పశువులను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడిన కారు.. యాక్సిడెంట్ తర్వాత కారు ఎలా దెబ్బతిందో చూడండి..

దేశంలో జాతీయ రహదారులపై మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయి హైవేలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, ఏమరపాటు ఓ కారణంగా ఉంటే.. రోడ్లపై పశువులు సంచరించడం మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది.

రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనతో ప్రమాదాలు వాటిల్లుతుంటే మరో వైపు పశువులు, వీధి కుక్కల సంచారం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ కారణంగా రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రమాదం ఇందుకు ఉదాహరణ.ఇక్కడ గేదెల మందను కాపాడబోయి రెనాల్ట్ ట్రైబర్ కారు బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Renault-Triber-Accident

ప్రమాదం జరిగినప్పుడు కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని, పశువుల మందను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా గేదెల మంద అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ గేదె డివైడర్‌లో ఇరుక్కుపోగా కారు టైరు సైతం పగిలింది. దీంతో వెంటనే కారు అదుపు తప్పి బోల్తా పడింది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఘటనకు ముందు రెనాల్ట్ ట్రైబర్ డ్రైవర్ అతివేగంగా కారు నడపడమే ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. కారు ముందు భాగంలోని విండ్ షీల్డ్, సైడ్ ప్యానెల్స్ మరియు డోర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Renault-Triber-Accident

అదృష్టవశాత్తూ కారు డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే కొన్ని కారణాల వల్ల కారులోని ఎయిర్‌ బ్యాగ్‌లు సమయానికి సరిగా పనిచేయలేదని తెలిసింది. ప్రమాదంలో రెనాల్ట్ ట్రైబర్‌ యొక్క టైర్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది.

రిపేరు చేయలేని రీతిలో కారు పాడైనట్లుగా వీడియోలో కారు కండిషన్‌ను బట్టి చూస్తే ఇది కచ్చితంగా తీవ్ర ప్రమాదంగానే అర్థమవుతోంది. అయితే, రెనాల్ట్ ట్రైబర్ నిర్మాణ నాణ్యత డ్రైవర్‌ను ప్రాణాలతో బయట పడేసిందనడంలో సందేహం లేదు. ఏదేమైనా డ్రైవర్ అతివేగం, రోడ్డుకి అడ్డంగా పశువులు రావడంతో ఘోర ప్రమాదంతో పాటు బండి నుజ్జునుజ్జయింది.

Renault-Triber-Accident

Renault Triber అద్భుతమైన నాణ్యత: గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో రెనాల్ట్ ట్రైబర్ 4-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ప్రమాదంలో డ్రైవర్‌ సురక్షితంగా బయటపడటానికి ఇది ఒక కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ స్థాయి ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయట పడే అవకాశాలు చాలా తక్కువ. మీరు వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ట్రైబర్స్ ఎ పిల్లర్ పూర్తిగా దెబ్బతింది, అలాగే రూఫ్ మరియు విండ్‌స్క్రీన్ అన్నీ నుజ్జునుజ్జయ్యాయి.

డ్యాష్‌బోర్డ్ మరియు స్టీరింగ్ వీల్ కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన భారతీయ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఇంకా కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ ప్రాధాన్యతను సైతం గుర్తు చేస్తుంది. ఎయిర్ బ్యాగులు సకాలంలో స్పందించి ఉంటే.. డ్రైవర్ గాయాల బారి నుంచి బయటపడే అవకాశం ఉండేది.

రహదారిపై వేగ పరిమితిని పాటించి వాహనాన్ని సకాలంలో నిలిపివేసినట్లయితే ఈ రకమైన ప్రమాదాన్ని నివారించవచ్చు. అయితే, ఇది హైవే అయినందున, డ్రైవర్‌ను తప్పు పట్టలేము. ఎందుకంటే హైవేలు అతివేగంగా నడపడానికి ఉద్దేశించబడ్డాయి. అలాగే దేశంలో పశువులను హైవేలపై వదిలేయడం మామూలే. దీనిని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.


నాణ్యతకు ప్రాధాన్యత: ఈ రోజుల్లో భారతదేశంలోని కార్ల తయారీదారులు నిర్మాణ నాణ్యతను సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించారు. టాటా మరియు మహీంద్రా వంటి బ్రాండ్‌లు వాటి ధృడమైన నిర్మాణ నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. రెనాల్ట్, స్కోడా మరియు ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈ గ్రూపులో చేరాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 9, 2023, 8:52 [IST]
English summary
Renault triber lost control and rolled over while trying to avoid cattle on the road driver safe
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+