ఇంటి ఆమెతో కలిసి ఖరీదైన కారులో షాపింగ్‌మాల్‌కి రోహిత్ శర్మ.. కార్ డ్రైవ్ చేసిన రితికా.. వీడియో వైరల్!!
పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖులు, అత్యధిక పారితోషికం పొందే సినిమా యాక్టర్లు, క్రీడాకారులకు ఇంపోర్టెడ్ కార్లపై మక్కువ చూపిస్తారు. దేశంలోని రోడ్లపై కొన్ని ఖరీదైన విదేశీ కార్లు సందడి చేస్తూనే ఉంటాయి. తాజాగా భారత క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ తన గ్యారేజీలోని ఖరీదైన కారుతో రోడ్డుపై కనిపించారు.
రోహిత్ శర్మ గ్యారేజీలో ఆకట్టుకునే కాస్ట్లీ కార్లు చాలా ఉన్నాయి. అందులో లంబోర్ఘిని ఉరుస్ ప్రత్యక ఆకర్షణ అనే చెప్పాలి. ఈ విలువైన కారులో రోహిత్, తన భార్య రితికా ప్రయాణించిన వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. రోహిత్ డ్రైవర్ పక్క సీట్‌లో కూర్చోగా.. తన భార్య రితికా కారును నడుపుతూ షాపింగ్‌కి వచ్చారు.

సాధారణంగా ఖరీదైన కారు కనిపిస్తే అందరి చూపులు దాని మీదే ఉంటాయి. అందులోనూ టీం ఇండియా కెప్టెన్ ఆ కారులో కనిపించేసరికి జనాలు ఏ రేంజ్‌లో స్పందించి ఉంటారో ఇట్టే ఊహించవచ్చు. షాపింగ్ పూర్తి చేసుకుని వస్తున్న జంటను చూసి ఫ్యాన్స్ కాసేపు ఉబ్బితబ్బిబ్బయ్యారు. కొందరు సాహహం చేసి సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం అభివాదం చేస్తూ రోహిత్ జంట వెళ్లిపోయారు.
అయితే షాపింగ్ మాల్ కి వచ్చేటప్పుడు ఈ సూపర్ కారును డ్రైవ్ చేసిన రితిక, షాపింగ్ నుంచి బయటకు వచ్చాక వెనుక సీటులో కూర్చోగా, రోహిత్ తన పక్కనే కూర్చున్నాడు. కారును వేరే వ్యక్తి డ్రైవ్ చేసినట్టుగా మనం వీడియోలో చూడొచ్చు. అభిమానుల కోలాహలంతో కొద్దిసేపు వారు అసౌకర్యానికి గురయ్యారు.
ఇక కారు విషయానికి వస్తే, ఇటాలియన్ కంపెనీకి చెందిన బ్లూ-కలర్ లంబోర్ఘిని ఉరుస్ ను రోహిత్ శర్మ 2022లో కొనుగోలు చేశాడు. ఈ కారు ప్రపంచవ్యాప్తంగా ఎందరో సెలబ్రిటీల గ్యారేజ్ లో చోటు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఈ కారులు భారత దేశంలో తక్కువ మొత్తంలో ఉన్నాయి.
"బ్లూ ఎలియోస్" రంగుతో పెయింట్ చేయబడిన రోహిత్ కారు ముందు, వెనుక బంపర్‌లను కలిగి ఉంది. ఉరుస్ ఇంటీరియర్ విషయానికి వస్తే చెర్రీ ఎరుపు, నీరో నలుపు డ్యూయల్-టోన్‌తో ఉంటుంది. ఈ కారు కలర్ భారత క్రికెట్ జట్టు జెర్సీ రంగుతో పోలినట్లు ఉంటుంది. బేసిక్‌గా రోహిత్‌కి ఈ కలర్ అంటే ఇష్టమని చాలా సందర్భాల్లో వెల్లడించాడు.
రోహిత్ శర్మ గ్యారేజీలో లంబోర్ఘిని ఉరుస్‌తో పాటు ఇంకో ఆకర్షణీయమైన నీలిరంగు కారు కూడా ఉంది. అదే BMW కంపెనీకి చెందిన M5 మోడల్. ఇంకా తన గ్యారేజీలో ఆడి RSQ8, బెంట్లీ బెంటేగా, పోర్స్శే కయెన్‌లలో ఇటు వంటి ఇంటీరియర్‌ని మనం గమనించవచ్చు. రోహిత్ గ్యారేజీలో చాలా వరకు కస్టమైజ్డ్ లగ్జరీ కార్లు ఉన్నాయి.
ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 650 PS వద్ద 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. లంబోర్ఘిని ఉరస్ ధరలు భారతదేశంలో రూ. 4.2 కోట్లతో ప్రారంభమవుతాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








