మొబైల్ స్టోర్‌గా మారిపోయిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు

దశాబ్దాల కాలం నుండి రోల్స్ రాయిస్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ అంతా కాదు. రాజుల కాలంలో రోల్స్ రాయిస్ కార్లకే పెద్దపీట, మన నైజాం నవాబులు కూడా రోల్స్ రాయిస్ కార్‌ను ఉపయోగించారు. మరి అంతటి చరిత్ర కలిగిన కారు నేటీ పోటీ ప్రపంచంలో ఇలా మొబైల్ ఫోన్లు అమ్మే కారుగా మారిపోవడం గమనార్హం. నగర రోడ్లపై హల్‌చల్ చేస్తున్న ఈ మొబైల్ స్టోర్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు మా రిపోర్ట్ కెమరా కంటికి చిక్కింది.
ఈ కారు ఎంత పెద్దదంటే.. రెండు చక్రాల మధ్య ఉన్న దూరంలో ఓ నానో కారు ఇమిడిపోయేంత పెద్దది. అతిపొడవైన బానెట్‌ను కలిగి ఉండే ఈ కారు ఒక్కో చక్రం సగటున ఓ మనిషి మోకాళ్ల ఎత్తంత ఉంటుంది. ఇలా ఓ అత్యంత ఖరీదైన కారును ప్రచారానికి వాడుకోవచ్చనే ఐడియా రావడం నిజంగా విశిష్టమే. అయితే ఇలాంటివన్నీ భారతదేశంలోనే జరుగుతాయి. మొబైల్ స్టోర్ కంపెనీ రోల్స్ రాయిస్ కారును ఇలా ప్రచార వాహనంగా వాడుకోవడంపై రోల్స్ రాయిస్ కంపెనీ గుర్రుగా ఉన్నట్లు కూడా సమాచారం.
అయితే మన దేశంలో కారును అమ్మడం వరకే కంపెనీల బాధ్యత, తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవడం అనేది మాత్రం వినియోగదారుల చేతుల్లోనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మొబైల్ స్టోర్ కంపెనీయే రోల్స్ రాయిస్ బ్రాండ్‌కు ఉచిత ప్రచారాన్ని కల్పిస్తుంది. కాకపోతే రోల్స్ రాయిస్‌ను బాధిస్తున్న విషయం ఒక్కటే కాబోలు, అదే కారు పెయంటింగ్. రెడ్-వైట్ కాంబినేషన్‌లో పెయింట్ చేయబడిన ఈ కారును చూసే లగ్జరీ ప్రియులకు ఇది కాస్తం ఇబ్బందిగానే ఉంటుంది మరి..!


Click it and Unblock the Notifications








