Just In
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 1 hr ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 1 hr ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 2 hrs ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- Movies
రిలీజ్కు ముందే లీకైన ‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్: అసలు కథ అప్పుడే మొదలు.. ప్రభాస్ అలా పూజా ఇలా!
- Sports
రోహిత్ అండ్ టీమ్పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- News
COVID-19: ముంబాయి, ఢిల్లీని ఐటి హబ్ బీట్ చేస్తోందా ? కరోనా కాటు, ఇక హోటల్స్ దిక్కు !
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి
భారతదేశంలో ఐటి సిటీగా ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరం రోజురోజుకి బాగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో ఎంతోమంది ప్రజలను బెంగళూరు నగరం ఆకర్షిస్తుంది. దేశం నలుమూలల నుండి ప్రజలు తమ ఉపాధి కోసం బెంగళూరుకు వస్తారు. బెంగుళూరులో ఐటి కంపెనీలు మాత్రమే కాదు, అనేక ఆకర్షణీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి.

వీటన్నిటి కారణంగా, బెంగళూరు ఎంతోమంది పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులను మరింత ఆకర్షించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ రెంటెడ్ వెహికల్ సర్వీస్ ప్రారంభించింది. వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఈ సర్వీస్ ప్రారంభమైంది.

ఈ సర్వీస్ లో భాగంగా హార్లీ డేవిడ్సన్ బైక్‌ల నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల వరకు అనేక కంపెనీల బైకులు అందుబాటులో ఉంటాయి. బెంగళూరులో ఈ సర్వీస్ రాయల్ బ్రదర్స్ ప్రారంభించింది. కంపెనీ కెంపెగౌడ విమానాశ్రయం ప్రవేశద్వారం దగ్గర ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
MOST READ:కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

విమానప్రయాణం ముగించుకుని వచ్చే ప్రయాణికులను ఆకర్షించడానికి కంపెనీ తన ఆఫీస్ ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటు చేసింది. ఈ సర్వీస్ పొందాలనుకునే వినియోగదారులు నేరుగా సందర్శించి తమకు ఇష్టమైన బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ రెంటల్ వెహికల్స్ రాయల్ బ్రదర్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్ (www.royalbrothers.com) ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.

దీనిని బుక్ చేసుకోవడానికి సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించిన వెంటనే బైక్ జారీ చేయనున్నట్లు రాయల్ బ్రదర్స్ కంపెనీ తెలిపింది. ఈ సంస్థకు విమానాశ్రయంలో గ్యారేజ్ ఉంది. ఈ కారణంగా రెంటల్ వెహికల్స్ తిరిగి తీసుకురావడం అవసరం. ఈ సర్వీస్ కొన్ని రోజులు మాత్రమే బెంగళూరుకు వచ్చే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
MOST READ:మెర్సిడెస్ జి-వాగన్ ఎస్యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

ఈ సందర్భంగా రాయల్ బ్రదర్స్ సీఈఓ చంద్ర సెహగర్ మాట్లాడుతూ వినియోగదారులకు బైక్‌లు మాత్రమే కాకుండా జాకెట్లు, హెల్మెట్లు, హ్యాండ్ గ్లోవ్స్‌తో సహా పలు భద్రతా యాక్ససరీస్ కూడా అందిస్తున్నారు.

రాయల్ బ్రదర్స్ కంపెనీ ఈ సేవను ప్రారంభించిన కొద్దిసేపటికే ప్రజల నుండి మంచి స్పందనను పొందుతున్నట్లు వారు తెలిపారు. రాయల్ బ్రదర్స్ సర్వీస్ రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ సర్వీస్ నిజంగానే బెంగళూరు మహానగరం వంటి నగరాలలో చాలా అవసరం, దీనికి తప్పకుండా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.
MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి