బ్రేకింగ్ న్యూస్; బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్న Amitabh Bachchan కి చెందిన Rolls Royce

భారతదేశంలో మోటార్ వాహన చట్టం ఇప్పుడు మరింత కఠినతరమైంది. ఎందుకంటే దేశంలో ప్రతి సంవత్సరం ఎంతోమంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం, డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటివి లేకపోతే మాత్రమే కాదు వాహనానికి సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ లేకపోతే కూడా ఆ వాహనాలను సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

బ్రేకింగ్ న్యూస్; బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్న Amitabh Bachchan కి చెందిన Rolls Royce

ఇటీవల తెలంగాణలో కొన్ని లగ్జరీ కార్లు ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి కారణం సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం మాత్రమే కాకుండా, వాహనానికి సంబంధించి టాక్స్ వంటివి చెల్లించకపోవడం. అయితే ఇప్పుడు ఇలాంటి సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బ్రేకింగ్ న్యూస్; బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్న Amitabh Bachchan కి చెందిన Rolls Royce

నివేదికల ప్రకారం బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు యుబి సిటీ పార్క్ సమీపంలో దాదాపు 17 కార్లను స్వాధీనం చేసుకున్నారు. దీని కోసం ఆర్‌టిఓ అధికారులు 2021 ఆగష్టు 22 సాయంత్రం ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న కార్లలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి.

బ్రేకింగ్ న్యూస్; బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్న Amitabh Bachchan కి చెందిన Rolls Royce

అధికారులు స్వాధీనం చేసుకున్న ఖరీదైన కార్లలో Rolls Royce (రోల్స్ రాయిస్) కంపెనీ యొక్క Phantom (ఫాంటమ్‌) కూడా ఉంది. అయితే ఈ రోల్స్ Rolls Royce Phantom యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ కారు ఒకప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ Amitabh Bachchan (అమితాబ్ బచ్చన్) పేరు మీద రిజిస్టర్ చేయబడింది. ఈ కార్లన్నీ ఇప్పుడు నగరం ఆర్‌టిఓ ఆధీనంలో ఉన్నాయి. కానీ ఈ కార్లను గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు.

బ్రేకింగ్ న్యూస్; బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్న Amitabh Bachchan కి చెందిన Rolls Royce

మీడియా కథనాల ప్రకారం, ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్న కార్లలో Rolls Royce Phantom (రోల్స్ రాయిస్ ఫాంటమ్) మాత్రమే కాకుండా Land Rover Range Rover Evoque, Jaguar XJ-L, Ferrari, Audi R8, Porsche వంటి అధునాత లగ్జరీ కార్లు ఉన్నాయి.

బ్రేకింగ్ న్యూస్; బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్న Amitabh Bachchan కి చెందిన Rolls Royce

బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు వివిధ కారణాల వల్ల ఈ విలాసవంతమైన లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా బెంగళూరు ఆర్‌టిఓ అధికారుల ప్రకారం వారు రవాణా సర్వేస్ వెబ్‌సైట్‌లో వివరాలను ధృవీకరించిన తర్వాత వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారు ఆన్‌లైన్‌లో సంబంధిత మరియు చెల్లుబాటు అయ్యే పత్రాలను కనుగొనలేదు. కావున ఈ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

బ్రేకింగ్ న్యూస్; బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్న Amitabh Bachchan కి చెందిన Rolls Royce

ఈ ఘటన బెంగళూరులోని వివిధ లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి దారి తీసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ఈ వాహనాలు కర్ణాటక రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్ చేయబడ్డాయి. రవాణా శాఖ Additional Commissioner Naredra Holkar (నరేంద్ర హోల్కర్) దీని గురించి సమాచారం ఇచ్చారు.

ఇక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్న Rolls Royce Phantom మహారాష్ట్రలో రిజిస్టర్ చేయబడినట్లు కనుగొనబడింది. దీనితో పాటు మిగిలిన 7 హై ఎండ్ కార్లను కూడా వీరు స్వాధీనం చేసుకున్నారు. నిజానికి Rolls Royce Phantom కారు 2019 లో Amitabh Bachchan పేరు మీద రిజిస్టర్ అయ్యిందని తెలిసింది.

బ్రేకింగ్ న్యూస్; బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్న Amitabh Bachchan కి చెందిన Rolls Royce

ఆ తరువాత బెంగళూరుకు చెందిన ఒక బిల్డర్ చేత కొనుగోలు చేయబడిందని తెలిసింది, అంతే కాకుండా దానిని సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి డ్రైవ్ చేస్తున్నట్లు కూడా నివేదించబడింది. అయితే కారుకి సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ కూడా తయారుచేసుకోలేదు, అంతే కాకుండా ఇన్సూరెన్స్ వంటివి కూడా లేకుండా ఈ కారు డ్రైవ్ చేయబడుతుంది.

బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు ఈ హై-ఎండ్ కార్ల యజమానులను కార్లకు సంబంధించిన డాక్యుమెట్స్ తయారుచేసుకోవాలని తెలిపింది. వాహనం యొక్క స్పష్టమైన యాజమాన్యాన్ని చూపించే ఏ డాక్యుమెంట్‌ను సమర్పించనందుకు ఆర్‌టిఓ అధికారులు ఈ కార్లను జప్తు చేశారు.

బ్రేకింగ్ న్యూస్; బెంగళూరు ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్న Amitabh Bachchan కి చెందిన Rolls Royce

ఈ కార్ ఓనర్లు కారుకి సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ సమర్పిస్తే వారి వాహనాలను వారికే అందిస్తామని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం వారు చూపించిన డాక్యుమెంట్స్ సంతృప్తికరంగా లేదని తెలిస్తే పోలీసులు దానిపై చర్య తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా వేయడానికి కావలసిన అనుమతి తీసుకుంటామని స్పష్టం చేశారు.

Most Read Articles

English summary
Rolls royce phantom seized by bangalore rto once owned by amitabh bachchan details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X