బైక్‌పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా.. వీడియో చూసి మీరే చెప్పండి

ఈ ఆధునిక కాలంలో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని సంఘటనలను గురించి మనం గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సంఘటన మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఒక వ్యక్తి బైక్ రైడ్ చేస్తూ వెళ్తున్నాడు. అయితే రైడ్ చేస్తున్న వ్యక్తితో పాటు రెండు పిల్లులు కూడా ఈ వీడియాలో మీరు గమనించవచ్చు. ఒక పిల్లి బైక్ రైడ్ చేస్తున్న వ్యక్తి వేపు మీద ఉన్న బ్యాగుపై కూర్చుని ఉంది. అయితే మరో పిల్లి బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ మీద కూర్చుని ఉంది. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ మీద కూర్చున్న పిల్లి కదలడం చూడవచ్చు.

బైక్‌పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా

పిల్లులతో బైక్ రైడ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుదు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ఈ వీడియోని ఇప్పటి వరకు 1.5 లక్షల కంటే ఎక్కువ మంది చూసారు. ఈ వీడియో చూసిన చాలామంది కామెంట్స్ చేశారు. కొందరు గొప్పగా ప్రశంసిస్తుంటే, మరి కొందరు సేఫ్టీ ఫస్ట్, ఆ తరువాత ఇలాంటి చేయొచ్చు అంటూ చెబుతున్నారు. ఈ సంఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ వీడియో అరుణ్ గౌడ అనే ట్విటర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోలో మనకు కనిపించే పిల్లులు రెండూ కూడా ఏ మాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా ఉండటం చూడవచ్చు. పెంపుడు జంతువుల మీద ప్రేమ చూపించడం మంచిదే, ఇలా మితిమీరితే మాత్రమే అనుకోని ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదం రోడ్డుపైన ప్రయాణించే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది.

బైక్‌పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా

ఈ వీడియో చూసిన వారిలో కొంతమంది ఆ బైక్ రైడర్ బాధ్యతా రహితంగా ప్రవర్తించాడని, అతని మీద చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. మనం ఇప్పటికే చెప్పుకున్నట్లు ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కావున పిల్లులు వంటి పెంపుడు జంతువులను వీలైనంత వరకు బైకులపై తీసుకెళ్లకూడదు.

జంతువులు చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు, కావున ట్రాఫిక్ లో జంతువులు బయపడి ఇతర వాహనదారుల మీదికి దూకవచ్చు, ఆ సమయంలో వారు భయపడితే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. కావున పెంపుడు జంతువులను వీలైనంత వరకు బైక్స్ మరియు స్కూటర్ల మీద తీసుకెళ్లకపోవడం మంచిది, ఒక వేళా తీసుకెళ్లాలి అనుకుంటే తగిన భద్రతలతో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో ఇండియా ఒకటి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, కొంతమంది వాహన వినియోగదారులు ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి. ఇవన్నీ ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్యను పెంచేస్తున్నాయి పెంచేస్తున్నాయి. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి.

భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, కావున ఎల్లప్పుడూ రోడ్లు చాలా రద్దీగా ఉంటాయి. బెంగళూరు వంటి నగరాలు ఎప్పుడు చాలా రద్దీగా ఉంటాయి. కావున ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా రోడ్డుపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనుకోని ప్రమాదాలను ఆహ్వానించినట్లే అవుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Riding bike with two pet cats on bengaluru roads viral video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X