రాకెట్ స్కేట్స్.. కాళ్ల కింద చక్రాలు వస్తే..
కాళ్ల కింద చక్రాలతో పుట్టావా ఏంటి, ఓ పట్టాన నిలుచుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటావ్.. అని చాలా మంది తమ పిల్లలను అంటూ ఉంటారు. నిజంగా కాళ్లకు చక్రాలు ఉంటే ఎంత బాగుంటుందో కదా..! సాధారణ రోలర్ స్కేట్స్ ఉన్నప్పటికీ, వాటిని ఆపరేట్ చేయటానికి మన బలాన్నంతా ఉపయోగించాలి. కానీ ఎలాంటి బలం ఉపయోగించకుండా ఆటోమేటిక్ మనల్ని వేగంగా ముందుకు తీసుకువెళ్లే స్కేట్స్ ఉంటే ఎంత బాగుంటుందో కదా..!
ఆ సమయం ఎంతో దూరం లేదు. ఇదిగో ఈ ఫొటోలలో మీరు చూస్తున్నది రాకెట్ స్కేట్స్. పేరుకు తగినట్లుగా ఇవి రాకెట్ అంత వేగంతో వెళ్లకపోయినప్పటికీ, మనం ముందుకు నడపాల్సిన శ్రమ లేకుండా, ఒక్క బటన్ నొక్కనే మ్యాన్యువల్ స్కేట్స్ కాస్తా ఆటోమేటిక్ స్కేట్స్‌గా మారి మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి. కాలిఫోర్నియాకు చెందిన యాక్షన్ అనే కంపెనీ ఈ రాకెట్ స్కేట్స్‌ను తయారు చేస్తోంది.
రాకెట్ స్కేట్స్‌కు సంబంధించిన మరింత ఆసక్తికర సమాచారన్ని ఈ తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో రాకెట్ స్కేట్స్‌కు సంబంధించిన మరింత ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకోండి.

రాకెట్ స్కేట్స్‌లో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క మోటార్ చొప్పున మొత్తం నాలుగు బ్రష్‌లెస్ మోటార్లు ఉంటాయి. ఈ మోటార్లు లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి.

రెండు కాళ్లకు ఉండే స్కేట్స్ సమానవేగంతో వెళ్లేందుకు గాను ఇందులో ఓ మైక్రోప్రాసెసర్ ఉంటుంది. వీటిని ఎవ్వరైనా ధరించి సవారీ చేయవచ్చు. ఇవి మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తాయి.

ఆర్6
రాకెట్ స్కేట్స్‌లో మొదటి వేరియంట్ ఆర్6. దీనిని పూర్తిగా చార్జ్ చేస్తే 45 నిమిషాల పాటు లేదా 9.5 కి.మీ. దూరం వెళ్లవచ్చు. ఈ మోడల్ రాకెట్ రెడ్ కలర్‌లో లభిస్తుంది. దీని ధర 499 డాలర్లు. రబ్బరుతో తయారు చేయబడిన ఈ రాకెట్ స్కేట్స్ చక్రాలు గరిష్టంగా 124 కేజీల వరకు బరువును మోయగలవు.

ఆర్8
రాకెట్ స్కేట్స్‌లో రెండవ వేరియంట్ ఆర్8. దీనిని పూర్తిగా చార్జ్ చేస్తే 70 నిమిషాల పాటు లేదా 12.8 కి.మీ. దూరం వెళ్లవచ్చు. ఈ మోడల్ టైటానియం క్రోమ్ కలర్‌లో లభిస్తుంది. దీని ధర 599 డాలర్లు. ఇందులో బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ ఖాలీ అయిపోతే కేవలం గంటన్నర వ్యవధిలోనే తిరిగి పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.

ఆర్10
రాకెట్ స్కేట్స్‌లో మూడవ మరియు చివరి వేరియంట్ ఆర్10. దీనిని పూర్తిగా చార్జ్ చేస్తే 90 నిమిషాల పాటు లేదా 16 కి.మీ. దూరం వెళ్లవచ్చు. ఈ మోడల్ డీప్ స్పేస్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. దీని ధర 699 డాలర్లు. ఈ మోడల్ 3 కేజీల బరువును కలిగి ఉంటుంది, ఇది గరిష్టంగా గంటకు 12 మైళ్ల వేగంతో వెళ్తుంది.

ఎమ్ స్కూటర్
కాలిఫోర్నియాకు చెందిన ఈ కంపెనీ కేవలం ఆర్ స్కేట్స్‌ను మాత్రమే కాకుండా ఎమ్ స్కూటర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా తయారు చేస్తోంది. ఇదొక త్రీ-వీల్డ్ స్కూటర్. దీనిపై నిలుచుకొని సవారీ చేయాల్సి ఉంటుంది. ఇది బ్రష్ లెస్ మోటార్స్, బ్యాటరీల సాయంతో నడుస్తుంది.
వీడియో
ఎలక్ట్రిక్ స్కేట్స్ పనితీరును వివరించే వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.

బూస్టెడ్ బోర్డ్స్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్
ఇది కూడా చూడండి: బూస్టెడ్ బోర్డ్స్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

వన్ వీల్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్
ఇది కూడా చూడండి: వన్ వీల్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్


Click it and Unblock the Notifications








