రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ‘తేజస్‌'.!! పరేడ్‌లో మరో 51 యుద్ధ విమానాల విన్యాసాలు.!!

ఈ ఏడాది దేశంలో రిపబ్లిక్‌ వేడుకలు(Republic Day 2024) అట్టహాసంగా, సరికొత్తగా జరగనున్నాయి. ఈ మేరకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌(IAF) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రిపబ్లిక్‌ డే పరేడ్‌లో 51 యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేయనున్నాయి. అయితే ఈ సారి మరింత ప్రత్యేకంగా నిలిచేందుకు స్వదేశీ యుద్ధ విమానం తేజస్‌ కూడా కవాతులో పాల్గొననుంది.

భారత వైమానిక దళంలో 'తేజస్‌'(Tejas) యుద్ధ విమానాలది ప్రత్యేక స్థానం. ఎందుకంటే మొదటిసారి ఈ విమానాలు స్వదేశంలో తయారుచేయబడి భారత రక్షణ రంగంలో సేవలందిస్తున్నాయి. అందుకే ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కుతూ జనవరి 26న రిపబ్లిక్‌ డే పరేడ్‌లో C-295 రవాణా విమానాన్ని చారిత్రాత్మకంగా చేర్చినట్లు IAF ప్రకటించింది.

Republic-Day-Parade-Tejas-C2-295-51-Planes

దీంతో పాటు రిపబ్లిక్‌ డే పరేడ్‌(Republic Day Parade)లో 29 యుద్ధ విమనాలు, 8 రవాణా విమానాలు, 13 హెలికాప్టర్లతో పాటు ఒక హెరిటేజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సహా మొత్తం 51 IAF విమానాలు పాల్గొననున్నాయి. ఈ కవాతు 1971లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన ప్రసిద్ధ టాంగైల్‌ ఎయిర్‌డ్రాప్‌ను గుర్తు చేస్తుందని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తెలిపింది. ఈ మేరకు IAF వింగ్ కమాండర్‌ మనీష్‌ వివరాలు వెల్లడించారు.

Republic-Day-Parade-Tejas-C2-295-51-Planes

స్వదేశీ రక్షణ తయారీకి సెల్యూట్‌ చేస్తూ ఈ సారి రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మేడ్‌-ఇన్‌-ఇండియా ఆయుధ వ్యవస్థలు, ప్లాట్‌ఫామ్‌లను ప్రదర్శించాలని భారత సైన్యం యోచిస్తోంది. అంతే కాకుండా LCH ప్రచంద్‌ ఛాపర్‌, పినాకా మల్టీ బ్యారెల్‌ రాకెట్ల లాంచర్లతో పాటు నాగ్‌ యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌ను కూడా పరేడ్‌లో ప్రదర్శించనున్నట్లు సమాచారం.

Republic-Day-Parade-Tejas-C2-295-51-Planes

LCH ప్రచంద్‌(LCH Prachand)ను HAL రూపొందించి తయారు చేసింది. ఇది అత్యంత శక్తివంతమైన గ్రౌండ్‌ ఎటాక్‌ను కలిగి ఉండటంతో పాటు ఎయిర్‌ ఫోర్స్‌ కంబాట్‌ సామర్థ్యాలను కలిగి ఉంది. బలమైన కవచ రక్షణతో పాటు, రాత్రి సమయాల్లోనూ దాడి చేసే సామర్థ్యాలు LCH ప్రచంద్‌ ప్రత్యేకతలు.

LCH ప్రచంద్‌ యుద్ధ విమానంలో అధునాతన నావిగేషన్‌ సిస్టమ్‌తో పాటు, క్లోజ్‌ కంబాట్‌ గన్‌లు, ఇంకా మిస్సైల్స్‌ను ప్రయోగించే సామర్థ్యాలను కలిగి ఉండటంతో యుద్ధ రంగంలో టెక్నాలజీ పురోగతికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. DRDO అభివృద్ధి చేసిన నాగ్‌ యాంటీ ట్యాంక్ మిస్సైల్‌... Fire and Forget, Top Attack సామర్థ్యాలను కలిగి ఉంది.

Republic-Day-Parade-Tejas-C2-295-51-Planes

ఇంకా రిపబ్లిక్‌ పరేడ్‌లో భాగంగా అనేక రకాల ఆయుధ వ్యవస్థలను భారత సైన్యం ప్రదర్శించనుంది. T-90 ట్యాంక్‌, BMP-2 పదాతిదళ పోరాట వాహనంతో పాటు డ్రోన్‌ జామర్లు, మల్టీ ఫంక్షన్‌ రాడార్‌, మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ లాంచర్‌, అడ్వాన్స్‌డ్‌ సర్వత్ర బ్రిడ్జ్‌ ఇలా ఎన్నో ఆయుధాల ప్రదర్శనను చూడబోతున్నాం.

Republic-Day-Parade-Tejas-C2-295-51-Planes

ఇంకా భారత సైన్యంలో సేవలందిస్తున్న స్వదేశీ స్వాతి వెపన్‌ లొకేటింగ్‌ రాడార్‌ గన్స్‌, రాకెట్‌లు, మోర్టార్లను రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్‌, రుద్ర ALH ధ్రువ్‌ ఛాపర్ల ఆధునిక వెర్షన్లు ఇందులో కవాతులో పాల్గొంటాయి. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసి ఎగుమతి చేసిన పినాకా రాకెట్‌ సిస్టమ్‌, స్వాతి రాడార్‌ల ప్రదర్శన కూడా ఉండనుంది.

Republic-Day-Parade-Tejas-C2-295-51-Planes

అంతే కాకుండా ఈ సారి రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మరో ప్రత్యేకత కూడా ఉండనుంది. భారత త్రిదళాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రై- సర్వీసెస్‌ ఆల్‌ ఉమెన్‌ మార్చింగ్‌ కాంటెంజెంట్‌లో 60 మంది మహిళా సైనికులు పాల్గొననున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతులో C-295 విమానాలను చేర్చడంతో పాటు స్వదేశీ రక్షణ సామర్థ్యాలను ప్రదర్శించడం, సాయుధ దళాల్లో మహిళలకు గుర్తింపు ఇవ్వడం దేశ రక్షణలో వైవిధ్యం, నిబద్ధతకు ప్రతీకగా నిలవనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 25, 2024, 11:32 [IST]
English summary
Republic day celebrations iaf plans 52 planes including tejas to participate in parade
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+