మీ కారుకు ఆ లైట్లు తప్పుగా వాడి ప్రమాదాలు తెచ్చుకోవద్దు.. వాటిని ఎప్పుడు వాడాలో తెలుసా ?

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం, తప్పుడు సిగ్నల్స్ వినియోగం ఒకటి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది డ్రైవర్లు హెజార్డ్ లైట్లను (Hazard Lights) అనవసరంగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల రోడ్డుపై గందరగోళం ఏర్పడటమే కాకుండా, ప్రమాదాల ప్రమాదం కూడా పెరుగుతుంది. సీటు బెల్టు ధరించడం లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించినంత ముఖ్యమైనది హెజార్డ్ లైట్ల సరైన ఉపయోగం కూడా. కాబట్టి వీటిని ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం.

హెజార్డ్ లైట్స్ అంటే ఏమిటి?
హెజార్డ్ లైట్లను సాధారణంగా ఎమర్జెన్సీ లైట్లు అని కూడా అంటారు. మీ డాష్‌బోర్డ్‌పై ఉండే ఎరుపు త్రిభుజాకార (Red Triangle) గుర్తు ఉన్న బటన్‌ను నొక్కినప్పుడు, ఈ లైట్లు కారు ముందు, వెనుక భాగంలో ఒకేసారి బ్లింక్ అవుతాయి.

Road Safety Misconceptions About Hazard Lights Use What is the Correct Way

ఈ లైట్లు మీ కారు ఏదైనా అత్యవసర పరిస్థితిలో (Emergency Condition) ఉందని, రోడ్డుపై ఆగిపోయిందని లేదా అసాధారణ పరిస్థితిలో ఉందని వెనుక వచ్చే డ్రైవర్లకు సంకేతం ఇస్తాయి. దీనివల్ల ఇతర డ్రైవర్లు ముందుగానే అప్రమత్తమై బ్రేక్ వేయడం లేదా దారి మార్చుకోవడం సులభం అవుతుంది. హెజార్డ్ లైట్లను ఉపయోగించడానికి చట్టపరంగా, భద్రతాపరంగా కొన్ని నిర్దిష్ట పరిస్థితులు మాత్రమే ఉన్నాయి.

హజార్డ్ లైట్స్ ఎప్పుడు ఆన్ చేయాలి ?
కారు రోడ్డుపై ఆగిపోయినప్పుడు : మీ కారు రోడ్డు మధ్యలో లేదా పక్కన అకస్మాత్తుగా ఆగిపోయినా లేదా టైర్ పంక్చర్ అయినా, వెంటనే ఈ లైట్లను ఆన్ చేయాలి. ఇది వెనుక వచ్చే డ్రైవర్లకు మీ వాహనం స్థిరంగా ఉందని హెచ్చరిస్తుంది.

Road Safety Misconceptions About Hazard Lights Use What is the Correct Way

ప్రమాదం జరిగినప్పుడు: ఒకవేళ మీ కారు ప్రమాదానికి గురై రోడ్డు మధ్యలో ఉండిపోయినట్లయితే, హెజార్డ్ లైట్లు వెలిగించడం వల్ల వెనుక వచ్చే వారికి ముందస్తు హెచ్చరిక (Pre-warning) లభిస్తుంది.

చాలా నెమ్మదిగా వెళ్లినప్పుడు (Heavy Traffic): అత్యంత నెమ్మదిగా లేదా వేగం పూర్తిగా తగ్గించి నడపాల్సిన అసాధారణ పరిస్థితుల్లో (ఉదాహరణకు, ప్రమాదం జరిగిన ప్రాంతం దాటుతున్నప్పుడు) మాత్రమే వీటిని వాడవచ్చు.

Road Safety Misconceptions About Hazard Lights Use What is the Correct Way

హెజార్డ్ లైట్స్ ఎప్పుడు ఆన్ చేయకూడదు ?
చాలా మంది డ్రైవర్లు చేసే పెద్ద తప్పు ఏమిటంటే, హెజార్డ్ లైట్లను అత్యవసర పరిస్థితి కాని వేళల్లో వాడుతుందటారు. ఇది రోడ్డు భద్రతకు అత్యంత ప్రమాదకరం.

వర్షం, పొగమంచు లేదా తక్కువ విజిబిలిటీలో: వర్షం, దట్టమైన పొగమంచు లేదా తక్కువ విజిబిలిటీ ఉన్న పరిస్థితుల్లో హెజార్డ్ లైట్లు వాడకూడదు. ఎందుకంటే, ఇలా చేయడం వల్ల మీ కారు నిలిచిపోయిందని వెనుక డ్రైవర్లు అనుకుంటారు. ఈ సమయంలో ఫాగ్ ల్యాంప్‌లు, లో-బీమ్ హెడ్‌లైట్‌లను మాత్రమే ఉపయోగించడం సరైన పద్ధతి.

టన్నెల్స్‎లో ప్రయాణించేటప్పుడు: సొరంగాల (టన్నెల్స్) గుండా ప్రయాణించేటప్పుడు హెజార్డ్ లైట్లు ఆన్ చేయకూడదు. ఇది అత్యవసర పరిస్థితి కాదు. కేవలం హెడ్‌లైట్‌లను ఆన్ చేసుకుంటే సరిపోతుంది.

టర్నింగ్ తీసుకునేటప్పుడు (Turning): యు-టర్న్ తీసుకునేటప్పుడు లేదా పార్కింగ్ చేస్తున్నప్పుడు టర్నింగ్ ఇండికేటర్లను మాత్రమే ఉపయోగించాలి తప్ప హెజార్డ్ లైట్లను వాడకూడదు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం:
హెజార్డ్ లైట్ల తప్పుడు ఉపయోగం ఇతరులను గందరగోళానికి గురిచేసి ప్రమాదాలను పెంచుతుంది. సరైన ఇండికేటర్లను వాడటం ద్వారా మాత్రమే మీ ఉద్దేశాన్ని వెనుక వచ్చే డ్రైవర్లకు స్పష్టంగా తెలియజేయగలం.

కొన్ని రాష్ట్రాల్లో మోటారు వాహన చట్టం (Motor Vehicles Act) కింద హెజార్డ్ లైట్లను తప్పుగా ఉపయోగించినందుకు జరిమానా (Fine) కూడా విధించే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటిని వాడాలని ఆర్టీఏ (RTA) అధికారులు తరచుగా హెచ్చరిస్తుంటారు.

More from DriveSpark

Article Published On: Monday, November 10, 2025, 12:45 [IST]
English summary
Road safety misconceptions about hazard lights use what is the correct way
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+