రెనో రన్నర్ - ట్రైన్‌గా మారే టాక్సీ (ఫ్యూచరిస్టిక్ వెహికల్)
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న విచిత్ర వాహనాన్ని చూడండి. చూడటానికి ఇది చాలా చిత్రంగా ఉంది కదూ..! హాలీవుడ్ సినిమాల్లో కనిపించే అధునాతన వాహనంలా కనిపిస్తోంది కదూ..! దీని పేరు 'రెనో రన్నర్' (Renault Runner).
సిటీ టాక్సీగా వాడుకునే ఈ వాహనాన్ని ట్రైన్‌లా మార్చుకోవటం దీని ప్రత్యేకత. అందుకే ఇది విశిష్టమైన కాన్సెప్ట్ వాహనంగా నిలించింది. ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అధునాతన వాహనాన్ని అభివద్ధి చేసింది.
రెనో రన్నర్ కాన్సెప్ట్ వాహనాన్ని అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ ఫ్యూచరిస్టిక్ వాహనానికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

రెనో రన్నర్ ఒక ఫ్యూచరిస్టిక్ టాక్సీ కాన్సెప్ట్. ఇలాంటి రెనో రన్నర్ వాహనాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయటం ద్వారా (రైలు భోగీల మాదిరిగా) దీనిని ఓ రకమైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌గా మార్చుకోవచ్చు.

సెక్యూర్ వైర్‌లెస్ కమాండ్ ద్వారా రెనో రన్నర్ వాహనాలను ఆటోమేటిక్‌గా ఒకదానితో ఒకటి రైలుగా మాదిరిగా జతచేయవచ్చు. ఇలా మొత్తం 3 యూనిట్లు/క్యాబిన్లను జచతచేయవచ్చు.

అంతేకాకుండా, రెనో రన్నర్‌ను ఓ సిటీ కారు మాదిరిగా, అలాగే ఓ డిసెర్ట్ యుటిలిటీ వెహికల్‌గా కూడా ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

రెనో రన్నర్ కాన్సెప్ట్ వాహనం సౌర విద్యుత్తుతో నడుస్తుంది. ఫలితంగా ప్రకృతికి ఎలాంటి హాని కలిగించకుండా 'జీరో ఎమిషన్ వెహికల్'గా నిలుస్తుంది.

రెనో రన్నర్‌లో సూపర్ సెన్సిటివ్ సోలార్ ప్యానెళ్లను దీని అద్దాల(విండో)లో అమర్చారు. ఈ ప్యానెళ్లు చాలా పారదర్శకంగా ఉంటాయి. ఈ పారదర్శకతను మనకు నచ్చిన విధంగా సర్దుబాటు చేసుకునే వెసలుబాటు ఉంటుంది.

మల్టీ-లెవల్ హబ్-లెస్ డైనమో వీల్స్, కైనటిక్ పవర్ కన్వర్టర్ వంటివి రెనో రన్నర్‌లోని ఇతర కీలక ఫీచర్లు.

ఇంకా ఇందులో 306 డిగ్రీ పానరోమిక్ వ్యూ, ఇంటెలిజెంట్ డేలైట్ రన్నింగ్ ఎల్ఈడి లైట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

రెనో రన్నర్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌ను వాల్టర్ ఎమ్. రాబర్ట్ డిజైన్ చేశారు. (ప్రస్తుతానికి ఈ వాహనం కాన్సెప్ట్ మాత్రమే, భవిష్యత్తులో రియాల్టీలోకి వచ్చే ఆస్కారం లేకపోలేదు).



Click it and Unblock the Notifications








