జెంషడ్‌పూర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన రోడ్డు

ప్లాస్టిక్ వలన పర్యావరణానిరి ఎలాంటి హాని కలగకుండా ఉండేలా, సాంప్రదాయ తారు రోడ్లతో పోల్చుకుంటే మరింత ధృడంగా ఎక్కువ కాలం మన్నికవచ్చేలా ఈ రోడ్లను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణంలో ప్లాస్టిక్‌తో పాటు తారును ఉపయోగించారు.
సాధారణ రోడ్లతో పోల్చుకుంటే ఇవి 25 శాతం మెరుగ్గా ఉండటమే కాకుండా నీటిని పీల్చుకునే విషయంలో 200 శాతం తట్టుకునేలా ఉంటాయి. ఈ రోడ్ల నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువ కాలం ధృఢంగా ఉంటాయి.
ఈ రోడ్లకు కనీసం ఐదేళ్ల పాటు ఎలాంటి రిపేర్లు అవసరం లేదు. గడచిన సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టాటా గ్రూప్ జెంషడ్‌పూర్‌లో పనికిరాని ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ రోడ్డును ప్రారంభించింది.
దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి అధునాత రోడ్లు వస్తే ఎంత బాగుంటుందో కదా..! ఈ రోడ్ల వలన పర్యావరణానికి మేలు జరగడటమే కాకుండా, ప్రమాదాలు కూడా తగ్గిన ప్రజలకు కూడా మేలు జరిగే ఆస్కారం ఉంది. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications








