బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

భారతదేశంలో ఐటి సిటీగా ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరం రోజురోజుకి బాగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో ఎంతోమంది ప్రజలను బెంగళూరు నగరం ఆకర్షిస్తుంది. దేశం నలుమూలల నుండి ప్రజలు తమ ఉపాధి కోసం బెంగళూరుకు వస్తారు. బెంగుళూరులో ఐటి కంపెనీలు మాత్రమే కాదు, అనేక ఆకర్షణీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి.

బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా చేయండి

వీటన్నిటి కారణంగా, బెంగళూరు ఎంతోమంది పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులను మరింత ఆకర్షించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ రెంటెడ్ వెహికల్ సర్వీస్ ప్రారంభించింది. వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఈ సర్వీస్ ప్రారంభమైంది.

బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా చేయండి

ఈ సర్వీస్ లో భాగంగా హార్లీ డేవిడ్సన్ బైక్‌ల నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల వరకు అనేక కంపెనీల బైకులు అందుబాటులో ఉంటాయి. బెంగళూరులో ఈ సర్వీస్ రాయల్ బ్రదర్స్ ప్రారంభించింది. కంపెనీ కెంపెగౌడ విమానాశ్రయం ప్రవేశద్వారం దగ్గర ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

MOST READ:కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా చేయండి

విమానప్రయాణం ముగించుకుని వచ్చే ప్రయాణికులను ఆకర్షించడానికి కంపెనీ తన ఆఫీస్ ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటు చేసింది. ఈ సర్వీస్ పొందాలనుకునే వినియోగదారులు నేరుగా సందర్శించి తమకు ఇష్టమైన బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ రెంటల్ వెహికల్స్ రాయల్ బ్రదర్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్ (www.royalbrothers.com) ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.

బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా చేయండి

దీనిని బుక్ చేసుకోవడానికి సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించిన వెంటనే బైక్ జారీ చేయనున్నట్లు రాయల్ బ్రదర్స్ కంపెనీ తెలిపింది. ఈ సంస్థకు విమానాశ్రయంలో గ్యారేజ్ ఉంది. ఈ కారణంగా రెంటల్ వెహికల్స్ తిరిగి తీసుకురావడం అవసరం. ఈ సర్వీస్ కొన్ని రోజులు మాత్రమే బెంగళూరుకు వచ్చే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

MOST READ:మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా చేయండి

ఈ సందర్భంగా రాయల్ బ్రదర్స్ సీఈఓ చంద్ర సెహగర్ మాట్లాడుతూ వినియోగదారులకు బైక్‌లు మాత్రమే కాకుండా జాకెట్లు, హెల్మెట్లు, హ్యాండ్ గ్లోవ్స్‌తో సహా పలు భద్రతా యాక్ససరీస్ కూడా అందిస్తున్నారు.

బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా చేయండి

రాయల్ బ్రదర్స్ కంపెనీ ఈ సేవను ప్రారంభించిన కొద్దిసేపటికే ప్రజల నుండి మంచి స్పందనను పొందుతున్నట్లు వారు తెలిపారు. రాయల్ బ్రదర్స్ సర్వీస్ రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ సర్వీస్ నిజంగానే బెంగళూరు మహానగరం వంటి నగరాలలో చాలా అవసరం, దీనికి తప్పకుండా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.

MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

Most Read Articles

English summary
Royal Brothers Company Starts New Service At Kempegowda International Airport. read in Telugu.
Story first published: Tuesday, March 9, 2021, 12:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X