కార్ రివర్స్ ర్యాంప్ జంప్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్!
సాధారణంగా కారును రివర్స్ చేయడమంటేనే రిస్కుతో కూడుకున్న పని. అలాంటి కారును రివర్స్‌లో (వెనక్కి) నడుపుతూ ర్యాంప్ జంప్ చేయటమంటే, అదెంత కష్టమో ఊహించుకోండి. మామూలుగా.. కారును ముందుకు నడుపుతూ ర్యాంప్ జంప్ చేయటాన్ని మనం అనేక సంధర్బాల్లో చూసి ఉండే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం కారును రివర్స్‌లో ర్యాంప్ జంప్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు ఈ డేరింగ్ 'రాబ్ డైర్డెక్'.
అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ స్కేట్‌బోర్డర్ మరియు టివి పర్సనాలిటీ అయిన రాబ్ డైర్డెక్ 'లాంగెస్ట్ రివర్స్ కార్ జంప్' చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. వాస్తవానికి ఇతను ఓ ప్రొఫెషనల్ రేస్ కార్ డ్రైవర్ కాదు అలాగని ఓ ప్రొఫెషనల్ స్టంట్‌మెన్ కూడా కాదు. ఇతోనో స్కేట్‌బోర్డ్ ప్రొఫెషనల్. అంటే, స్కేటింగ్ బోర్డుపై విన్యాసాలు చేసే వ్యక్తి అన్నమాట.
మరి రాబ్ డైర్డెక్ చేసిన ఆ విన్యాసాన్ని మనం కూడా వీక్షిద్దామా..? (చివరి స్లైడ్‌లో వీడియోని వీక్షించడం మర్చిపోకండి.)

రాబ్ డైర్డెక్ ఈ తరహా కార్ స్టంట్ చేయటం ఇదే మొట్టమొదటిసారి. ఇతను కారును రివర్సులో నడుపుతూ ర్యాంప్ చేసిన దూరం 89 అడుగులు 3¼ ఇంచ్‌లు. ఇప్పుడు ఈ రికార్డ్ అధికారికంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది.

ఈ రికార్డ్ కోసం రాబ్ డైర్డెక్ ఉపయోగించిన కారు షెవర్లే సోనిక్ హ్యాచ్‌బ్యాక్. వాస్తవానికి ఇదొక నార్మల్ కారు, దీనిని రేస్ వెర్షన్‍గా మోడిఫై చేశారు. రోల్ కేజ్, సేఫ్టీ హార్నెస్, స్పోర్ట్స్ సీట్స్, వెయిట్ రిడక్షన్, బీఫియర్ సస్పెన్షన్ వంటి మార్పులను ఈ కారులో చేశారు.

రాబ్ డైర్డెక్‌కు ఇలాంటి అరుదైన కార్ ఫీట్లు చేయటమంటే మహా సరదా. గతంలో 2011లో కూడా ఇతను ర్యాంప్‌పై 360 డిగ్రీ కిక్ ఫ్లిప్ చేసి ఔరా అనిపించుకున్నాడు. ఈ స్టంట్ కోసం కూడా రాబ్ తన షెవర్లే సోనిక్ కారునే ఉపయోగించాడు.

తొలిసారిగా కారు కొనుగోలు చేసే వారికి షెవర్లే సోనిక్ గొప్పగా ఉంటుందని, తనకు షెవర్లే కార్లంటే ఇష్టమని, అందుకే తాను తన షెవర్లే సోనిక్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనుకున్నాని, ప్రస్తుతం ఆ కల నెరవేరిందని రాబ్ డైర్డెక్ చెప్పుకొచ్చాడు.
మరి రాబ్ డైర్డెక్ చేసిన ఆ కార్ రివర్స్ ర్యాంప్ జంప్‌ను మనం కూడా ఈ వీడియోలో వీక్షిద్దాం రండి.


Click it and Unblock the Notifications








