లగ్జరీ కార్లను పక్కన పెట్టి సాధారణ కారులో రోహిత్‌ శర్మ.. హిట్‌ మ్యాన్‌ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma).. సింపుల్‌ కారులో కనిపించారు. తనకున్న లగ్జరీ కార్లను పక్కన పెట్టి మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీలో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ రోహిత్‌ కనిపించిన కారు ఏది.. ఆ కారు వివరాలేంటి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఇప్పుడు ఐపీఎల్‌ 2024 లో ముంబయి ఇండియన్స్‌(Rohit Sharma Luxury Cars) తరఫున ఆడుతున్నాడు. రో'హిట్‌' ఇప్పటికే ఐదుసార్లు ముంబయి జట్టుకు ట్రోఫీని అందించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సారి రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి హార్దిక్‌ పాండ్యాకు ముంబయి ఇండియన్స్‌ బాధ్యతలు అప్పగించడం.. చర్చనీయాంశంగా మారింది.

Rohit-Sharma-Mid-Size-Grand-Vitara

కాగా ఈ ఏడాది జరిగే T20 ప్రపంచకప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తుండగా.. ఐపీఎల్‌లో క్రికెట్‌ స్టార్లు ఉపయోగించే వాహనాలు కూడా చాలా రిచ్‌, లగ్జరీగా ఉంటాయి. టీమిండియా జట్టులోని అత్యంత సంపన్న ఆటగాళ్ల లిస్ట్‌లో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. కాగా రోహిత్‌కు కార్లంటే చాలా ఇష్టం.

రోహిత్ నివాసంలోని(Rohit Sharma Maruti Grand Vitara) గ్యారేజీలో రూ. కోట్ల విలువైన కార్లను కలిగి ఉన్నాడు. అయితే ఎన్ని లగ్జరీ కార్ల సేకరణను కలిగి ఉన్నప్పటికీ.. రోహిత్ ఇటీవల మిడ్-సైజ్ SUV లో కనిపించారు. అదే మారుతి గ్రాండ్ విటారా. రోహిత్‌ ఈ కారును నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కోట్లు సంపాదిస్తున్న స్టార్ ఇంత సింపుల్‌గా ఉంటాడా అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Rohit-Sharma-Mid-Size-Grand-Vitara

రోహిత్‌ శర్మ మారుతి గ్రాండ్‌ విటారా మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీని నడుపుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో షేర్‌ చేశారు. వీడియోను పరిశీలించినట్లయితే రోహిత్ ముంబై ఇండియన్స్ టీ-షర్ట్ ధరించాడు. మారుతీ గ్రాండ్ విటారా కారులో ఫ్రంట్‌ ప్యాసింజర్ సీటులో ఎక్కి వెళ్లిపోయాడు. కారు డ్రైవర్‌తో మాట్లాడుతూ రోహిత్‌ కెమెరాలకు పోజిచ్చాడు.

దీన్ని బట్టి ఈ వాహనం రోహిత్‌కు తెలిసిన వ్యక్తికి చెందినదని అర్థమవుతోంది. రోహిత్‌ని తీసుకెళ్లేందుకు కారు యజమాని వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా ఈ కారు రోహిత్‌కు చెందినది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా రోహిత్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) యొక్క A ప్లస్ గ్రేడ్ కాంట్రాక్ట్ ప్లేయర్‌గా ఉన్నారు.

అంటే బీసీసీఐ ఒక్కో ఆటగాడికి ఏటా రూ. 7 కోట్లకు పైగా చెల్లిస్తోందని అంచనా. వార్షిక వేతనంతో పాటు వన్డే మ్యాచ్‌లకు రూ.6 లక్షలు, అంతర్జాతీయ T20 మ్యాచ్‌లకు రూ.3 లక్షలు బీసీసీఐ చెల్లిస్తుంది. కాగా ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు పొందుతారు. కాగా ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకరైన రోహిత్‌కు ముంబై ఇండియన్స్ ఏడాదికి రూ.16 కోట్లు చెల్లిస్తుందని సమాచారం.

ఈ నేపథ్యంలో రోహిత్ సంపాదన ప్రకారం అతని గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. హిట్‌ మ్యాన్‌కు లంబోర్ఘిని ఉరుస్, BMW 7 సిరీస్, BMW X5, రేంజ్ రోవర్ బయోగ్రఫీ, Mercedes GL350 CDI మరియు Mercedes GLS 400d వంటి లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

కాగా హిట్‌ మ్యాన్‌ గతంలో పరిమితికి మించిన వేగంతో నడపడం వల్ల ఒకటి కంటే ఎక్కువ సార్లు చలాన్లకు గురయ్యాడు. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ముందు రోహిత్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ముంబై నుంచి పూణెకు ఫ్లై ఓవర్‌పై వెళ్తున్నాడు. రోహిత్ తన లంబోర్ఘినీ ఉరుస్‌లో ఎక్స్‌ప్రెస్‌వేపై గంటకు 200 కి.మీ వేగంతో వెళ్తుండగా గుర్తించిన పోలీసులు జరిమానా విధించారు.

More from DriveSpark

Article Published On: Friday, April 26, 2024, 14:10 [IST]
English summary
Rohit sharma spotted in mid size maruti grand vitara suv video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+