రాకెట్ ఇంజన్‌తో నడిచే సైకిల్ స్పీడ్ రికార్డ్ 263 kmph
సైకిళ్లకు ఎలక్ట్రిక్ మోటార్లు బిగిస్తేనే రయ్యిమని పరుగులు పెడతాయి. అలాంటిది, సైకిళ్లకు రాకెట్ ఇంజన్లను అమర్చితే జయ్యిమని వాయువేగంతో దూసుకెళ్లిపోవు. అలాంటి ఓ ప్రయత్నమే ఈ కథనం. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రాంకోయిస్ గిస్సీ తన సైకిల్‌కు రాకెట్ ఇంజన్ టెక్నాలజీని ఉపయోగించి అత్యధిక వేగపు రికార్డును నమోదు చేశాడు.
గిస్సీ తన రాకెట్ పవర్డ్ సైకిల్‌ను ఉపయోగించి ఇదివరకటి ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టి ఓ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. గతంలో స్పీడ్ రికార్డు గంటకు గరిష్టంగా 242.6 కిలోమీటర్లు ఉండగా, గిస్సీ ఈ రికార్డును సునాయాసంగా అధిగమించి గంటకు గరిష్టంగా 263 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి కొత్త రికార్డును నెలకొల్పాడు.
ఈ సైకిల్‌లో ఉపయోగించిన రాకెట్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన ఎగ్జోటిక్ థెర్మో ఇంజనీరింగ్ సంస్థ రూపొందించింది. ఇది పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్స్, స్పోర్ట్స్ కార్ల కన్నా వేగంగా వెళ్లగలదు. మరి ఇంత వేగంతో కూడిన సైకిల్‌ను నడపాలన్నా కాస్తంత ఎక్కువ గుండె ధైర్యమే కావాలి. మరి ఈ రాకెట్ సైకిల్ స్పీడ్‌ను మనం కూడా క్రింది వీడియోల్లో చూద్దామా..?


Click it and Unblock the Notifications








