Just In
Don't Miss
- Sports
సూపర్ సిరాజ్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు! ఆస్ట్రేలియా ఆధిక్యం 163!!
- Movies
Bigg Boss Tamil 4 Winner: తమిళ బిగ్ బాస్‌లో అనుకున్నదే జరిగింది.. విన్నర్‌గా టాలెంటెడ్ యాక్టర్
- News
బిడెన్ బాధ్యతల స్వీకరణ సజావుగా సాగేనా?: 9/11 నాటి పరిస్థితులు: అమెరికా గరంగరం: మిలటరీ జోన్
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కెజిఎఫ్ స్టార్ యష్ లగ్జరీ కార్లు, ఎలా ఉన్నాయో చూసారా ?
పాపులర్ కన్నడ సూపర్ స్టార్ యష్ ప్రస్తుతం తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం సన్నద్ధమవుతున్నాడు. 2008 లో మొగ్గినా మనసుతో అరంగేట్రం చేసిన యష్ ఇప్పుడు గొప్ప కన్నడ స్టార్ అయ్యాడు. 2018 లో విడుదలైన కెజిఎఫ్ చాప్టర్ 1 తో యష్ దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు మరియు ఖ్యాతిని పొందారు.

యష్ ప్రస్తుతం 2020 జూలైలో విడుదల కానున్న కెజిఎఫ్- 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రాజధాని మిస్టర్ అండ్ మిసెస్, రామచారి మరియు కెజిఎఫ్ చాప్టర్ 1 వంటి సినిమాలతో ఎక్కువమంది అభిమానవులను సంపాదించుకున్నాడు.

కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదలకు ముందు, కెజిఎఫ్ 2 స్టార్ యష్ యాజమాన్యంలోని కొన్ని ఖరీదైన కార్లను గురించి కొంత సమాచారం మీముందుకు తీసుకువచ్చాము. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీ కోసం..
MOST READ:బిఎస్-6 హోండా ఎక్స్-బ్లేడ్ 160 బైక్ : ధర & ఇతర వివరాలు

1. మెర్సిడెస్ బెంజ్ డిఎల్ఎస్ 350 డి :
యష్ దగ్గర ఉన్న అనేక లగ్జరీ కార్లలో మెర్సిడెస్ బెంజ్ ఒకటి. ఇతనికి ఇష్టమైన కార్లలో ఇది కూడా ఒకటి. అంతే కాకుండా అతని వద్ద మెర్సిడెస్ బెంజ్ డిఎల్ఎస్ 350 డితో సహా పలు మెర్సిడెస్ బెంజ్ కార్లు ఉన్నాయి. యష్ దగ్గర ఉన్న ఈ బెంజ్ కారు ధర రూ .85 లక్షలు.

2. మెర్సిడెస్ జిఎల్సి 250 డి కూపే :
యష్ మెర్సిడెస్ జిఎల్సి 250 డి కూపేను కూడా కలిగి ఉన్నాడు. దీని ప్రారంభ ధర భారతదేశంలో రూ. 78 లక్షలు. ఇది చూడతనైకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా వాహనదారుని మంచి డ్రైవింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఈ కారులో అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది.
MOST READ:ప్రయాణికులకు గుడ్ న్యూస్ : తత్కాల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ రైల్వే

3. ఆడి క్యూ 7 :
ఆష్ క్యూ 7 అనేది విలాసవంతమైన కార్లలో ఒకటి. ఈ లగ్జరీ కారుని కూడా యష్ కలిగి ఉన్నాడు. అంతే కాకుండా ఇతడు ఈ కారును నడపడానికి చాలా ఇష్టపడతాడు. ఈ కొత్త కార్ మంచి డిజైన్, నాణ్యమైన ఇంటీరియర్స్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది- 3.0-లీటర్ టిఎఫ్ఎస్ఐ క్వాట్రో పెట్రోల్, 3.0-లీటర్ టిడిఐ క్వాట్రో డీజిల్ మరియు 4.2-లీటర్ టిడిఐ క్వాట్రో.

4. బిఎమ్‌డబ్ల్యూ 520 డి :
యష్ కలిగి ఉన్న కార్లలో బిఎమ్‌డబ్ల్యూ 520 డి కూడా ఒకటి. బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఆధునిక కమర్షియల్ సెడాన్ యొక్క స్వరూపం. ఇది చాల స్టైలింగ్ ఫీచర్స్ కలిగి ఉంది చూడటానికి చాల ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన వేరియంట్లలో ఒకటి. ఇది మిడ్-సైజ్ బిఎమ్‌డబ్ల్యూ సెడాన్ మరియు ఇది వినియోగదారునికి చాలా నమ్మదగినది సెడాన్.
MOST READ:లగ్జరీ బైక్‌పై కనిపించిన భారత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

5. రేంజ్ రోవర్ ఎవోక్ :
యష్‌కు రేంజ్ రోవర్ ఎవోక్ కారుని కూడా కలిగి ఉన్నాడు. రేంజ్ రోవర్ ఎవోక్ ఐదు-డోర్ మరియు కన్వర్టిబుల్ బాడీ స్టైల్స్ కలిగి ఉంది. ఫైవ్-డోర్ ఐదు మోడల్ లైనప్‌ను కలిగి ఉంది.

అన్ని కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ లో టచ్ ప్రో డ్యూ సిస్టమ్, 12.3 అంగుళాల ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే అనుకూలత మరియు సెగ్మెంట్-ఫస్ట్ క్లియర్ సైట్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ వంటి వాటిని కలిగి ఉంది.
MOST READ:వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?

6. మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ :
కొన్నేళ్ల క్రితం ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలలో ఎక్కువగా డిమాండ్ ఉన్న కారు మోడల్ మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్. దీనికి ఇటీవల డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇది మార్కెట్లో కొన్ని కొత్త మార్పులతో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఆల్-వీల్ డ్రైవ్ ఫీచర్లతో 176-బిహెచ్‌పిని ఉత్పత్తి చేసే 2.5-లీటర్ ఇంటర్‌కూలర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ కలిగిన పజెరో స్పోర్ట్స్ కారు ధర రూ. 37.75 లక్షలు.