వీడియో: కోల్ మైన్‌లో బైక్ రైడ్ చేస్తే..
అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ ఎనర్జీ డ్రింక్ బ్రాండ్ రెడ్ బుల్, విభిన్న రకాల మోటార్‌స్పోర్ట్‌లను స్పాన్సర్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఫార్ములా వన్, మోటోజిపి, ఫార్ములా డ్రిఫ్ట్ ఇలా చెప్పుకుంటే పోతే రెడ్ బుల్ స్పాన్సర్ చేసే మోటార్‌స్పోర్ట్ లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఇవేకాకుండా, రెడ్ బుల్ తమ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా విభిన్న అడ్వెంచరస్ వీడియోలను కూడా తయారు చేస్తుంది.
ఈనాటి మన వీడియోలో, 2014 రెడ్ బుల్ రోమానియాక్స్ సర్క్యూట్‌లో విజేతగా నిలిచిన పౌల్ బోల్టన్ కోల్ మైన్‌లో చేసిన అద్భుతమైన రైడ్‌ను చూద్దాం రండి. పెట్రిలా రోమానియాలో పాడుపడిన ఓ పాత కోల్ మైన్ (బొగ్గు గని)లో ట్రైల్ బైక్‌తో బోల్టన్ ఫ్రీ రైడ్ చేశాడు.
అర్బన్ ఎన్వైరాన్‌మెంట్‌లో భాగంగా ఈ రెడ్ బుల్ రోమానియాక్స్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కోల్ మైన్ కోర్సును బెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా పరిగణిస్తారు. ఈ కోర్సుకు సంబంధించిన విశిష్టమైన వ్యూని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/fexv_8UE0e0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








