రేంజ్ రోవర్ కారులో బ్రిటీష్ రాయల్ బేబీ తొలి సవారీ
బ్రిటీష్ రాజకుటుంబంలో మరొక యువరాజు జన్మించాడు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం దంపతులకు రెండు రోజుల క్రితం మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసినదే. బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.24 గంటలకు ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్ ఓ బుజ్జి యువరాజుకు జన్మనిచ్చింది. ప్రిన్స్ విలియం జన్మించిన ఆస్పత్రిలోనే, విలియం కుమారుడు కూడా జన్మించడం విశేషం.
లండన్‌లోని సెయింట్ మేరీ ఆసుపత్రిలో కేట్ మిడిల్టన్ మగబిడ్డను ప్రసవించింది. ఇదే ఆసుపత్రిలో లిండో వింగులో డయానా విలియంకు, హారీకి గతంలో జన్మినిచ్చారు. కాగా, తాజాగా జన్మించిన ఈ బ్రిటన్ రాయల్ బేబీ బ్రిటన్ సింహాసనానికి మూడో వారసుడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పిమ్మట ఈ రాయల్ బేబీని రాయల్ కారు (రేంజ్ రోవర్)లో రాజనివాసానికి తీసుకువెళ్లారు.
ఈ రాయల్ ఫ్యామిలీకి మరియు రాయల్ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్‌కు చిరకాల అనుబంధం ఉంది. బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ ఈ బ్రిటీష్ రాజ కుటుంబానికి దశాబ్ధాల కాలం నుంచి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం తరం రాజులు కూడా ఇదే బ్రాండ్‌లను ఉపయోగించడం చెప్పుకోదగిన విషయం. మరి ఈ బుజ్జి యువరాజు లగ్జరీ రైడ్ గురించి ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

రాయల్ బేబీ జననం
తమ రాజ్యానికి ఓ బుజ్జి యువరాజు జన్మించడంతో బ్రిటన్ పండుగ వాతావరణం నెలకొంది. ఆ దేశంలోని సంబరాలు చేసుకున్నారు. పలు దేశాధినేతల నుండి, రాజ కుటుంబాల నుండి అభినందనలు వెల్లువెత్తాయి.

రాయల్ బేబీ రైడ్
కొత్తగా జన్మించిన రాయల్ బేబీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బేబీ కార్ సీటును ఉపయోగించారు.

రాయల్ బేబీ రైడ్
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన సరికొత్త 2013 రేంజ్ రోవర్ కారులో రాయల్ బేబీని బ్రిటన్ కెన్సింగ్‌టన్ ప్యాలెస్‌కు తీసుకువెళ్లారు.

సేఫ్టీ సీట్
రాయల్ బేబీ కోసం తయారు చేసిన ఈ ప్రత్యేక బేబీ కార్ సీట్‌ను చైల్డ్ సీట్ లాక్స్ సాయంతో వెనుక సీటులో కదలకుండా ఉండేలా చేశారు.

బ్రిటన్‌లో సంబరాలు
కేట్ మిడిల్‌టన్‌కు క్షేమంగా ప్రసవమైందని, 3.8 కిలోల బరువున్న మగబిడ్డ పుట్టాడని, తల్లీ బిడ్డా క్షేమంగానే ఉన్నారని కెన్సింగ్‌టన్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించగానే సంబరాలు ప్రారంభమయ్యాయి.

రాత్రి వరకూ విషయం దాచారు
ప్రసవం సోమవారం సాయంత్రమే అయినా రాజకుటుంబం ఆనందానికి మీడియా, ప్రజల వల్ల విఘాతం కలగకుండా రాత్రి ఎనిమిదిన్నరదాకా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. మంగళవారం మిడిల్ టన్ ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నారు.

తండ్రి తనయులు ఒకే ఆస్పత్రిలో..
ప్రిన్స్ విలియం జన్మించిన ఆస్పత్రిలోనే, విలియం కుమారుడు కూడా జన్మించడం విశేషం. లండన్‌లోని సెయింట్ మేరీ ఆసుపత్రిలో కేట్ మిడిల్టన్ మగబిడ్డను ప్రసవించింది. ఇదే ఆసుపత్రిలో లిండో వింగులో డయానా విలియంకు, హారీకి గతంలో జన్మినిచ్చారు.

మూడవ వారుసుడు
తాజాగా జన్మించిన ఈ బ్రిటన్ రాయల్ బేబీ బ్రిటన్ సింహాసనానికి మూడో వారసుడు.

రాయలర్ రేంజ్ రోవర్ గురించి..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న ప్రముఖ బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్ తమ సరికొత్త 2013 రేంజ్ రోవర్ ఎస్‌యూవీని గడచిన సంవత్సరం చివర్లో విడుదల చేసింది. భారత్‌లో కూడా ఇది లభ్యమవుతోంది.

4వ తరం రేంజ్ రోవర్
ల్యాండ్ రోవర్ తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చిన '2013 రేంజ్ రోవర్' 4వ తరానికి (ఫోర్త్ జనరేషన్) చెందినది. ఈ కారును పూర్తిగా బ్రిటన్‌లో తయారు చేస్తున్నారు. అక్కడి నుండే ఇది విదేశాలకు ఎగుమతి అవుతుంది.

రేంజ్ రోవర్ పెట్రోల్
పెట్రోల్ వెర్షన్ 2013 రేంజ్ రోవర్‌లో 5 లీటర్ వి8 సూపర్‌ఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 503 బిహెచ్‌పిల శక్తిని, 625 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది

రేంజ్ రోవర్ డీజిల్
డీజిల్ వెర్షన్ రేంజ్ రోవర్‌లో 4.4 లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 335 బిహెచ్‌పిల శక్తిని, 700 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

ట్రాన్సిమిషన్
ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించే ఈ కొత్త రేంజ్ రోవర్‌లో 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్‌బాక్సును ఉపయోగించారు.

బకింగ్ హామ్ ప్యాలెస్
బ్రిటన్ యువరాజు సతీమణి కేట్ మిడిల్‌టన్ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో రాజకుటుంబం నివాసం ఉండే బకింగ్ హామ్ ప్యాలెస్ వద్ద యువరాణి పిల్లాడికి జన్మనిచ్చినట్లుగా అధికార ప్రకటన ఉంచారు.

ఆ నాడు..
ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ పెళ్లి నాటి ఫొటో


Click it and Unblock the Notifications








