ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

శాస్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో ఆర్టీఓ నియమ నిబంధనల ప్రకారం, అధికారుల సమక్షంలో మనం వాహనం సరిగ్గా నడిపి చూపించాల్సి ఉంటుంది. ఈ భౌతిక పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులైన వారికి మాత్రమే శాస్వత డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయటం జరుగుతుంది. కానీ, ఈ విషయంలో చేసే ఒక్క చిన్న పొరపాటు వలన చాలా మంది తమ డ్రైవింగ్ లైసెన్సును పొందలేకపోతున్నారు.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

వాస్తవానికి, ప్రజలు భౌతిక డ్రైవింగ్ టెస్టుకు హాజరు కావటానికి ముందే అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. నిపుణుల పర్యవేక్షణలో డ్రైవింగ్ శిక్షణ తీసుకోవటం ద్వారా ముందుగానే వాహనం నడపిన అనుభవాన్ని పొందటం, డ్రైవింగ్ చేసే సమయంలో పాటించాల్సిన మెళకువలు మరియు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పొందటం వంటి విషయాల గురించి తెలుసుకుంటారు.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

అయినప్పటికీ, ఒక చిన్న తప్పు కారణంగా, వారు ఈ భౌతిక డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు, ఫలితంగా డ్రైవింగ్ లైసెన్సుకు దూరం అవుతున్నారు. తాజాగా, డ్రైవింగ్ టెస్టుల విషయంలో కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో తెలుసుకుందాం రండి...

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

డ్రైవింగ్ పరీక్షలో విఫలం కావడానికి ప్రధాన కారణం

కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉండే ఆర్టీవో కార్యాలయాలలో తయారు చేసిన డ్రైవింగ్ లైసెన్స్ యొక్క అన్ని ప్రక్రియల రికార్డును నిర్వహిస్తుంది. ఈ రికార్డుల ప్రకారం, డ్రైవింగ్ టెస్ట్ రిపోర్టులో ప్రజలు చరచూ విఫలం కావడానికి గల ప్రధాన కారణాన్ని సదరు మంత్రిత్వ శాఖ గుర్తించగా, నాలుగు చక్రాల వాహనాల డ్రైవింగ్ పరీక్ష సమయంలో, దాదాపు 31 శాతం మంది వ్యక్తులు వాహనాన్ని రివర్స్ చేయడంలో పొరపాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

భౌతిక డ్రైవింగ్ పరీక్షా సమయంలో చాలా మంది ప్రజలు తమ కారును ముందుకు, కుడి వైపుకు లేదా ఎడమ వైపుకు చక్కగానే నడిపినప్పటికీ, అదే కారను వెనక్కి (రివర్సులో) నడిపేటప్పుడు మాత్రం అంత ధీమాగా వ్యవహరించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. ఫలితంగా, వారికి శాస్వత డ్రైవింగ్ లైసెన్సును తిరస్కరించడం జరుగుతుంది. ఇలా తిరస్కరించబడిన వారు, తిరిగి కొద్ది రోజుల తర్వాత డ్రైవింగ్ పరీక్ష కోసం ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

లైసెన్స్ పొందడానికి 69 శాతం మార్కులు అవసరం

శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, వ్రాత పరీక్షలో సదరు దరఖాస్తుదారుడు కనీసం 69 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే వారు తదుపరి భౌతిక డ్రైవింగ్ పరీక్షకు అర్హత పొందుతారు. ఈ సమయంలో సదరు దరఖాస్తుదారుడు కుడి లేదా ఎడమ వైపుకు నడపటం, లేన్ చేంజ్, బ్రేక్ టైమింగ్, టర్నింగ్ సిగ్నల్ మరియు రివర్సింగ్ వంటి ప్రాథమిక డ్రైవింగ్ పద్ధతుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో మార్పులు

ఇదిలా ఉంటే, జూలై 2021 నుండి డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో కేంద్ర మంత్రిత్వ శాఖ అనేక మార్పులు చేసింది. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ మరింత సులభతరం చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ మరియు లైసెన్సులో మార్పులు, వాహనానికి సంబంధించిన ఇతర పత్రాల పునరుద్ధరణ వంటి అనేక అంశాలును ఇప్పుడు ఆన్‌లైన్ చేయబడ్డాయి. ఈ మార్పుల తర్వాత, దరఖాస్తుదారుడు ఇప్పుడు తన ఇంట్లో కూర్చునే అన్ని సేవలను పొందవచ్చు.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

పర్మిట్, చిరునామా మార్పు, రహదారి పన్ను చెల్లింపు, రెన్యువల్స్, డూప్లికేట్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి 33 రకాల ఆర్టీవో సేవలను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ చేసింది. ఈ ఆన్‌లైన్ సేవల అనంతరం, ఇప్పుడు ప్రజలు భౌతిక డ్రైవింగ్ టెస్ట్ మరియు వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం మాత్రమే ఆర్టీవోని సందర్శించాల్సి ఉంటుంది.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

లెర్నింగ్ లైసెన్స్ ప్రక్రియ కూడా ఆన్‌లైన్‌లోనే..

ఇప్పుడు మీరు కొత్తగా లెర్నింగ్ లైసెన్స్ పొందాలంటే, ఇకపై ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కొత్త సవరణల తర్వాత, ఇప్పుడు ప్రజలు ఆన్‌లైన్‌లోనే లెర్నర్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇంటి నుండి ఆన్‌లైన్ పరీక్షకు కూడా హాజరు కావచ్చు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి లెర్నింగ్ లైసెన్స్ వారి ఇంటికే పంపించడం జరుగుతుంది.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

లెర్నింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ పరీక్షలో సుమారు 15 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో మీరు తొమ్మిది ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇస్తేనే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. లెర్నింగ్ లైసెన్స్ పొందిన ఒక నెల తర్వాత, మీరు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ధరఖాస్తు చేసుకున్న తర్వాత, షెడ్యూల్ ప్రకారం మీరు ఆర్టీవో కార్యాలయాన్ని సందర్శించి, అధికారుల ముందు భౌతికంగా వాహనం నడిపి చూపించాల్సి ఉంటుంది.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

40 ఏళ్లలోపు వారు మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించే విధానాన్ని కూడా ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. అయితే, ఇందులో 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. అంటే, 40 ఏళ్ల పైబడిన వారు మాత్రం, ప్రభుత్వం ధృవీకరించిన వైద్యుని ద్వారా, వారి ఆరోగ్య స్థితికి సంబంధించిన పత్రాలను ఆన్‌లోన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దీని ద్వారా నకిలీ ధృవపత్రాలు తయారు చేయడాన్ని అరికట్టవచ్చని కేంద్ర భావిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించే ప్రక్రియను ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో అధికారికంగా ప్రారంభించబడింది.

ఆ ఒక్క తప్పు వలన 31 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ రావట్లేదు..

ఇప్పుడు దరఖాస్తుదారు మెడికల్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మెడికల్ ఆఫీసర్ ప్రతి మెడికల్ సర్టిఫికెట్ జారీకి పది రూపాయలు ఫీజును వసూలు చేస్తారు. దీని కోసం, సారథి పోర్టల్‌లో మెడికల్ ఆఫీసర్‌ల కోసం ప్రత్యేకమైన లాగిన్ ఐడీలు ఉంటాయి. వైద్యులు ఆన్‌లైన్‌లో సమర్పించే మెడికల్ సర్టిఫికెట్ల ఆధారంగా మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేస్తారు.

Most Read Articles

English summary
Reverse driving fail causes 31 percent applicants to loose their driving license
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X