స్వయం ప్రకాశిత రహదారులకు శ్రీ కారం

Written By:

విద్యుత్ శక్తిని నిల్వ చేసుకుని అదే విద్యుత్ లేనప్పుడు వినియోగించుకోవడం మనకు ఈ మధ్య కాలంలో బాగా అలవాటైపోయింది. ఉన్న విత్యుఛ్చక్తిని అంతా ఆ చిన్న ఈ చిన్న అవసరాలకు వినియోగించేస్తే మన భవిష్యత్ తరాల వారికి ఏముంటుంది చెప్పండి. అందుకే అసలు కరెంటు లేకుండానే రోడ్లు వెలిగే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేశారు. అయితే ఈ ప్రయోగం విజయం కూడా అయ్యింది. మరి రోడ్లు కరెంటు లేకుండా ఎలా వెలుగుతాయో చూద్దామా ? అయితే క్రింది కథనాలను గమనించండి.

విద్యుత్ లేకుండా రోడ్ల మీద కాంతిని అందివ్వడానికి మెక్సికోలోని మికోకాన్స్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు అత్భుతమైన ఆవిష్కరణ చేశారు.

ఈ యూనివర్సీటీ శాస్త్రవేత్తలు ఒక కొత్త సిమెంట్‌ను తయారు చేశారు. ఈ సిమెంట్ ద్వారా రోడ్డు వేస్తే, ఇది పగటి పూట సూర్యరశ్మిని గ్రహించి రాత్రిపూట కాంతిని వెదజల్లుతుంది.

 

రెండు రోడ్లను విభజించడానికి, డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి రేడియం వంటి పదార్థాలు, లైట్లు కాకుండా ఈ ప్రత్యేక స్వయం ప్రకాశిత సిమెంట్‌ను వినియోగించవచ్చు.

ఈ సిమెంట్ ద్వారా రోడ్డు నిర్మిస్తే ఇందులో నీలం లేదా ఆకు పచ్చ రంగుల్లో కాంతి ఉద్గారం అవుతుంది. కాబట్టి బైకులు మరియు వాహనాలు లైట్లు లేకుండా ఈ రోడ్ల మీద ప్రయాణించవచ్చు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్వయం ప్రకాశిత పదార్థాలు కేవలం మూడు లేదా నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే కాంతిని వెదజల్లుతాయి. కాని ఈ స్వయెం ప్రకాశిత సిమెంట్ మాత్రం కొన్ని వందల ఏళ్లు కాంతిని ఉద్గారం చేస్తుంది.

ఈ ప్రయోగానికి సుమారుగా తొమ్మిదేళ్ల క్రింది జోస్ కార్లోస్ రుబియో అనే శాస్త్రవేత్త శ్రీ కారం చుట్టినపుడు. స్వయం ప్రకాశిత సిమెంట్‌ను తయారు చేస్తే, దీనిని వినియోగించి రోడ్డు వేస్తే కొద్ది రోజుల తరువాత దాని మీద దుమ్ము ధూళి చేరిపోయి అపారదర్శకంగా మారిపోతుంది అని చాలా వరకు సందేశాలు వచ్చాయన్నాడు.

దీనిని అదిగమించడానికి నూతవ పద్దతి ద్వారా కొన్ని క్రిస్టల్స్‌ని ఈ సిమెంట్‌లో వినియోగించాడు. తద్వారా రోడ్డు దుమ్ము ధూళితో నిండిపోయినపుడు రోడ్డు మీద నీటిని చల్లితే రోడ్డు పైభాగంలో ఉన్న లవణాలు
జల్‌గా మారి రోడ్డును మళ్లీ ప్రాకాశవంతంగా మారుస్తుందని తెలిపాడు.

ఒక రోజు పాటు సూర్యరశ్మిని గ్రహిస్తే దాదాపుగా 12 గంటల పాటు నిరంతరంగా ఈ రోడ్డు ప్రకాశిస్తుంది.

పర్యావరణ ప్రకారం చూస్తే ఈ రోడ్డు ఎకో ఫ్రెండ్లీ రోడ్డు. మట్టి మరియు ఇసుకలో కొద్ది కాలంపాటు ఉంచితే ఇది మట్టిలో కరిగిపోయి కలిసిపోతుంది. కాబట్టి దీని ద్వారా భూమికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ప్రస్తుతం ఈ రోడ్డును అభివృద్ది చేసిన మొత్తం బృందం అంతర్జాతీయ పేటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. పేటెంట్ పొందిన తరువాత వీరు దీనికి సంభందించిన ప్రాజెక్టులు చేపడతారు.

  

English summary
Turn Off The Street Lights; Solar Powered Cement To Light Up Your Roads
Story first published: Saturday, May 14, 2016, 18:44 [IST]
Please Wait while comments are loading...

Latest Photos