ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనం.. మూడు ప్రపంచ స్పీడ్ రికార్డ్స్..

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్ (Rolls Royce) ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను తయారు చేయడమే కాకుండా, విమానాలలో ఉపయోగించే ఇంజన్లను మరియు తేలికపాటి విమానాలను కూడా తయారు చేస్తుందని మీకు తెలుసా? ఇప్పుడు ఈ బ్రిటీష్ బ్రాండ్ తాజాగా ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించింది. రోల్స్ రాయిస్ తయారు చేసిన 'స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్' (Spirit Of Innovation) ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ మూడు కొత్త ప్రపంచ స్పీడ్ రికార్డులను సృష్టించింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనం.. మూడు ప్రపంచ స్పీడ్ రికార్డ్స్..

రోల్స్ రాయిస్ ఆల్-ఎలక్ట్రిక్ స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క డేటాను ఈ కంపెనీ నవంబర్ 16, 2021వ తేదీన ప్రపంచ వైమానిక మరియు వ్యోమగామి రికార్డులను నియంత్రించే మరియు ధృవీకరించే వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ సంస్థ అయిన ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషల్ (FAI) కి సమర్పించింది. ఈ డేటా ప్రకారం, స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎలక్ట్రిక్ విమానం, భూమిపై నుండి 3 కిలోమీటర్ల కంటే ఎత్తులో గరిష్టంగా గంటకు 555.9 కిలోమీటర్ల (గంటకు 345.4 మైళ్ల) వేగంతో ప్రయాణించినట్లు కంపెనీ పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనం.. మూడు ప్రపంచ స్పీడ్ రికార్డ్స్..

గతంలో, ఈ విషయంలో ఉన్న టాప్ స్పీడ్ గంటకు 213.04 కిలోమీటర్లు (గంటకు 132 మైళ్ల) రికార్డును రోల్స్ రాయిస్ స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ బద్దలు చేసింది. ఆ తర్వాత, యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క బోస్కోంబ్ డౌన్ (Boscombe Down) ప్రయోగాత్మక ఎయిర్‌క్రాఫ్ట్ టెస్టింగ్ సైట్‌లో ఈ విమానం గంటకు 532.1 కిలోమీటర్ల (గంటకు 330 మైళ్ల) వేగంతో 15 కిలోమీటర్లకు పైగా పరులుగు తీసి రెండవ ప్రపంచ రికార్డును సాధించింది. ఈ విషయంలో గతంలో ఉన్న రికార్డు గంటకు 292.8 కిలోమీటర్లు (గంటకు 182 మైళ్లు) గా ఉంది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనం.. మూడు ప్రపంచ స్పీడ్ రికార్డ్స్..

అంతేకాకుండా, ఈ రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ విమానం వేగవంతమైన సమయాన్ని అధిగమించిన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ గా కూడా నిలిచింది. ఇది 202 సెకన్ల సమయంతో 60 సెకన్లకు 3000 మీటర్లకు అధిరోహించి, అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. రోల్స్ రాయిస్ సమీప భవిష్యత్తులో తమ బృందం సాధించిన ఈ విజయాలను FAI అధికారికంగా ధృవీకరించవచ్చని భావిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ విమానం రికార్డ్-బ్రేకింగ్ పరుగుల సమయంలో, ఇది గరిష్టంగా గంటకు 623 కిమీ (గంటకు 387.4 మైళ్ల) వేగాన్ని సాధించింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనం.. మూడు ప్రపంచ స్పీడ్ రికార్డ్స్..

ఇలా మూడు ప్రపంచ స్పీడ్ రికార్డులను సృష్టించిన రోల్స్ రాయిస్ స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆల్-ఎలక్ట్రిక్ వాహనంగా మారింది. స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ ను కంపెనీ తమ ACCEL (యాక్సిలరేటింగ్ ది ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్) ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించింది. డిపార్ట్‌మెంట్ ఫర్ బిజినెస్, ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ మరియు ఇన్నోవేట్ యూకే భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ యొక్క సగం నిధులను ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ATI) అందించింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనం.. మూడు ప్రపంచ స్పీడ్ రికార్డ్స్..

రోల్స్ రాయిస్ స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లో 400 kW (500+ hp) సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ మరియు ఏరోస్పేస్ అప్లికేషన్ కోసం అసెంబుల్ చేయబడిన అత్యంత శక్తి-సామర్థ్యాలు కలిగిన ప్రొపల్షన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. రోల్స్ రాయిస్ ఏవియేషన్ ఎనర్జీ స్టోరేజ్ స్పెషలిస్ట్ ఎలక్ట్రోఫ్లైట్ మరియు ఆటోమోటివ్ పవర్‌ట్రెయిన్ సరఫరాదారు YASA భాగస్వామ్యంతో కలిసి వీటిని అభివృద్ధి చేశారు.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనం.. మూడు ప్రపంచ స్పీడ్ రికార్డ్స్..

అద్భుతమైన సాంకేతిక సాధనతో పాటు, ప్రాజెక్ట్ మరియు ప్రపంచ రికార్డు పరుగులు అన్ని-ఎలక్ట్రిక్ అర్బన్ ఎయిర్ మొబిలిటీ మరియు హైబ్రిడ్-ఎలక్ట్రిక్ కమ్యూటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్ మరియు ప్రొపల్షన్ సిస్టమ్‌ల కోసం ముఖ్యమైన డేటాను అందించాయి. బ్యాటరీల నుండి ఎయిర్-టాక్సీలకు అవసరమయ్యే లక్షణాలు, ఉదాహరణకు, స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ కోసం అభివృద్ధి చేయబడిన వాటితో సమానంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనం.. మూడు ప్రపంచ స్పీడ్ రికార్డ్స్..

రోల్స్ రాయిస్ బ్రాండ్‌కు ఫ్లయింగ్ వరల్డ్ స్పీడ్ రికార్డులను బ్రేక్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. గడచిన 1930 ల కాలంలో జరిగిన ష్నైడర్ ట్రోఫీల నాటి స్పీడ్ రికార్డును బద్దలు కొట్టిన చరిత్ర కూడా ఈ బ్రాండ్ కలిగి ఉంది. స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో టెస్ట్ పైలట్ మరియు రోల్స్ రాయిస్ డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఫిల్ ఓ'డెల్ సాధించిన వేగం గంటకు 213.04 కిలోమీటర్లు (గంటకు 132 మైళ్ల) కంటే ఎక్కువ. ఇది 2017 లో సిమెన్స్ ఇ-ఎయిర్‌క్రాఫ్ట్ పవర్డ్ ఎక్స్‌ట్రా 330 ఎల్ఈ ఏరోబాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా నెలకొల్పబడిన మునుపటి రికార్డు కంటే ఎక్కువ.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనం.. మూడు ప్రపంచ స్పీడ్ రికార్డ్స్..

భూమిలో శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేపథ్యంలో, కేవలం ఆటోమొబైల్ తయారీదారులే కాకుండా విమానయాన సంస్థలు మరియు ఇంధనాలపై ఆధారపడే ఇతర వాహనాల తయారీదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. వీటిలో ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్నది మరియు సులువుగా, తక్కువ ధరకే లభించేది విద్యుత్. కాబట్టి, ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జోరందుకుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిఫికేషన్ ట్రెండ్ (విద్యుదీకరణ శైలి) కార్ల నుండి విమానాలకు చేరుకుంది.

Most Read Articles

English summary
Rolls royce electric aircraft sets three speed records
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X