AI కెమెరాల వల్ల తగ్గుతున్న ప్రమాదాలు.. 50 శాతానికి పైగా తగ్గిన మరణాలు.. ఎలా అంటే..!

దేశంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరగడం షరా మామూలే. ఈ క్రమంలో ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతారు కొందరు వాహనదారులు. ఎందుకంటే వారికి చిక్కితే జరిమానా తప్పదు. కానీ ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకున్నా AI కెమెరాలు మాత్రం వాహనదారులను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి.

దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మరియు ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించడానికి AI కెమెరాలను కీలకంగా పనిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణలో AI కెమెరాల ప్రాధాన్యత ఎంత ఉందో తాజాగా కేరళ మంత్రి స్పష్టం చేశారు.

Road-Accident-Deaths

కేరళ రాష్ట్రంలోని రోడ్లపై AI కెమెరాలను అమర్చినప్పటి నుంచి, అనేక సార్లు వివాదాల్లో నిలిచింది. AI కెమెరా పొరపాటున మరియు ఆధారాలు లేకుండా కొంతమంది వాహనదారులకు జరిమానాలు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం వైరల్ కావడంతో.. జరిమానా వసూలు కోసమే పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే కేరళ పోలీసులు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు.

అనేక సంఘటనలు AI కెమెరా వ్యవస్థలోని సమస్యలను సూచిస్తున్నప్పటికీ, మొత్తం మీద సానుకూల ప్రభావాన్ని చూపిందని తాజాగా ఓ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కేరళలో AI కెమెరాలను ఏర్పాటు చేసిన తర్వాత, రోడ్లపై ప్రమాదాల సంఖ్య తగ్గిందని ఆ రాష్ట్ర రవాణా మంత్రి ఆంటోని రాజు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 50 శాతానికి పైగా తగ్గిందని వెల్లడించారు. ఇది నిజంగా గొప్ప విజయమని అన్నారు.

Road-Accident-Deaths

గత ఏడాది జూన్‌లో కేరళలో రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య 344 గా మంత్రి తెలిపారు. ఈ ఏడాది AI కెమెరాలు అమర్చిన తర్వాత జూన్‌లో మృతుల సంఖ్య 140కి తగ్గిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రాఫిక్‌ ఉల్లంఘనల సంఖ్యను తగ్గించడంలో AI కెమెరాలు దోహదపడతాయని కూడా ఆయన పేర్కొన్నారు.

సేఫ్ కేరళ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాలు మరియు ఉల్లంఘనల సంఖ్యను తగ్గించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. కాగా కొన్ని నెలల క్రితమే కేరళలో AI కెమెరాలను అమర్చారు.

దీని ప్రకారం కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏఐ కెమెరాల వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే మొత్తం 726 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. హై క్వాలిటీ ఫుటేజీతో కూడిన ఈ ట్రాఫిక్ మానిటరింగ్ కెమెరాల కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 232 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. మరోవైపు, కేరళ ప్రభుత్వం కూడా AI కెమెరాల చుట్టూ ఉన్న వివాదాలను తొలగించడానికి ప్రయత్నిస్తోంది.

ఈ సమస్యలను పరిష్కరించడానికి, వాస్తవానికి చలాన్ జారీ చేసే ముందు చిత్రాలను మాన్యువల్‌గా తనిఖీ చేయడానికి కేరళ ప్రభుత్వం ఇప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌లలో AMVIలను పోస్ట్ చేసింది. కెమెరాల ద్వారా రికార్డ్ చేయబడిన ఫుటేజ్‌లు తిరువనంతపురంలో ఉన్న ప్రధాన డేటా సెంటర్‌కు పంపిస్తారు. దీనికోసం ప్రతి జిల్లాలో సబ్‌డేటా సెంటర్లు ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలోని డేటా సెంటర్ హబ్ అన్ని జిల్లాల నుంచి డేటాను అందుకుంటుంది.

డేటాను స్వీకరించిన తర్వాత, చిత్రాలను క్రమబద్ధీకరిస్తుంది. ఆ తర్వాత అవి సంబంధిత ప్రాంతాలకు ఫార్వార్డ్ అవుతాయి. నిర్దిష్ట సంఖ్యలో ఉల్లంఘనలను గుర్తించిన అనంతరం ఏఐ కెమెరా ఫొటోను క్యాప్చర్ చేస్తుంది. అనంతరం దీనిని ప్రధాన కార్యాలయానికి పంపుతుంది. ఆ తర్వాత అది చలాన్ జారీ చేయబడిన సబ్-డేటా సెంటర్‌కు ఫార్వార్డ్ చేస్తుంది. రోడ్డుపై అమర్చిన కెమెరాలు రాత్రిపూట కూడా హై క్వాలిటీ చిత్రాలను తీయగలవు.

చాలా మంది జరిమానాలకు భయపడి నిబంధనలు, వేగ పరిమితులు పాటిస్తున్నారు. భారతదేశంలో AI కెమెరాల వినియోగం ఇప్పుడు ఊపందుకుంది. అందువలన, AI కెమెరాల వల్ల ఏర్పడే లోపాలను త్వరగా పరిష్కరించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న రహదారులను AI కెమెరాల ద్వారా పర్యవేక్షించే సమయం త్వరలోనే రానుందని ఆశిద్దాం.

More from DriveSpark

Article Published On: Wednesday, July 26, 2023, 12:29 [IST]
English summary
Road accident deaths down by over 50 percent after ai cameras installed kerala minister says
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+