మోటార్ సైకిల్‌ నడిపిన దెయ్యం: సోషల్ మీడియాలో వైరల్‌ వీడియో!

Written By:

రైడర్ లేని మోటార్ సైకిల్‌ హై వే మీద తనంతట తానుగా ఒకే లైనులో ప్రయాణించింది, అటుగా వెళ్తున్న వాళ్లంతా ఇదెలా సాధ్యమని అశ్చర్యపోయారు. చూడటానికి కాస్త భయకరంగా అనిపించే ఈ సంఘటన ప్యారిస్‌లో జరిగింది. అయితే దీనిని వీడియో తీసి బైకును నడుపుతున్న దెయ్యం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బైక్ నడిపిన దెయ్యం

కొంత ఈ బైకును దెయ్యం నడిపిందని వాదిస్తుంటే, మరికొంత మంది మాత్రం దెయ్యం కాదు భూతం కాదు ఇందులో ఓ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అలా జరిగిందని వాదిస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు వాస్తవమేంటో చూద్దాం రండి.

బైక్ నడిపిన దెయ్యం

వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి కథనం మేరకు, "మేము కారులో ప్రయాణిస్తుండగా రైడర్ లేకుండా వేగంగా ప్రయాణిస్తున్న బైకును చూపించి వీడియో తీసుకోమన్నాడు నా స్నేహితుడు. అయితే రైడర్ లేకుండా బైక్ అలా వెళ్లడంతో దెయ్యమే బైకును నడుపుతోందని నమ్మినట్లు" తెలిపాడు.

బైక్ నడిపిన దెయ్యం

ఈ బైకును దెయ్యమే నడిపిందా...? అనే మిస్టరీ చివరి సమిసిపోయింది. బైకు అలా ప్రయాణించడానికి కొన్ని క్షణాల ముందు ప్రమదానికి గురైనట్లు రిపోర్ట్స్ తెలిపాయి. ఈ బైకును నడుపుతున్న వ్యక్తి ఇతర వాహనాన్ని తాకినపుడు అతడి చెయ్యి ప్రమాదానికి గురయ్యి, బైకు మీద నుండి క్రింద పడిపోయాడు.

బైక్ నడిపిన దెయ్యం

ప్రమాదానికి కారణమైన వాహనంలోని వారు అతన్ని రక్షించి, అతడి బైకు కోసం ప్రమాద స్థలాన్ని గాలించారు. అయితే ఆ బైకు దొరకలేదు. చేసేది లేక గాయాలతో ఉన్న అతడిని ముందుగా హాస్పిటల్‌కు తరలించారు.

బైక్ నడిపిన దెయ్యం

ప్రమాదానంతరం తన బైకు కనబడకపోవడంతో ఎవరో ఎత్తుకెళ్లారని భావించాడు సదరు మోటార్ సైకిల్ రైడర్. అయితే అనుకోకుండా పోలీసులు అతడికి ఫోన్ చేసి, మీకు ప్రమాదం జరిగిన కొద్ది దూరంలో మీ బైకును గుర్తించడం జరిగిందని తెలిపారు.

మిస్టరీ...?

మిస్టరీ...?

రైడర్ లేని బైకు కొద్ది దూరం కూడా ప్రయాణించలేదు. అలాంటిది భారీ బరువున్న బైకు తనంతట తానుగా అంత దూరం ఎలా ప్రయాణించిందని అందరికీ అనుమానం కలిగింది. సోషల్ మీడియాలో తన బైకు ప్రయాణించిన తీరును చూసి దెయ్యమే నడిపిందని అందరూ అనుకున్నారు.

నిజం ఏమిటి...?

నిజం ఏమిటి...?

నిజానికి బైకు దెయ్యం నడపలేదు, భూతం నడపలేదు. బైకులో ఉన్న క్రూయిజ్ కంట్రోల్ అనే ఫీచర్ ద్వారానే ఇలా జరిగింది. క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఉండటం ద్వారా యాక్సిలరేట్ చేయకుండా బైకు కొంత దూరం పాటు తనంటతానుగా ప్రయాణిస్తుంది. క్రూయిజ్ కంట్రోల్ ఉన్న బైకులు గరిష్టంగా 600మీటర్ల వరకు ట్రావెల్ చేయగలవు.

కానీ క్రూయిజ్ కంట్రోల్ కారణంగానే బైకు అంత దూరం ప్రయాణించిందనే ఖచ్చితమైన నిర్ధారణ లేదు. ఈ బైకును దెయ్యం నడిపిందని కొందరు, క్రూయిజ్ కంట్రోల్ నడిపిందని కొందరు, ఎవరి వాదనల్లో వారున్నారు - ఇక్కడ ఉన్న వీడియో వీక్షించండి...

English summary
Read In Telugu Watch A 'Ghost' Motorcycle Freaking Out Motorists On A Highway
Story first published: Thursday, June 15, 2017, 12:35 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark