హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కొత్త క్రేజ్..హై స్పీడ్ వదిలి ఎలక్ట్రిక్ కారు..దాని నం.3015 వెనుక అంత కథ ఉందా?
క్రికెట్ ప్రపంచంలో దేశానికి పేరు తెచ్చిన స్టార్ ప్లేయర్, టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ కొత్త కారు కొన్నారు. హై స్పీడ్ లగ్జరీ కార్లంటే ఇష్టపడే రోహిత్ ప్రస్తుతం ఓ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రోహిత్ కొనుగోలు చేసినా కారు టెస్లా మోడల్ Y.
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లపై పెరుగుతున్న ఆసక్తి ఇప్పుడు రోహిత్ శర్మను కూడా ఆకర్షించింది. టెస్లా కార్ల అమ్మకాలు భారతదేశంలో ప్రారంభం కాగానే, ఆయన ఈ మోడల్‌ను కొనుగోలు చేశారు. ఈ కారు నంబర్ ప్లేట్‌పై ఉన్న 3015 అనే నంబర్ ఈ భారత క్రికెట్ స్టార్‌కు చాలా స్పెషల్.

టెస్లా మోడల్ Y వివరాలు
రోహిత్ శర్మ కొనుగోలు చేసిన టెస్లా మోడల్ వై RWD స్టాండర్డ్ రేంజ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.67.89 లక్షలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 75 kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 622 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ కారు చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, దాని ఫీచర్లు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి.
ఫీచర్లు, ఇంజిన్ కెపాసిటీ
టెస్లా మోడల్ వైలో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఆల్ ఎల్‌ఈడీ లైట్లు, ప్రీమియం ఇంటీరియర్, 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, అద్భుతమైన లైటింగ్, 9 స్పీకర్ల ప్రీమియం స్టీరియో సిస్టమ్, గ్లాస్ రూఫ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

సేఫ్టీ పరంగా ఆటోమేటిక్ ఎమర్జింగ్ బ్రేకింగ్, బ్లైండ్ కొలిజన్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఉన్న 220 కేడబ్ల్యూ (kW) మోటార్ గరిష్టంగా 295 బీహెచ్‌పీ పవర్, 420 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
భారతదేశంలో టెస్లా స్థానం
టెస్లా కంపెనీ భారత మార్కెట్‌లోకి రావడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం ఇస్తున్న నేపథ్యంలో ఈ దిగ్గజ సంస్థ తాజాగా భారతదేశంలో తమ కార్ల అమ్మకాలను మొదలుపెట్టింది. టెస్లా మోడల్ Y అనేది అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి.

రోహిత్ శర్మ లాంటి ప్రముఖులు ఈ కారును కొనడం వల్ల దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వాడకంపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వైపు వేగంగా అడుగులు వేస్తున్న ప్రస్తుత తరుణంలో, టెస్లా రాక చాలా కీలకం.
నంబర్ ప్లేట్ వెనుక ఉన్న కథ
రోహిత్ శర్మకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అయితే, ఆయన కొత్తగా కొన్న టెస్లా మోడల్ వై కారు నంబర్ ప్లేట్‌పై ఉన్న 3015 సంఖ్య చాలా ప్రత్యేకమైనది. ఇందులో 30 అనేది డిసెంబర్ 30, రోహిత్ కుమార్తె పుట్టిన తేదీని సూచిస్తుంది. అలాగే, 15 అనేది నవంబర్ 15, కుమారుడి పుట్టిన తేదీని సూచిస్తుంది.
తన పిల్లల పుట్టిన తేదీలను గుర్తుండేలా నంబర్ ప్లేట్‌పై పెట్టడం ద్వారా రోహిత్ వారిపై తన ప్రేమను చాటుకున్నారు. రోహిత్ వద్ద ఇప్పటికే లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌ఈ, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బీఎమ్‌డబ్ల్యూ ఎం5 వంటి ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ కలెక్షన్‌లో తాజాగా టెస్లా మోడల్ Y చేరడం, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆయన ఆసక్తిని తెలుపుతుంది.


Click it and Unblock the Notifications








