రోబో ట్యాక్సిలను ఉపయోగించనున్న జపాన్ !
ప్రపంచంలో మొట్టమొదటి సారిగా జపాన్ వారు రోబోలను ఉపయోగించి అద్దె కార్లను నడపాలని ప్రయోగాత్మకంగా ప్రయత్నించారు. అయితే త్వరలోనే జపాన్ రహదారుల్లో ఈ మానవ రహిత ట్యాక్సిలు తిరగనున్నాయి.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: అమ్మకాలకు సిద్దమైన రేంజ్ రోవర్ స్పోర్ట్ యస్.వి.ఆర్ : ధర, ఫీచర్స్..
మానవజాతి ఎన్నో విధాలుగా రోబోలను ఉపయోగించుకుంటూనే ఉంది. రోబో సినిమాలో ఉన్న రోబో ఎంత అడ్వాన్స్ గా ఉందో చూశారు కదా మరి అలాంటి నాటకీయ పరిణామాలకు జపాన్ దేశస్థులు ప్రాణం పోస్తున్నారని చెప్పవచ్చు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: పోలో లిమిటెడ్ ఎడిషన్ విడుదల: అక్టోబర్ 9 నుండి అందుబాటులోకి
ఈ ట్యాక్సిని నడిపిన రోబో గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.......

ఉమ్మడి భాగస్వామ్యంతో :
ఈ రోబో ట్యాక్సిని రెండు ఉమ్మడి సంస్థలు కలిసి రూపొందించారు, అవి జడ్.ఎమ్.పి అనే ఆటోమెటిక్ కార్లను అభివృద్ధి చేసే సంస్థ మరియు మొబైల్ ఇంటర్‌నెట్ సేవలకు చెంది దేనా సంస్థ. వీరి ఇద్దరి ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ రోబో ట్యాక్సి ప్రాణం పోసుకుంది.

ఎక్కడ ప్రవేశపెట్టారు :
జపాన్ రాజధాని నగరం అయిన టోక్యో సమీపంలోని బీచ్‌లో వీటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ రోబో ట్యాక్సిలు ఒక ప్రత్యేతమైన డాటా బేస్ అప్లికేషన్ ఆధారంతో సాధారణ రోడ్ల మీద పరుగులు పెట్టనున్నాయి.

నివాసితులకు ఉపయోగకరంగా :
జపాన్ లోని పియూజికావా నగరంలో వ్యాపార కేంద్రాలకు దగ్గరగా మరియు షాపింగ్ మాల్స్‌లో నివసిస్తున్న వారి సౌకర్యార్థం వీటిని అందుబాటులోకి తెచ్చారు. రోబో కేవలం మూడు కిలోమీటర్లు దూరం వరకు మాత్రమే నడుపుతుంది.

భధ్రత :
ఈ రోబో ట్యాక్సిలను పూర్తిగా భధ్రత లక్షణాలతో తయారు చేశారు. ఈ రోబో ట్యాక్సి డ్రైవర్ భద్రత పరంగా ఎప్పుడూ పర్యవేక్షిస్తు ఉంటుంది. ఒక వేళ ప్రమాదం ఉందని తలచిందంటే ముందుగానే హెచ్చరికలను జారి చేస్తుంది.

ప్రయోజనం :
2020 లో జపాన్‌లో జరగనున్న ఒలంపిక్స్ క్రీడల సంధర్భంగా ఈ రోబో ట్యాక్సిలను ఉపయోగించనున్నారు. క్రీడల సందర్భంగా వచ్చే ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని కలిగిచాలని భావిస్తున్నారు.

ప్రమాదాలు :
ప్రస్తుతం డ్రైవర్ల యొక్క చెత్త డ్రైవింగ్ వలన ప్రమాదాల చాలా ఎక్కువా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోబో ట్యాక్సలను ఉపయోగించడం వలన ప్రమాదాల సంఖ్యను బాగా తగ్గించవచ్చని రవాణా రంగం నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

గణనీయంగా :
2013 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 75 సంవత్సరాల వయస్సులోపు ఉన్న డ్రైవర్ల సంఖ్య దాదాపుగా 4.25 మిలియన్. ప్రస్తుతం ఈ సంఖ్య ఐదుకు చేరిఉంటుందని అంచనా. అయితే కొత్త నిభందనల ప్రకారం ఎవరయితే వేలిముద్రలను నమోదు చేసుకుని ఉంటారో వారు మాత్రమే డ్రైవింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

టెస్ట్ డ్రైవ్ :
రోబోల పని తీరు ప్రయోగాత్మంగా పరీక్షించిన తరువాత. దీనిని పియూజికా నగరంలో వచ్చే ఏడాది మార్చి నుండి వాడుకలోకి తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications








