రాక్ బౌన్సింగ్: లేటెస్ట్ ఆఫ్-రోడ్ మోటార్‌స్పోర్ట్
మోటార్‌స్పోర్ట్‌లలో ఆఫ్-రోడింగ్ సవారీ అత్యంత ప్రమాదకరమైనది మరియు అంతే ఉల్లాసభరితమైనది. అద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ ఆఫ్-రోడింగ్ అడ్వెంచరస్ జర్నీలను చేసే వాళ్లను, ఇలాంటి గేమ్స్‌ను నిర్వహించే మోటార్‌స్పోర్ట్ సంస్థలను మనం తరచు చూస్తునే ఉంటాం. మట్టి రోడ్లు, లోయలు వంటి ప్రాంతాల్లో ఆఫ్-రోడింగ్ ట్రిప్‌లను మనం ఇప్పటికే చూసేశాం. అయితే, ఈ మోటార్‌స్పోర్ట్‌లో తాజా ట్రెండ్ 'రాక్ బౌన్సింగ్'. ఇది పేరుకు తగినట్లుగానే, రాళ్లపై ఎగురుకుంటూ భారీ వాహనాలతో సవారీ చేయటం ఇందులోని విశిష్టత.
అస్సలు రోడ్లే లేని కొండలు, బండరాళ్లపై అసాధ్యమైన సవారీ చేయటం ఈ గేమ్‌లో ప్రధాన ఆకర్షణ. ఇది ఉత్కంఠతను కలిగించేదే కాకుండా ప్రమాదకరమైనది కూడాను. ర్యాలీయింగ్, రాక్ క్రాలింగ్, ఆల్ట్రా 4 రాక్ రేసింగ్, డెసెర్ట్ రేసింగ్ వంటి సాధారణ రేసింగ్‌ల కన్నా రాక్ బౌన్సింగ్ పెను సవాళ్లతో కూడినది. ఇటీవలి కాలంలో ఇది అత్యంత ప్రాచుర్యాన్ని సంపాధించుకుంది. ఈ రౌక్ బౌన్సింగ్ కోసం వాహనాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ ఫొటోలోను చూస్తే రాక్ బౌన్సింగ్ మోటార్‌స్పోర్ట్ ప్రత్యేకత ఏంటే, ఇందులో దాగి ఉన్న ప్రమాదం మరియు ఉత్కంఠత ఏంటో ఇట్టే అర్థమవుతుంది. మరి ఆలస్యమెందుకు ఓ లుక్కేద్దాం రండి..!

రాక్ బౌన్సింగ్

రాక్ బౌన్సింగ్

రాక్ బౌన్సింగ్

రాక్ బౌన్సింగ్

రాక్ బౌన్సింగ్

రాక్ బౌన్సింగ్

రాక్ బౌన్సింగ్

రాక్ బౌన్సింగ్

రాక్ బౌన్సింగ్

రాక్ బౌన్సింగ్



Click it and Unblock the Notifications








