రోడ్డుపై స్కూటర్‌ను ఈడ్చుకెళ్లిన కారు.. డ్యాష్‌క్యామ్‌లో విజువల్స్‌ రికార్డ్‌, వైరల్‌ వీడియో

భారత్‌లో రోడ్‌ రేజ్‌(Road Rage) ఘటనలు సర్వసాధారణమవుతున్నాయి. రోడ్‌ రేజ్‌ అంటే పబ్లిక్‌ రోడ్డుపై వెళ్తుండగా వాహనదారులు ఒకరితో ఒకరు గొడవపడటం. ఓవర్‌టేక్‌ చేయడం, రోడ్డుపై ఇతర వాహనదారులను రెచ్చగొట్టడం, వారిపై దాడి చేయడం తరచూ జరుగుతుంటాయి. ఇటీవల బెంగళూరులోనూ ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

నిత్యం ట్రాఫిక్‌ రద్దీతో బిజీగా ఉండే బెంగళూరు రోడ్లపై రోడ్‌ రేజ్‌ ఘటనలు తరచూ నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారులోని డ్యాష్‌బోర్డ్(Dashboard Camera) కెమెరాలో రికార్డయిన ఫుటేజీ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Road-Rage-Bengaluru

ఇటీవల కార్లలో ప్రవేశపెడుతున్న అధునాత టెక్నాలజీ ద్వారా సీసీ కెమెరాల పరిధిలో జరగని ఘటనలు సైతం మన దృష్టికి వస్తున్నాయి. కారు క్యాబిన్‌లో పొందుపరిచిన డ్యాష్‌క్యామ్‌ ద్వారా వాటిలో రికార్డయిన ప్రమాదాలు కానీ, గొడవలు కానీ తెలుసుకోగలుగుతున్నాం. తాజాగా డ్యాష్‌క్యామ్‌(Road Rage In Bengaluru) ద్వారా ఓ గొడవ వెలుగులోకి వచ్చింది.

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని షార్జాపూర్ రోడ్డులో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ వ్యక్తి తన సహోద్యోగులతో కలిసి కారులో వెళ్తుండగా మార్గమధ్యలో కొందరు దుండగులు స్కూటర్‌పై వచ్చి వారి కారును అడ్డుకున్నారు. కారును ఆపిన దుండగులు వారితో ఆవేశంగా మాట్లాడటాన్ని వీడియోలో చూడవచ్చు.

Road-Rage-Bengaluru

ఆ కాసేపటికి కారును ఆపిన గ్యాంగ్‌.. కారు అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో కంగారుకు గురైన కారు డ్రైవర్‌ వెంటనే యాక్సిలరేటర్‌పై కాలు పెట్టారు. దీంతో కారు రోడ్డుకు అడ్డంగా ఉన్న స్కూటర్‌ను కారు ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత కారు అంతటితో ఆగకుండా స్కూటర్‌ను కొద్ది దూరం ఈడ్చుకెళ్లిన దృశ్యాలు డ్యాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి.

స్కూటర్‌ను కారు ఈడ్చుకెళ్లినా.. కారు డ్రైవర్‌ ఆగకుండా నడుపుతూనే ఉన్నారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నిమిషాల్లోనే వైరల్‌ అయిపోయింది. ఈ ఘటనకు కారకులైన నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Road-Rage-Bengaluru

కాగా కారుపై దాడి చేసిన సమయంలో నిందితుల ముఠా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తమ బైక్‌ను ఢీకొట్టినందుకే కారుపై దాడి చేసినట్లు నిందితులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరలేదని తెలుస్తోంది. కాగా ఇటీవల రోడ్లపై వాహనదారుల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి.

రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మీ మానసిక పరిస్థితిని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మంచి మ్యూజిక్‌ వింటూ డ్రైవ్‌ చేస్తే చిరాకు, ఒత్తిడి నుంచి దూరంగా ఉండొచ్చు. పాజిటివ్‌ ఆలోచనలతో డ్రైవ్‌ చేస్తూ ట్రాఫిక్‌ రూల్స్‌ను కరెక్టుగా పాటించాలి. ఇతరుకు మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు యత్నించినా వారితో వాదనకు దిగకపోవడం ఉత్తమం.

Road-Rage-Bengaluru

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 10, 2024, 18:13 [IST]
English summary
Road rage between car driver and scooterists visuals recorded in dashcam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+