ఐపీఎల్ వేడి మధ్య బెంగళూరుకు బిగ్ షాక్! RCB పేరే మార్చేసి బైక్ మీద పారిపోయిన హెడ్.. ఉబర్‌పై లీగల్ కేసు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కేవలం టోర్నమెంట్ కాదు, భారతదేశంలో క్రికెట్‌ను పండుగలా మారుస్తుంది. ఐపీఎల్‌లో ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల మార్కెట్ జరుగుతుంది. ప్రపంచంలోని అత్యంత లాభదాయకమైన లీగ్‌గా పేరుంది. స్టార్ ఆటగాళ్లు, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, అభిమానుల హోరాహోరీ.. ఈ అన్ని కలసి ఐపీఎల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ ఏడాది ఐపీఎల్ తన 18వ సీజన్‌లో అడుగుపెడుతోంది. ఈ లీగ్‌లో దేశంలోని 10 ప్రధాన నగరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. వీటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉంది. ఈ జట్టు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటిగా నిలిచింది. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లతో ఇది చాలా మంది ఫేవరెట్ టీంగా ఉంది.
ప్రస్తుత ఐపీఎల్ ఎంతో అట్టహసంగా .జరుగుతుంది. తమ ఫేవరెట్ టీం ఈ సారి కప్పు గెలవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే ఈ సమయంలో క్రికెట్‌తో ఎలాంటి సంబంధం లేకుండా లేని దాని కోసం ఆర్‌సీబీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. దానికి కారణం, అతడు ఉబర్ సంస్థతో కలిసి చేసిన ఓ ప్రకటన.

సాధారణంగా క్రికెటర్ల యాడ్స్ సందడి చేస్తుంటాయి కానీ ఈసారి మాత్రం అది సమస్యగా మారింది. ఇటీవల విడుదలైన ఒక ప్రకటనలో "రాయల్లీ ఛాలెంజ్డ్ బెంగళూరు" అనే పదాన్ని వినిపించడంతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ బ్రాండ్‌ను, పేరును వ్యంగ్యంగా చేసినట్లు ఉందని భావించి, యాడ్‌ను వెంటనే తీసివేయాలంటూ ఢిల్లీ హైకోర్టును RCB ఆశ్రయించింది.
ఉబర్ ప్రకటన తమకు నష్టం కలిగించిందని, తమ గౌరవాన్ని దెబ్బతీసిందని కోర్టులో ఫిర్యాదు చేసింది. యాడ్‌ను తక్షణమే తొలగించాలంటూ కోర్టును కోరింది. దీంతో ట్రావిస్ హెడ్ ఆకస్మికంగా వార్తల్లోకి ఎక్కాడు. అతను ఏ మేరకు బాధ్యుడో అన్నది ఇప్పట్లో తేలనప్పటికీ, యాడ్‌లో వాడిన పదాలు మాత్రం వివాదానికి తెరలేపాయి. దేశంలోని ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్లలో ఉబర్ ఒకటి. ఉబర్ క్యాబ్, ఆటో, బైక్ టాక్సీ సేవలను దేశం అంతటా అందిస్తుంది.

బైక్ టాక్సీల ప్రకటనలో ఉబర్ తమ నినాదాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించిందని RCB ఆరోపిస్తుంది. ఉబెర్ ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లో 'బడ్డీస్ ఇన్ బెంగళూరు' అనే ప్రకటన షేర్ చేయడంతో ఈ తాజా వివాదం కాస్త చెలరేగింది. వీడియో ప్రకటనలో వచ్చిన దాని ప్రకారం, ట్రావిస్ హెడ్ స్టేడియంలోని గేటును దొంగచాటుగా దాటి లోపలికి ప్రవేశిస్తాడు. అక్కడ "బెంగళూరు vs హైదరాబాద్" అంటూ ఉన్న ఓ పెద్ద పోస్టర్ కనిపిస్తుంది.
అదే సమయంలో, హెడ్ తన చేతిలో ఉన్న స్ప్రేతో "బెంగళూరు" అనే పదాన్ని తిరగరాస్తూ, దానిపైన "రాయలీ ఛాలెంజ్డ్" అనే మాటలను రాస్తాడు. ప్రకటన చివర్లో ట్రావిస్ హెడ్ ఆ స్ప్రే చేసిన ప్లేస్ నుండి సెక్యూరిటీ గార్డులను తప్పించుకుని ఓ బైక్ టాక్సీలో తప్పించుకుంటూ వెళ్తాడు. ఇది ఒక రకమైన అవమానంగా భావించిన RCB యాజమాన్యం, వెంటనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
తమ బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ఈ యాడ్ రూపొందించారని, వీడియోను తక్షణమే తీయివేయాలని కోరింది. "రాయలీ ఛాలెంజ్డ్ బెంగళూరు" అనే పదాలను కావాలనే ఎంచుకుని తమ పేరు వక్రీకరించారని అభిప్రాయం వ్యక్తం చేసింది. మరోవైపు, క్రికెట్ అభిమానుల కోసం స్నేహపూర్వక, ఉల్లాసాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో, ఈ ప్రచారం రూపొందించామని ఉబర్ వాదిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








