Romance on Bike బైక్‌పై సరసాలు.. వైరల్ అవుతున్న సోషల్ మీడియా కామెంట్స్
ఓవర్ నైట్ స్టార్ అవ్వడం కోసం కొందరు సోషల్ మీడియాను ఇష్టారాజ్యంగా వాడేసుకుంటున్నారు. దాని తర్వాత జరిగే పరిణామాల గురించి ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు. లక్షల్లో వ్యూస్, క్రేజ్, పాపులారిటీ కోసం వింత చేష్టలకు పాల్పడుతున్నారు. మరికొందరు ఇంకొంచెం ముందుకెళ్లి హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు.
సోషల్ మీడియాలో స్టార్ అవ్వడం అనేది ఈ రోజుల్లో క్రేజ్‌గా మారింది. దేశంలోని పబ్లిక్ రోడ్లపై వాహనాలపై ప్రయాణిస్తూ విన్యాసాలు చేయడం నేరమని తెలిసినా.. నెటిజన్లను ఆకర్షించేందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం తమ ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అర్ధరాత్రి బుల్లెట్ బైక్‌పై ఓ యువకుడు తన ప్రియురాలితో రొమాన్స్ చేస్తూ బైక్‌ను వేగంగా నడుపుతూ హల్‌చల్ చేశాడు. ఈ సంఘటనను వీడియో తీసిన మమతా త్రిపాఠి అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడి పోలీసులను ట్యాగ్ చేస్తూ కోరారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను 40,000 మందికి పైగా వీక్షించారు. 100 కంటే ఎక్కువ సార్లు రీట్వీట్ చేయబడింది. ఈ ఘటనపై విస్తుపోయిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను కూడా కోరారు.
ఇటీవల ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో యువతులిద్దరు బైక్‌పై విన్యాసాలు చేస్తూ రొమాన్స్ చేశారు. ఏ మాత్రం ప్రాణభయం లేకుండా ప్రవర్తించారు. దీన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై సరైన సమాచారం లేదు.
అదేవిధంగా ఇటీవల ఓ రాష్ట్రంలో ఓ యువకుడు వేగంగా వెళ్తున్న బైక్‌పై కూర్చొని ప్రియురాలితో రొమాన్స్ చేస్తున్న వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పందించిన అక్కడి పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుని మరోసారి ఇలా చేయొద్దని హెచ్చరించారు.
అదేవిధంగా ఇటీవల మహారాష్ట్ర, తమిళనాడులో అక్కడ ఎండ తీవ్రతను తెలిపేందుకు వింత చర్యలకు పాల్పడ్డారు. స్కూటర్లపై వెళ్తూ బకెట్‌లో నీళ్లు పోసుకుని స్నానం చేస్తూ ప్రయాణించారు. ఇది వారికే కాకుండా ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ కాగా మండిపడ్డ పోలీసులు వారికి జరిమానా విధించారు.
దేశంలోని పబ్లిక్ రోడ్లపై బైక్‌లు లేదా కార్లపై స్టంట్‌లు ఏ విధంగానూ అనుమతించబడవు. మీరు రేస్ ట్రాక్ లేదా మీ ప్రైవేట్ స్థలంలో ప్రదర్శన ఇవ్వాలనుకుంటే, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. రద్దీగా ఉండే రహదారిపై ఇలా చేసి ఇతరులకు అంతరాయం కలిగించడం నేరం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








