డొక్కు సిటీ బస్సును కదిలే బార్ బస్‌గా మార్చిన రష్యన్స్!
సిటీ బస్సులకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది, అది ముగియగానే వాటిని పాత ఇనుప సామాన్ల వాడికి అమ్మేయాల్సిందే. కానీ, రష్యాలో మాత్రం అలా చేయకుండా, పాత సిటీ బస్సును ఓ నైట్ క్లబ్‌గా మార్చారు. ఇదిగో ఈ ఫొటోలో తళుక్కుమని మెరుస్తున్న కారు, నిజానికి ఓ పాత డొక్కు సిటీ బస్సు. దానిని ఇలా కదిలే పబ్‌గా తీర్చిదిద్దారు.
ఈ బస్సు పేరు 'బార్ బస్ మ్యాక్సీ'. పేరుకు తగినట్లుగా ఈ బస్సులో బార్, పబ్, టాయ్‌లెట్, రెస్టారెంట్ వంటి అన్ని సౌకర్యాలున్నాయి. వాస్తవానికి ఇదొక ఇకారస్ 280.33 ఎయిర్-కండిషన్డ్ సిటీ బస్సు. దీనిని 2007లో సెయింట్ పీటర్స్‌బర్గ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం నుంచి తొలగించి వేశారు. ఆ తర్వాత కొందరు ఔత్సాహిక రష్యన్స్ దీనిని ఇదిగో ఇలా మార్చారు.

రోలింగ్ బార్, స్ట్రిప్ క్లబ్, పార్టీ వెన్యూ ఇలా అనేక రకాలుగా ఈ బస్సును ఉపయోగించుకుంటున్నారు. చిన్న పిల్లల బర్త్‌డే పార్టీల నుంచి పెద్దవాళ్ల పెళ్లిళ్ల వరకూ ఈ బస్సును ఆర్డర్ చేసి పిలిపించుకుంటున్నారు. ఈ బస్సు కోసం రష్యాలో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఇదే సైట్ ద్వారా బస్సును పార్టీ కోసం బుక్ చేసుకోవచ్చు కూడాను.
ఈ బార్ బస్ మ్యాక్సీ అద్దె గంటకు 140 డాలర్లు. అయితే, కస్టమర్లు ఇందులో ప్రత్యేకమైన డెకరేషన్, డిజే, బార్‌టెండర్స్, స్ట్రిప్పర్స్ వంటి సదుపాయాలను కోరుకున్నట్లయితే, ఈ అద్దె రేటు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రష్యాలో ఈ బార్ బస్ బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పటికే ఇది అక్కడి స్థానిక టెలివిజన్ ఛానెళ్లు, సినిమా షూటింగ్స్‌లో కూడా కనిపించింది.




Click it and Unblock the Notifications








