బ్లడ్‌హౌండ్ ల్యాండ్ స్పీడ్ రికార్డుకు రోల్స్ రాయిస్ మద్దతు
గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారు గురించి మీరు ఇదివరకే విని ఉంటారు. బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు జెట్ ఇంజన్‌తో నడిచే ఓ సూపర్ కారును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఈ కారు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. బుల్లెట్ కంటే వేగంగా ప్రయాణించే ఈ సూపర్ కారు పేరు 'బ్లడ్‌హౌండ్' (Bloodhound). ఈ ప్రాజెక్టుకు రిచర్డ్ నోబెల్ సారధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ కారు 2012లో నిజం రూపం దాల్చాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నెమ్మదిగా సాగుతోంది.
ప్రస్తుతం ఈ బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టుకు బ్రిటీష్ ఆటో దిగ్గజం రోల్స్ రాయిస్ తమ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా రోల్స్ రాయిస్ ఈ ప్రాజెక్టుకు కావల్సిన ఇంజన్, ఆర్థిక మరియు సాంకేతిక మద్ధతులను ఈ ప్రాజెక్టుకు అందించనుంది. బ్లడ్‌హౌండ్ వెహికల్‌లో రోల్స్ రాయిస్ ఈజె200 జెట్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇదే ఇంజన్‌ను యూరోఫైటర్ టైఫూన్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉపయోగించారు.
మరి గంటకు గరిష్టంగా 1600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ కారును నడపాలంటే సాధారణ రోడ్లు పనికిరావు. అందుకే ఈ బ్లడ్‌హౌండ్ కారును దక్షిణాఫ్రికాలోని నార్తర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఉన్న హాక్‌స్కీన్ పాన్ అనే ఎండిపోయిన సరస్సు లోపల మాత్రమే దీనిని నడుపుతారు. ఎండిపోయిన ఈ సరస్సు గర్భాన్ని రేస్ ట్రాక్‌గా మారుస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బ్లడ్‌హౌండ్ సూపర్‌కారు అంత గరిష్ట వేగంతో వెళ్తుంది కాబట్టి, కారుకు ఏ చిన్న రాయి తగిలినా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
అందుకే సుమారు 20 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పు ఉండేలా ఈ సరస్సు గర్భాన్ని దాదాపు 300 మంది కార్యకర్తలు శుభ్రం చేస్తున్నారు. చిన్నచిన్న రాళ్లను ఏరిపారేస్తున్నారు. బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టుకు సారథ్యం వహిస్తున్న రిచర్డ్ నోబెల్ ఈ తరహా కారు నిర్మించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన గరిష్టంగా గంటకు 1019 కిలోమీటర్ల వేగంతో నడిచే ‘థ్రస్ట్-2'ను విజయవంతంగా నడిపి చూపించారు. ఆ తరువాత ఈయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న థ్రస్ట్ సూపర్‌సోనిక్ కార్ 1997లోనే గంటకు 1228 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి సరికొత్త రికార్డులు సృష్టించింది. మరి ఈ బ్లడ్‌హౌండ్ సూపర్ కారుపై ఓ కన్నేద్దామా..?

బ్లడ్‌హౌండ్ ల్యాండ్ స్పీడ్ రికార్డుకు రోల్స్ రాయిస్ మద్దతు

బ్లడ్‌హౌండ్ ల్యాండ్ స్పీడ్ రికార్డుకు రోల్స్ రాయిస్ మద్దతు

బ్లడ్‌హౌండ్ ల్యాండ్ స్పీడ్ రికార్డుకు రోల్స్ రాయిస్ మద్దతు

బ్లడ్‌హౌండ్ ల్యాండ్ స్పీడ్ రికార్డుకు రోల్స్ రాయిస్ మద్దతు

బ్లడ్‌హౌండ్ ల్యాండ్ స్పీడ్ రికార్డుకు రోల్స్ రాయిస్ మద్దతు

బ్లడ్‌హౌండ్ ల్యాండ్ స్పీడ్ రికార్డుకు రోల్స్ రాయిస్ మద్దతు

బ్లడ్‌హౌండ్ ల్యాండ్ స్పీడ్ రికార్డుకు రోల్స్ రాయిస్ మద్దతు

బ్లడ్‌హౌండ్ ల్యాండ్ స్పీడ్ రికార్డుకు రోల్స్ రాయిస్ మద్దతు

Click it and Unblock the Notifications