ఎలిజబెత్ రాణి కారులో పెళ్లికి వచ్చిన యువరాణి కేథరీన్

ఈ కారును 1977లో క్వీన్ ఎలిజబెత్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు. క్వీన్ ధరించే పొడవైన టోపీతో పాటు ఆమె లోపలికి ప్రవేశించే విధంగా కారు బాడీని ఎత్తుగా, అలాగే ఆమె దారిలో వెళ్లేటప్పుడు ప్రజలందరికీ కనిపించే విధంగా ఈ కారును రూపొందించారు. ఈ కారులో కేథరీన్ మరియు ఆమె తండ్రి రానున్నారు. అలాగే ప్రిన్స్ విలియమ్స్ కూడా వేరుగా, అతని కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రాయల్ బెంట్లీ కారులో పెళ్లి జరిగే చోటుకు రానున్నారు. గతంలో ఈ బెంట్లీ కారును ఎన్నో సందర్భాలలో రాజ కుటుంబం వినియోగించింది. ప్రిన్స్ విలియన్స్ తన సోదరుడు ప్రిన్స్ హ్యారీతో కలిసి ఈ కారులో రానున్నారు.


Click it and Unblock the Notifications








