రూ. 15 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కేవలం 30 సెకన్లలో చోరీ.. ఈ హైటెక్ దొంగల తెలివికి నెటిజన్లు షాక్.!!
దేశంలో తరచూ కార్ల దొంగతనాల సంఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా లక్ష కంటే ఎక్కువ కార్లు, బైక్‌లు చోరీకి గురవతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఖరీదైన రోల్స్ రాయిస్ లగ్జరీ కారును కేవలం 30 సెకన్లలో దొంగిలించారు దుండగులు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లలో రోల్స్ రాయిస్(Rolls Royce Cullinan) కల్లినన్ ఒకటి. ఈ కారును సొంతం చేసుకోవాలనుకుంటే రూ. కోట్లు చెల్లించాల్సిందే.. ధరకు తగినట్లుగా ఈ కారును విలాసవంతంగా, లగ్జరీ ఫీచర్లతో రూపొందించారు. ఇక సేఫ్టీ ఫీచర్లు కూడా అందుకనుగుణంగా ఉంటాయి. అలాంటి ఖరీదైన కారును అతి సునాయాసంగా చోరీ చేశారు హైటెక్ దొంగలు.

ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కేవలం 30 సెకన్ల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు చాకచక్యంగా దొంగిలించిన వీడియో(Rolls Royce Car Theft) ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దొంగతనాల విషయంలో టెక్నాలజీ ఏ రేంజ్‌లో అభివృద్ధి చెందిందో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. టెక్నాలజీని సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించకుండా.. ఇలా చట్ట వ్యతిరేక పనులకు ఉపయోగించుకోవడం దురదృష్టకరం.
అది కూడా వారు వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికతలు షాక్‌కు గురి చేసేలా ఉన్నాయి. ప్రస్తుత రోల్స్ రాయిస్ కల్లినన్ కారు చోరీ ఘటనే ఇందుకు నిదర్శనం. వాహన దొంగతనాలను నివారించడానికి వాహన తయారీదారులు సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా టెక్నాలజీ సాయంతో కారు దొంగతనానికి పాల్పడటం ద్వారా యజమానులకే కాకుండా కార్ల తయారీదారులకు కూడా నష్టం కలిగిస్తున్నాయి.

కొత్త కార్లలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ప్రవేశపెడుతున్నా.. ఇలా దొంగతనాలు జరగడం ద్వారా కార్ల తయారీదారులు ఇంకా సాంకేతికతను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఇలా ఈ తరహాలో కార్లు చోరీ కావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా BW6 వంటి సూపర్ కార్లు కూడా నిమిషం కంటే తక్కువ వ్యవధిలోనే సునాయాసంగా నడుపుతూ తీసుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలో అనేక ఆధునిక కార్లను కీ ఫోబ్‌తో విక్రయిస్తున్నారు. కీ ఫోబ్ నుంచి వచ్చే సిగ్నల్.. యజమాని కీ లేకుండా కారులోకి ప్రవేశించి వాహనాన్ని స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈజీ ఫీల్డ్‌కి కారణం ఇదే. కాగా కీఫోబ్ నుంచి సిగ్నల్‌ను దొంగిలించడం ద్వారా దొంగలకు కారు దొంగతనం ఈజీ అవుతోంది.

కాగా ఇలాంటి దొంగతనాల సంఘటనల నుంచి కస్టమర్లను రక్షించుకోవడానికి, టెస్లా వారి కార్లలో OTP టైప్ పిన్‌ను నమోదు చేసి, ఆపై కారును నడిపే సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా కొన్ని టెస్లా కార్లు దొంగతనానికి గురి కాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా టెస్లా వేలిముద్రలను ఉపయోగించే సిస్టమ్‌ను కూడా అమలు చేస్తోంది.
అదే సమయంలో, మీ కారు దొంగిలించబడే అవకాశం ఉందని మీకు అనిపిస్తే.. మీరు మీ కారు కీ ఫోబ్‌ను మెటల్ బాక్స్‌లో లేదా సిగ్నల్‌ను నిరోధించే ప్రత్యేక కేస్‌లో భద్రపరుచుకోవచ్చు. తద్వారా మీ కీ ఫోబ్ నుంచి సిగ్నల్ దొంగిలించబడకుండా చూసుకోవచ్చు. లేదంటే ఈ సమస్య రాకుండా మీరు కీతో ఉన్న కారును అయినా కొనుగోలు చేయడం బెటర్.

ఈ నేపథ్యంలో టెక్నాలజీ సాయంతో యజమాని కారును 30 సెకన్లలోపు నడపడం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 70 వేలకు పైగా వీక్షించారు. కాగా చోరీకి గురైన రోల్స్ రాయిస్ కారు విలువ దాదాపు రూ. 15 కోట్లకు పై మాటే. కాగా అదే సమయంలో, ఈ కారు చోరీ సంఘటన ఫేక్ అని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








