రోడ్డు పక్కన రోల్స్ రాయిస్ కార్ వాష్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు
కార్ల సర్వీస్‌లో భాగంగా యజమానులు తరచుగా కార్ వాష్ చేయించడం చూస్తూనే ఉంటాం. కారు మెయింటెనెన్స్‌లో వాషింగ్ తప్పనిసరి. లేదంటే అది కారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అయితే సాధారణ కార్లకూ, ఖరీదైన కార్లకు వాషింగ్ పద్ధతిలో తేడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఖరీదైన కారును రోడ్డు పక్కన వాష్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న సర్వీసింగ్ పాయింట్‌లో రోల్స్ రాయిస్(Rolls Royce Car Wash) కారు శుభ్రం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ. కోట్ల ఖరీదు చేసే కారును రోడ్డు పక్కన సర్వీసింగ్ చేయించడం అక్కడున్న వారితో పాటు నెటిజన్లను కూడా షాక్‌కు గురిచేస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

రోల్స్ రాయిస్ కార్లు అంటే లగ్జరీ, ఖరీదుకు మారుపేరు(Rolls Royce Car Wash at Road Side). ఇతర కార్లతో పోలిస్తే చాలా విశాలంగా, లగ్జరీ ఫీచర్లతో నిండి ఉంటాయి. దీంతో ఈ కార్ల ధరలు కూడా రూ. కోట్లలో ఉంటాయి. ఈ కారణంగా రోల్స్ రాయిస్ లాంటి ప్రీమియం లగ్జరీ కార్లు.. ధనవంతులు మాత్రమే కొనుగోలు చేయగలరు.
సెలబ్రిటీలు, వీఐపీల ఇళ్లలో ఇలాంటి ఖరీదైన కార్లను చూస్తుంటాం. అంతేకాకుండా రోల్స్ రాయిస్ లాంటి కార్లలో వారు బయటకు రావడం కూడా నెట్టింట్లో వైరల్ అవ్వడం జరుగుతుంటాయి. అయితే రోల్స్ రాయిస్ లాంటి కార్లను యజమానులు తరచుగా తమ ఇంట్లోనే శుభ్రం చేస్తుంటారు. రూ. కోట్లు ఖర్చు చేసి ఖరీదైన కార్లను కొనుగోలు చేసేవారికి ఇంట్లో కార్ వాషింగ్ ఏరియా నిర్మించడం పెద్ద విషయం కాదు.

అయితే కొంతమంది రోల్స్ రాయిస్ యజమానులు తమ కార్లను హై-ఎండ్ కార్ వాష్‌లకు తీసుకువెళతారు. ఎందుకంటే రోల్స్ రాయిస్ కార్లు, వాటి విడిభాగాల ధర ఎక్కువగా ఉంటుంది. వాషింగ్‌లో ఏదైనా తప్పు జరిగితే, దాన్ని సరిచేయడానికి రూ. లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది.
ఈ కారణంగా, రోల్స్ రాయిస్ యజమానులు ఎల్లప్పుడూ కార్ వాషింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు. కానీ ఢిల్లీలోని రోల్స్ రాయిస్ కారు యజమాని తన కారును రోడ్డు పక్కన ఉన్న కార్ వాష్ వద్ద శుభ్రం చేయించాడు. ఆ సమయంలో తీసిన వీడియో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కార్ వాష్ వద్దకు రాకముందు చాలా మురికిగా ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. కాగా మొదటి వాష్‌లోనే కారుపై ఉన్న మురికి తొలగిపోయింది. అయితే, మొదటి వాష్‌లోనే కారు నుంచి మొత్తం మురికిని పూర్తిగా తొలగిస్తుందని చెప్పలేం. అదేవిధంగా, మీ కారు రోడ్డు పక్కన ఉన్న కార్ వాష్ సర్వీసింగ్ వద్ద సరిగ్గా నిర్వహిస్తారనే గ్యారెంటీ కూడా లేదు.
ఈ క్రమంలో రోల్స్ రాయిస్‌లను శుభ్రం చేసే విషయంలో ఇతర కార్ల కంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దీని కారణంగా, చాలా మంది రోల్స్ రాయిస్ కార్ల యజమానులు తమ కార్లను కడగడానికి కూడా చాలా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును రోడ్డు పక్కన కార్ వాష్ వద్ద శుభ్రం చేయడం నెటిజన్లను ఆకర్షిస్తోంది.


Click it and Unblock the Notifications








