లాంబోర్గినీ అవంటేడర్‌ను కొనుగోలు చేసిన క్రిస్టియానో రొనాల్డో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యంత వేగంతో పరుగులు పెట్టే కారును కొనుగోలు చేశాడు. ఆ కారంటే మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. అదే ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ అందిస్తున్న "అవంటేడర్" సూపర్‌కార్. క్రిస్టియానో రొనాల్డో ఇటీవల తన 27వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతను సుమారు రూ.4 కోట్ల విలువైన లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్‌కారును కొనుగోలు చేశాడు.
నలుపు రంగులో మ్యాట్ ఫినిష్‌తో కూడిన అవెంటేడర్‌ను లాంబోర్గినీ కొత్తగా డిజైన్ చేసింది. ఇందులో శక్తివంతమైన 6.4 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 700 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అంటే సాంప్రదాయ కార్లతో పోల్చుకుంటే ఈ శక్తి ఏడు రెట్లు అధికం అన్నమాట. ఈ కారు కేవలం నాలుగు సెకండ్లలో మెరుపు వేగంతో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 324 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.


Click it and Unblock the Notifications









