నెంబర్ ప్లేట్లపై పిచ్చి రాతలు రాస్తే జరిమానా తప్పదు!!

wacky messages on number plates
ఎప్పటిలాగే ఈ రోజు కూడా నేను టూవీలర్‌పై ఆఫీసుకు బయలుదేరాను. రోడ్డుపై వెళ్తుండగా.. ఓ టూ-వీలర్ రైడర్ తన బైక్‌ వెనుకవైపు ఉండే నెంబర్ ప్లేట్‌పై ఇలా స్టిక్కరింగ్ చేయబడి ఉండటాన్ని గమనించాను "I Don't Trust Any Girl Exept My ******" (***** అంటే అతని గర్ల్ ఫ్రెండ్ పేరు అన్నామాట).

''నా ప్రియురాలిని తప్ప వేరే ఏ అమ్మాయిని నేను విశ్వసించను'' అని దీని అర్థం. అంటే తన ప్రేయసిపై తనకున్న అపారమైన నమ్మకాన్ని సదరు బైక్ రైడర్ ఈ విధంగా తెలియజెప్పే ప్రయత్నం చేశాడన్నమాట. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాననే కదా మీ సందేహం.! అక్కడికే వస్తున్నా..!

సరే.. కాస్తంత దూరం వెళ్లాక, సదరు బైక్ రైడర్‌ను ట్రాఫిక్ పోలీసు అడ్డుకున్నాడు. అతనివద్ద హెల్మెట్‌తోపాటుగా లైసెన్స్ మరియు వాహనానికి కావాల్సిన అన్ని పత్రాలు ఉన్నాయి. అయినా సరే అతను జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే.. బైక్ నెంబర్ ప్లేట్‌పై పిచ్చి రాతలు రాశాడనే నెపంతో పోలీసులు అతడికి జరిమానా విధించడం జరిగింది.

వాహనంపై ఇలా రాయడం / స్టిక్కరింగ్ చేయించుకోవడం తప్పు కాదు. కానీ, దానిని నెంబర్ ప్లేట్‌పై రాయడం మాత్రం చట్ట విరుద్ధం. ఇప్పటికే నెంబర్ ప్లేట్ ఎలా ఉండాలో అనే దాని గురించి ఆర్టీవో కార్యాలయాల్లో వివరంగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. వారు తెలిపిన విధావం ప్రకారం మాత్రమే నెంబర్ ప్లేట్‌పై అక్షరాలు / నెంబర్లు ఉండాలే తప్ప మనకు తోచిన విధంగా వాటిని మార్చరాదు.

ఇటీవలే తమిళనాడు రాష్టంలో వాహనాల నెంబర్ ప్లేట్లకు సంబంధించి ఆ రాష్ట్ర ఆర్టీవో కఠిన చర్యలను అవలంబిస్తోంది. నెంబర్ ప్లేట్‌పై అక్షరాలు / నెంబర్లు ఏ పరిమాణంలో ఉండాలో, అక్షరానికి అక్షరానికి మధ్య దూరం ఎంత ఉండాలో అనే విషయాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుంతోంది.

ఎవరైనా నెంబర్ ప్లేట్ నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు వాహనం యొక్క ఆర్‌సి బుక్‌ను తాక్కాలికంగా రద్దు చేయడం వంటి చర్యలను కూడా అవలంభిస్తున్నారు. కాబట్టి మిత్రులారా..! వాహనాలపై పేర్లు, కొటేషన్లు, చిత్రాలను వేయించుకునే ముందు మరొక్క సారి ఆలోచించుకుని, అవి మీకు ఎంత వరకూ అవసరమో అనే విషయాన్ని గ్రహించుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. వాహనాలపై ఎక్కువగా పెద్ద పెద్ద స్టిక్కర్లను అతికించడం మూలానా వాహనం రీసేల్ వ్యాల్యూపై ఇది స్వల్పంగా ప్రభావాన్ని చూపే ఆస్కారం కూడా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 17, 2011, 18:21 [IST]
English summary
Vehicle owners try to personalise their cars and bikes by adding wacky stickers and even write their own unique messages on them. While some of these messages are truly entertaining some bike riders are running the risk of being fined by traffic police as they paste some of their messages on the number plates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+