానికి గుజరాత్ పోలీసులు కూడా 2013వ సంవత్సరం నుండి పొలారిస్ ఆల్-టెర్రైన్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. గుజరాత్ పోలీసులు పెట్రోలింగ్ కోసం పొలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎస్ 800 ఏటివిలను ఉపయోగిస్తున్నారు.

Most Read Articles

English summary
Reliance Foundation Donates 10 Polaris ATVs To Mumbai Police For Patrolling. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X