ఇళ్లు కొంటే రోల్స్ రాయిస్ కారు ఉచితం!!
ఇళ్లు, ప్రాపర్టీలను విక్రయించే రియల్టర్లు, వాటి కొనుగోలుపై ఖరీదైన ఆఫర్లు, బహుమతులు ఆఫర్ చేస్తుంటాయి. కానీ ఇళ్లు కొంటే ఎవరైనా రూ.3 కోట్లు ఖరీదు చేసే రోల్స్ రాయిస్ కారును గిఫ్ట్‌గా ఇస్తారా..? కానీ న్యూయార్క్‌లో ఇస్తారు. రోల్స్ రాయిస్ కారునే ఉచితంగా ఇస్తున్నాడంటే ఆ ఇంటి ఖరీదు ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి..!
వివరాల్లోకి వెళ్తే..
ఫ్లోరిడాలోని బోడా రాటన్‌లోని ఓ అత్యంత విలాసవంతమైన ఇంటిని సెనాడా ఆడ్జెమ్ అనే ఓ రియల్టర్ విక్రయానికి ఉంచాడు. ఈ మ్యాన్షన్ నీటిపై నిర్మించబడి ఉంటుంది. ఇందులో 7 గదులు, 8 బాత్రూమ్‌లు, సుమారు 16,000 చదరపు అడుగులు లివింగ్ స్పేస్ ఉంటుంది. ఈ ఇంటి ధర 12.75 మిలియన్ డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు 80 కోట్ల రూపాయలు).

ఫ్లోరిడాలో 12.75 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే మ్యాన్షన్‌ను కొనుగోలు చేసిన వారికి సదరు రియల్టల్ 5 లక్షల డాలర్ల ఖరీదు చేసే ఓ రోల్స్ రాయిస్ కారును ఉచితంగా ఇస్తున్నాడట. మన దేశ మార్కెట్లో ఈ రోల్స్ రాయిస్ కారు ధర సుమారు రూ.3 కోట్ల నుంచి రూ4. కోట్ల రేంజ్‌లో ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ మార్కెటింగ్ స్టంట్ ఇటు ఆటో ప్రియులను, ఆటో రియాల్టీ ప్రియులను ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications








